Top 5 Car brands: నవంబర్ సేల్స్‌లో సత్తా చాటిన ప్రముఖ బ్రాండ్ల కార్లు ఇవే..
దేశంలో ప్రతి ఏటా కార్ల విక్రయాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా పండుగ సీజన్ వచ్చిందంటే కార్ల కంపెనీలకు విక్రయాల పండగే.. ఈ ఏడాది నవంబర్‌లో దీపావళి సీజన్ సందర్భంగా భారత్‌లో కార్ల విక్రయాలు ఆశాజనకంగానే నమోదయ్యాయి. గత నెలలో అత్యధిక సేల్స్(Car Sales In November)ను నమోదు చేసిన టాప్ 5 కార్ల కంపెనీ జాబితా విడుదలైంది.
2023 నవంబర్‌లో భారత మార్కెట్‌లో అత్యధిక కార్లను విక్రయించిన టాప్-5 కార్ కంపెనీల జాబితా వెల్లడైంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మొదటి స్థానంలో నిలిచింది. సరసమైన ధరలో మధ్యతరగతి ప్రజలకు మారుతి సుజుకి కార్లు కస్టమర్లలో విపరీతమైన ప్రజాదరణ పొందాయి. మరి మారుతితో పాటు టాప్ 5 లో చోటు దక్కించుకున్న మిగతా కంపెనీల వివరాలు చూద్దాం.

మారుతీ సుజుకీ(Maruti Suzuki): ఈ ఏడాది నవంబర్‌లో మారుతి సుజుకి అత్యధికంగా 1,34,158 కార్లను విక్రయించింది. దాదాపు లక్షన్నరకు చేరువలో కార్లను విక్రయించడం ద్వారా ఈ జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది నవంబర్‌తో పోలిస్తే 1.3 శాతం వృద్ధిని సాధించింది. స్విఫ్ట్, వ్యాగన్ ఆర్, ఎర్టిగా, బ్రెజ్జా, గ్రాండ్ విటారా కార్లు భారత మార్కెట్‌లో మారుతి సుజుకి అమ్మకాల్లో టాప్‌గా నిలవడానికి దోహదపడ్డాయి.

హ్యుందాయ్(Hyundai Motors): ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఈ ఏడాది నవంబర్‌లో 49,451 కార్లను విక్రయించి.. టాప్ 5 జాబితాలో 2వ స్థానం దక్కించుకుంది. గత నవంబర్ 2022తో పోలిస్తే 3 శాతం వృద్ధి సాధించింది. హ్యుందాయ్ మోటార్స్ నుంచి క్రెటా, వెన్యూ, ఎక్స్‌టర్ కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.
టాటా(Tata Motors): దేశీయ బ్రాండ్ టాటా మోటార్స్ ఈ ఏడాది నవంబర్‌లో 50 వేల లోపే కార్లను విక్రయించి మూడో స్థానం దక్కించుకుంది. మొత్తంగా 46,070 కార్ల విక్రయాలతో ఈ జాబితాలో స్థానం సంపాదించింది. కాగా గతేడాది నవంబర్‌తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటే 0.1 శాతం మాత్రమే వృద్ధి నమోదు చేసింది.

మహీంద్రా(Mahindra): ప్యాసింజర్ వాహనాలతో పాటు కమర్షియల్, వ్యవసాయ రంగ వాహనాలకు కూడా ప్రసిద్ధి చెందిన మహీంద్ర కంపెనీ.. ఈ సారి నవంబర్ 2023లో 39,981 కార్లను విక్రయించి నాలుగో స్థానంలో నిలిచింది. కాగా గతేడాది నవంబర్‌తో పోలిస్తే ఈ సారి మహీంద్రా కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. ఏకంగా 31.6 శాతం వృద్ధి సాధించింది.

కియా(Kia Motors): నవంబర్ 2023 కార్ల సేల్స్‌లో టాప్ 5 జాబితాలో కియా మోటార్స్ చివరి స్థానం దక్కించుకుంది. మొత్తంగా 22,762 కార్లను విక్రయించింది. అయితే గతేడాది నవంబర్‌తో పోలిస్తే విక్రయాలు సేల్స్ చెప్పవచ్చు. 5.3 శాతం విక్రయాలు క్షీణించాయి. అయితే రాబోయే నెలల్లో కియా పుంజుకుంటుందని కంపెనీ ఆశాజనకంగా ఉంది.
ఇందుకు కారణం త్వరలో కియా మోటార్స్ నుంచి కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌తో వాహన ప్రియులకు అందుబాటులోకి రానుంది. ఇదే కాకుండా, కియా కంపెనీ ప్రస్తుతం కొత్త తరం కియా కార్నివాల్ కారును మార్కెట్‌లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కాగా ఈ జాబితాలో కియా మినహా మిగతా కంపెనీలన్నీ స్వల్ప వృద్ధినే నమోదు చేశాయి.



Click it and Unblock the Notifications








