Independence day మార్కెట్‌లో దూసుకెళ్తున్న 'మేడ్ ఇన్ ఇండియా' కార్లు.. ప్రత్యేకతలు తెలుసుకోండి..!
దేశీయ కార్ల మార్కెట్లో శక్తివంతమైన మేడ్ ఇన్ ఇండియా కార్లు దూసుకుపోతున్నాయి. సరసమైన ధర, ఆకర్షణీయమైన ఫీచర్లు, మెరుగైన భద్రతా ఫీచర్లతో కొనుగోలుకు అందుబాటులో ఉండటంతో అధికంగా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ధర రూ.15 లక్షలలోపు లభించే ప్రముఖ సంస్థ కార్లు ఈ కథనంలో తెలుసుకుందాం.
మహీంద్రా స్కార్పియో N SUV కారు రూ.13.05 లక్షల నుంచి రూ.24.51 లక్షల ఎక్స్‌షోరూం ధరకు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. సుమారుగా 12-13 నెలల వెయిటింగ్ పీరియడ్‌తో పెట్రోల్, డిజిల్ ఇంజిన్ ఎంపికల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ కారు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ గరిష్ఠంగా 132PS గరిష్ఠ శక్తిని, 300Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 203 PS శక్తి, 380Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 6 స్పీడ్ మాన్యువల్/ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ఈ మహీంద్రా కారు 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లతో మెరుగైన భద్రతను అందిస్తుంది.
మహీంద్రా XUV700 కారు ధర రూ.14.01 లక్షల నుంచి రూ.26.18 లక్షల మధ్య ఉంటుంది. ఇందులో రెండు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బోఛార్జడ్, పెట్రోల్ ఇంజిన్, 200hp గరిష్ఠ శక్తిని. 380Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. 2.2 లీటర్ 4 సిలిండర్ టర్బోఛార్జడ్ డీజిల్ ఇంజిన్.. 155hp శక్తిని, 360Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇది 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 6 వే పవర్డ్ డ్రైవర్ సీట్ సహా మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. మహీంద్రా XUV700లో జిప్, జాప్, జూమ్ మరియు కస్టమ్ డ్రైవ్ మోడ్‌లు, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం), ISOFIX యాంకర్లు, TPMS (టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్) వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
కియో మోటార్స్ విదేశీ సంస్థ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటుచేసింది. ఇందులో సెల్టోస్ రూ.10.90 లక్షల ప్రారంభ ధరకు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో ఉంది. ఈ కారు వేరియంట్‌ను బట్టి 17.0kmpl - 20.7 kmpl మైలేజీని అందిస్తుంది. 10.25 అంగుళాల డిస్‌ప్లే, డజన్ల కొద్ది ఫీచర్‌లతో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్‌లను కలిగి ఉంటుంది.

హ్యుందాయ్ క్రెటా రూ.10.87 లక్షల (ఎక్స్‌షోరూం) ధరతో ప్రారంభం అవుతుంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ఇది 16.8kmpl మైలేజీని ఇస్తుంది. 10.25 అంగుళాల టచ్‌స్ర్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్‌తో సహా వివిధ లక్షణాలను కలిగి ఉంది.
మహీంద్రా థార్ ప్రీమియర్ ఆఫ్ రోడ్ SUV రూ.10.54 లక్షల నుంచి రూ.16.78 లక్షల (ఎక్స్‌షోరూం) మధ్య అందుబాటులో ఉంటుంది. ఈ కారు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 15.2kmpl మైలేజీని అందిస్తుంది. 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, క్రాయిజ్ కంట్రోల్ సహా పలు ఫీచర్లను పొందుతుంది.
స్కోడా కుషాక్ భారత మార్కెట్‌లో రూ.11.59 లక్షలు- రూ.19.69 లక్షల (ఎక్స్‌షోరూం)కు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది. ఈ కారు 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బోఛార్జడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. స్కోడా కుషాక్ కారు 18.09-19.76 మైలేజీని అందిస్తుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ టెక్నాలజీని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








