Discontinued Cars 2023: ఒకప్పుడు ఈ కార్లకు ఫుల్ డిమాండ్.. కానీ ఆ కారణంగా విక్రయాల నిలిపివేత.. ఆ కార్లు ఇవే.!
2023 సంవత్సరాన్ని భారత ఆటోమొబైల్ రంగం శాసించిందనే చెప్పవచ్చు. ఎందుకంటే కరోనా కారణంగా గతంలో ఆటో మొబైల్ రంగంలో ఒడుదొడుకులు ఏర్పడినా.. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వాహనాల సేల్స్ నమోదయ్యాయి. ముఖ్యంగా పండుగ సీజన్‌లో అత్యధిక విక్రయాలతో ఆటో మేకర్లు రికార్డులను సాధించాయి.
భారత్‌లో చాలా వరకు ఈ ఏడాది సెలబ్రిటీల నుంచి మొదలుకొని సాధారణ ప్రజల వరకూ కొత్త కార్లు, బైక్‌లను కొనుగోలు చేసి పండుగలను సెలబ్రేట్ చేసుకున్నారు. అదే సమయంలో, కొన్ని కార్ మోడళ్లకు ఈ సంవత్సరం చివరి అధ్యాయంగా ముగిసింది. ఎన్నో ఏళ్లుగా మంచి విక్రయాలను నమోదు చేసుకుంటున్న కారు మోడళ్లను వచ్చే ఏడాది నుంచి కొనుగోలు చేయలేరు. ఆ కార్ల జాబితా ఈ కథనంలో..

మారుతి సుజుకి ఆల్టో 800 (Maruti Alto 800): దశాబ్దాలుగా భారత మార్కెట్లో విక్రయిస్తున్న మారుతి సుజుకి ఆల్టో 800.. ఏప్రిల్ 2023లో దశలవారీగా నిలిపివేయబడింది. ఇది 800 cc ఇంజిన్‌తో కూడిన కారు మోడల్. అధిక మైలేజ్‌ని కోరుకునే కారు ప్రియులకు ఇది ఇష్టమైన కారు మోడల్‌గా నిలిచింది.

మారుతి సుజుకి ఆల్టో 800 మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ కావడంతో ఈ కారుకు డిమాండ్ భారీగానే ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వ కొత్త భద్రతా నియమాలు మరియు ఉద్గార నియమాల కారణంగా ఈ కారును విక్రయం నుండి ఉపసంహరించారు.
హోండా సిటీ డీజిల్, 4వ తరం సిటీ & అమేజ్ డీజిల్: కేంద్ర ప్రభుత్వ కొత్త ఉద్గార నిబంధనల కారణంగా భారత మార్కెట్ నుంచి హోండాకు చెందిన కొన్ని కార్ మోడళ్లను కూడా ఉపసంహరించుకుంది. అందుకని, ఈ సంవత్సరం అమ్మకాల నుండి ఈ మూడు కార్ మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసింది.

హ్యుందాయ్ ఐ20 డీజిల్ మరియు వెర్నా డీజిల్ (హ్యుందాయ్ ఐ20 డీజిల్ - వెర్నా డీజిల్): డీజిల్ కార్లపై తీసుకున్న కఠినమైన ఉద్గార చర్యల కారణంగా కూడా ఈ కార్ మోడళ్లను కూడా నిలిపివేశారు. ఈ కార్లకు మార్కెట్లో మంచి ఆదరణ లభించినప్పటికీ వాటిని అమ్మకం నుండి సంస్థ తొలగించింది.
ఈ కార్లకు భారత్‌లో మంచి ఆదరణ లభిస్తుండటంతో.. హ్యుందాయ్ వీటిని విక్రయించేందుకు చర్యలు చేపట్టింది. అయితే ఫిబ్రవరి 2023లోనే ఈ కారు విక్రయం నుండి సంస్థ ఉపసంహరించింది. ఈ కారు నుంచి వెలువడే ఉద్గారాల కారణంగా, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లోని డీజిల్ ఇంజిన్ కార్ మోడల్‌లు ఇప్పుడు చాలా తగ్గాయి.

హ్యుందాయ్ ఐ20 డీజిల్ మాదిరిగానే మరో కార్ మోడల్‌గా వెర్నా మార్కెట్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం విక్రయిస్తున్న కొత్త తరం వెర్నాను కేవలం రెండు మోటారు ఆప్షన్లతో కొనుగోలు చేయవచ్చు. 1.5-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ నేచురల్లీ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో ప్రవేశపెట్టింది. ఈ సెడాన్ మోడల్ నుంచి డీజిల్ ఆప్షన్‌ను పూర్తిగా తొలగించారు.
టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్: భారత మార్కెట్లో టయోటా ఇన్నోవా హిక్రాస్ హైబ్రిడ్ మరియు నాన్-హైబ్రిడ్ వెర్షన్‌లలో అందుబాటులో ఉండగా.. టయోటా ఇన్నోవా క్రిస్టాను సంస్థ డీజిల్ ఆప్షన్‌లో మాత్రమే అందిస్తోంది. దీని పెట్రోల్ వెర్షన్‌ను నిలిపివేసింది. కొత్త BS6 స్టేజ్ 2 నిబంధనల కారణంగా స్కోడా తన ఆక్టావియా మరియు సూపర్బ్ కార్ మోడళ్లను ఉపసంహరించుకుంది. ఈ కార్లు మార్కెట్లో పెద్దగా ప్రాచుర్యం పొందలేదని గమనించాలి.

రెనాల్ట్ క్విడ్ 800: భారత మార్కెట్లో రెనాల్ట్ క్విడ్ బడ్జెట్ కార్ మోడల్. ఈ కారును ఇటీవలే విక్రయం నుంచి సంస్థ ఉపసంహరించుకుంది. ఇందుకు కారణం కొత్త ఉద్గార నిబంధనలు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఈ కారు విక్రయాలు ఆగిపోయాయి. క్రెటా, సెల్టోస్‌లకు పోటీగా అమ్మకానికి అందుబాటులోకి వచ్చిన నిస్లాన్ కిక్స్.. పోటీ తట్టుకోకపోవడంతో విక్రయాల నుంచి ఉపసంహరించుకుంది.

హోండా WR-V & జాజ్: ఈ ఏడాది ఏప్రిల్‌లో WR-V కార్ మోడల్‌ను హోండా నిలిపివేయగా.. ఆ తర్వాత అదే నెలలో జాజ్‌ను కూడా నిలిపివెసింది. అయితే ఈ రెండూ త్వరలో అప్‌డేట్ చేయబడిన మోడల్స్‌గా అందుబాటులోకి వస్తాయని సమాచారం. అయితే దీనికి సంబంధించి హోండా నుంచి ఎటువంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. పైన పేర్కొన్న డీజిల్ కార్లన్నీ భారత మార్కెట్లో మంచి ఆదరణ పొందినప్పటికీ, వీటిని కొత్త ఉద్గార నిబంధనల కారణంగా నిలిపివేశారు.


Click it and Unblock the Notifications








