'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?

దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటైన మహీంద్రా నేడు తన 'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ లిమిటెడ్ ఎడిషన్ ధర రూ.11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). మహీంద్రా లాంచ్ చేసిన ఈ కొత్త వేరియంట్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్ ఇప్పటికే అందుబాటులో ఉన్న బొలెరో నియో యొక్క టాప్ స్పెక్ వేరియంట్ అయిన N10 వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది. అయితే ఈ కొత్త వేరియంట్ దాని మునుపటి మోడల్ కంటే కూడా ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇది N10 వేరియంట్ కంటే రూ.29,000 ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంటుంది, అదే సమయంలో ఈ లిమిటెడ్ ఎడిషన్ ధర N10 (ఓ) కంటే రూ. 78,000 తక్కువ.

బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ చేసిన మహీంద్రా

కొత్త మహీంద్రా బొలెరో నియో ఎన్10 లిమిటెడ్ ఎడిషన్ ఇప్పుడు రూఫ్ స్కీ ర్యాక్, కొత్త ఫాగ్ లైట్స్, ఇంటిగ్రేటెడ్ DRL తో కూడా హెడ్ లాంప్ వంటి వాటితో పాటు అల్లాయ్ వీల్స్, ఎక్స్ షేప్ వీల్ కవర్‌తో టెయిల్‌గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్, బ్లూసెన్స్ కనెక్టెడ్ కార్ ఫీచర్‌లతో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైన ఫీచర్లను పొందుతుంది.

ఈ కొత్త ఎడిషన్ లో గమనించదగ్గ ముఖ్యమైన మార్పు ఫాక్స్ లెదర్ సీట్లు మరియు డ్రైవర్ & కో డ్రైవర్ సీట్లకు లంబర్ సపోర్ట్. వీటితో పాటు ఈ లిమిటెడ్ ఎడిషన్ లో రివర్స్ పార్కింగ్ కెమెరా, డ్రైవర్ సీటు కింద స్టోరేజ్ ట్రే వంటివి లభిస్తాయి. అయితే ఈ లిమిటెడ్ ఎడిషన్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉన్నప్పటికీ, ఇందులో అప్డేటెడ్ ఫీచర్స్ గమనించవచ్చు. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ చేసిన మహీంద్రా

మహీంద్రా లాంచ్ చేసిన కొత్త నియో లిమిటెడ్ ఎడిషన్ కొత్త ఫీచర్స్ పొందినప్పటికీ, ఇంజిన్ లో ఎటువంటి మార్పులు చేయలేదు. కావున మహీంద్రా బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్ అదే 1.5-లీటర్ mHawk100 డీజిల్ ఇంజన్ పొందుతుంది. ఇది 3750 ఆర్‌పిఎమ్ వద్ద 100 బిహెచ్‌పి పవర్ మరియు 2250 ఆర్‌పిఎమ్ వద్ద 260 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

మహీంద్రా బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్ లో మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్ (MLD) సిస్టం అనేది పొందదు. ఇది కేవలం N10 (O) వేరియంట్‌కు మాత్రమే పరిమితం చేయబడి ఉంటుంది. ఇందులో ఇంధనాన్ని ఆదా చేయడం కోసం స్టార్ట్-స్టాప్ టెక్నాలజీని కూడా ఉంటుంది.ఇందులో ఎకో డ్రైవ్ మోడ్ కూడా ఇవ్వబడింది. కావున ఇంధనాన్ని కూడా మీరు కొంత వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ చేసిన మహీంద్రా

సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, మహీంద్రా బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్ లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్ విత్ ఈబిడి, క్రూయిజ్ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, సీట్ బెల్ట్ రిమైండర్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. స్టాండర్డ్ బొలెరో నియో మొత్తం ఐదు కలర్స్ లో లభిస్తుంది.

కొత్త బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్ కూడా ఐదు కలర్ ఆప్సన్స్ లో అవకాశం ఉందని భావిస్తున్నాము. అయితే ఇది ఎన్ని కలర్స్ లో లభిస్తుంది అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ కి దేశీయ మార్కెట్లో ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు, కానీ టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, కియా సోనెట్ మరియు హ్యుందాయ్ వెన్యూ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Mahindra bolero neo limited edition launched in india price features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X