ఆటో ఎక్స్‌పో 2023: కియా KA4 లేటెస్ట్ MPV.. పరిమాణంలో హైక్రాస్ కంటే పెద్దది గురూ
దక్షిణ కొరియా కార్ తయారీ సంస్థ అయిన కియా మోటార్స్ దేశీయ మార్కెట్లో తన KA4 MPV ని 2023 ఆటో ఎక్స్‌పో వేదిక మీద అధికారికంగా ఆవిష్కరిందింది. ఈ MPV గ్లోబెల్ మార్కెట్లో అడుగు పెట్టిన రెండు సంవత్సరాల తరువాత భారతీయ మార్కెట్లో అడుగుపెట్టింది.
కియా KA4 మంచి డిజైన్ కలిగి ఉండటమే కాకుండా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఎక్కువ స్పేస్ పొందింది. ఇది ప్రస్తుతము మార్కెట్లో అందుబాటులో ఉన్న కియా కార్నివాల్ తో పోలిస్తే ఇది మరింత ఉత్తమంగా ఉంటుంది. ఈ MPV ముందు భాగంలో 'టైగర్ నోస్' గ్రిల్‌ను డైమండ్ నమూనాతో ఉంటుంది. దానికి చుట్టూ ఆకర్షణీయమైన హెడ్‌లైట్లు చూడవచ్చు. కింది భాగంలో ఉన్న ఎయిర్ ఇంటేక్ వద్ద క్రోమ్ ఫినిషింగ్ కూడా చూడవచ్చు.

సైడ్ ప్రొఫైల్ లో క్యారెక్టర్ లైన్ కనిపిస్తుంది. ఇది హెడ్ లాంప్ మరియు టెయిల్ లాంప్ రెండింటిని కలుపుతూ ఉంటుంది. C-పిల్లర్‌పై బ్రష్ చేయబడిన అల్యూమినియం ట్రిమ్ ఉంటుంది. అయితే A, B, మరియు D పిల్లర్స్ మీద బ్లాక్ కలర్ చూడవచ్చు. వెనుక వైపు సమాంతరంగా రెండు వైపులా నడిచే టెయిల్ లైట్ ఉంటుంది. అదే సమయంలో రూప్ స్పాయిలర్ మరియు షార్క్ పిన్ వంటివి చూడవచ్చు.
ఇంటీరియర్ విషయానికి వస్తే, కియా KA4 MPV మినిమలిస్ట్ డిజైన్ కలిగి చూడ చక్కగా ఉంటుంది. ఇందులో 12.3 ఇంచెస్ డిస్ప్లేలు రెండు సెంటర్ స్టేజ్‌లో ఉన్నాయి. అంతే కాకుండా పవర్డ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్ మరియు ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి మరిన్ని ఆధునిక ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా మరియు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

కియా KA4 అంతర్జాతీయ మార్కెట్లలో రెండు ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది. అవి ఒకటి 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, మరొకటి 3.5 లీటర్ V6 పెట్రోల్ ఇంజన్. 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ 197 బిహెచ్‌పి ప్రొడ్యూస్ చేస్తే, 3.5-లీటర్ V6 పెట్రోల్ ఇంజన్ 292 బిహెచ్‌పి ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఉన్న కియా కార్నివాల్ 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి ఉంది. కావున KA4 కూడా ఇదే ఇంజిన్ తో ముందుకు సాగే అవకాశం ఉంటుంది.
కొత్త కియా KA4 MPV 5,155 మిమీ పొడవు, 1,995 మిమీ వెడల్పు మరియు 1,775 మిమీ ఎత్తు కలిగి, 3,090 మిమీ పొడవైన వీల్‌బేస్ పొందుతుంది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న కియా కార్నివాల్ కంటే ఇది 40 మిమీ పొడవు, 10 మిమీ వెడల్పు మరియు 20 మిమీ ఎత్తు ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా వీల్‌బేస్ పొడవు కూడా 30 మిమీ ఎక్కువగా ఉంటుంది.

కియా KA4 సీటింగ్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే, ఇది 7 సీటర్, 9 సీటర్ మరియు 11 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో వచ్చే అవకాశం ఉంటుంది. దీని ధర ఇంకా కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు, అయినప్పటికీ దీని ధర రూ. 31 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. దేశీయ మార్కెట్లో విడుదల కానున్న ఈ MPV ఆధునిక ఫీచర్స్ కలిగి విశాలంగా ఉండటం వల్ల తప్పకుండా మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని ఆశిస్తున్నాము.
2023 ఆటో ఎక్స్‌పోలో అద్భుతమైన మరియు అధునాతన మోడల్స్ ఆవిష్కరించడతాయి మరియు విడుదలవుతాయి. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడే/విడుదలయ్యే వాహనాలను గురించి అప్డేటెడ్ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' ఫై క్లిక్ చేయండి. అదే విధంగా కొత్త వాహనాలను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా అధికారిక సోషల్ మీడియా పేజీలను అనుసరిస్తూ మీకు కావాల్సిన సమాచారం పొందండి.


Click it and Unblock the Notifications








