Kia Sonet: మెరుగైన డిజైన్‌, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు సహా కీలక అప్‌గ్రేడ్‌లతో కియా సోనెట్‌ ఫేస్‌లిఫ్ట్‌ SUV..!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా నుంచి త్వరలో సోనెట్‌ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ ( Kia sonet SUV Facelift ) అందుబాటులోకి రానుంది. డిసెంబర్‌ 14న ఈ ఎస్‌యూవీని ఆవిష్కరణకు సిద్ధం చేస్తున్నారు. 2020 సంవత్సరంలో కియా సోనెట్ ఎస్‌యూవీని లాంచ్‌ చేశారు. మరికొన్ని రోజుల్లో ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను లాంచ్‌ చేయనున్నారు.

కియా సోనెట్‌ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ అనేక మార్పులతో రానున్నట్లు తెలుస్తోంది. ఇంటీరియర్‌, ఎక్ట్సీరియర్‌లో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ కీలక డిజైన్‌ మార్పులు చేసినట్లు సమాచారం. కొత్త గ్రిల్‌, LED హెడ్‌ల్యాంప్‌లు, LED DRLలు సహా బంపర్‌లోనూ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు LED టెయిల్‌ ల్యాంప్‌లు, LED లైట్‌ బార్‌ సహా ఎస్‌యూవీ వెనుక భాగంలో కీలక డిజైన్‌ మార్పులు చేశారు.

Kia sonet SUV Facelift

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కీలక మార్పులు : కియా సోనెట్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌ కూడా కీలక మార్పులకు గురైంది. ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌ పూర్తిగా అప్‌డేట్‌ చేశారు. భద్రతా కోణంలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు మరియు ADAS - అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌తో వస్తుందని తెలుస్తోంది.

కియా సోనెట్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్‌ వివరాలు : ఈ ఎస్‌యూవీ 1.2 లీటర్‌ నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌, 1,0 టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. వేరియంట్‌ను బట్టి 5-స్పీడ్‌ మాన్యువల్‌, 6-స్పీడ్, 7-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Kia sonet SUV Facelift specs

అయితే ఈ సోనెట్‌ కొత్త ఎస్‌యూవీ ఎంత ధరకు కొనుగోలుకు అందుబాటులోకి వస్తుందనే సమాచారం వెల్లడికాలేదు. అయితే పాత మోడల్‌తో పోలిస్తే ధర కొంచెం అధికంగా ఉంటుందని తెలుస్తోంది. అంచనా ప్రకారం రూ.7.99 లక్షల నుంచి రూ.15.50 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.

కొత్త కియా సోనెట్ ఎస్‌యూవీ హ్యుందాయ్‌ వెన్యూ, టాటా నెక్సాన్‌, త్వరలో అందుబాటులోకి రానున్న మహీంద్రా XUV300 ఫేస్‌లిఫ్ట్‌, నిస్సాన్‌ మాగ్నైట్‌, టాటా పంచ్‌, మారుతి సుజుకి బ్రెజ్జా వంటి కార్లతో పోటీపడే అవకాశం ఉంది. డిసెంబర్‌ 14న ఈ ఎస్‌యూవీ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

భారత్‌లో కియా సంస్థ తయారీ ప్లాంట్‌ ఆంధ్రప్రదేశ్‌ని అనంతపురం జిల్లాలో ఉంది. ఈ ప్లాంట్‌ నుంచే తన మోడల్‌ కార్లను తయారుచేసి దేశవ్యా్ప్తంగా విక్రయిస్తోంది మరియు విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇప్పటికే కియా కార్లు కీలక విక్రయాల మైలురాయిని దాటి రికార్డులు సృష్టించాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Friday, December 1, 2023, 10:50 [IST]
English summary
Kia sonet suv facelift will be unveiled on december 14 here are the expected specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+