2022 డిసెంబర్ అమ్మకాలు వెల్లడించిన మహీంద్రా.. పూర్తి వివరాలు

2022 వ సంవత్సరం ముగిసింది, 2023 లోకి అడుగు పెట్టేసాము. అయితే ఈ సందర్భంగా వాహన తయారీ సంస్థలు గత (2022 డిసెంబర్) నెలలో తమ అమ్మకాల నివేదికలను వెల్లడించాయి. ఇందులో మహీంద్రా కంపెనీ యొక్క గత నెల అమ్మకాలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూద్దాం.

2022 డిసెంబర్ నెలలో కంపెనీ మంచి అమ్మకాలను పొందినట్లు నివేదికలు చెబుతున్నాయి. మహీంద్రా గత నెలలో మొత్తం 56,677 వాహనాలను విక్రయించగలిగింది. గత నెలలో ఏకంగా 62 శాతం వృద్ధితో 28,233 యూనిట్ల యుటిలిటీ వాహనాలను విక్రయించగలిగింది.అదే సమయంలో 112 వ్యాన్‌లను విక్రయించి మొత్తమ్ అమ్మకాలు 28,445 యూనిట్లకు చేరుకుంది. ఈ అమ్మకాలు 2021 డిసెంబర్ కంటే 62 శాతం ఎక్కువ అని స్పష్టంగా తెలుస్తోంది.

2022 డిసెంబర్ అమ్మకాలు వెల్లడించిన మహీంద్రా

కంపెనీ యొక్క ఎగుమతులు 3,100 యూనిట్లు కాగా, CV విభాగంలో గత డిసెంబర్ నెలలో 20,080 యూనిట్లను విక్రయించింది. కార్లు మరియు వ్యాన్ అమ్మకాలు గత నెలలో 56 శాతం తగ్గి 112 యూనిట్లకు పడిపోయాయి. గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 253 యూనిట్ల నుండి మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 61 శాతం పెరిగాయి. కస్టమర్ల నిరంతర ఆసక్తి కారణంగా 2022 డిసెంబర్‌లో కంపెనీ వాహనాలకు డిమాండ్ బలంగా ఉందని విజయ్ నక్రా తెలిపారు.

ఇప్పటికి కూడా కొనసాగుతున్న అంతర్జాతీయ అంతరాయాలు మరియు పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల కారణంగా, కంపెనీ సరఫరా మరియు ఉత్పత్తి కొంత నెమ్మదిగానే ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు. మొత్తం మీద కంపెనీ 2022 లో మంచి అభివృద్ధిని నమోదు చేసుకోగలిగింది. అయితే ఈ సంవత్సరం కంపెనీ కొత్త వాహనాలను విడుదల చేయడం వల్ల మరిన్ని మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని ఆశిస్తున్నాము.

ఇది కాకుండా, మహీంద్రా గ్రూప్‌లో భాగమైన తన ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ (ఎఫ్‌ఇఎస్) అమ్మకాల గణాంకాలను కూడా కంపెనీ వెల్లడించింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం మహీంద్రా ట్రాక్టర్ విక్రయాలు డిసెంబర్ 2021 లో 16,687 (దేశీయ విక్రయాలు) యూనిట్లు కాగా 2022 డిసెంబర్‌లో 21,640 యూనిట్లుగా ఉన్నాయి. డిసెంబర్ 2022లో మొత్తం ట్రాక్టర్ విక్రయాలు (దేశీయ + ఎగుమతులు) 23,243 యూనిట్లుగా ఉన్నాయి

గత ఏడాది ఇదే కాలంలో ట్రాక్టర్ అమ్మకాలు 18,269 యూనిట్లు ఉన్నాయి. ఈ కాలంలో వ్యవసాయ పరికరాల ఎగుమతులు 1,603 యూనిట్లుగా ఉన్నాయి. అంటే కంపెనీ ట్రాక్టర్ అమ్మకాల్లో కూడా కంపెనీ 2022 లో మంచి వృద్ధిని నమోదు చేసింది. ఈ సంవత్సరం కూడా కంపెనీ కార్లు మరియు వాణిజ్య వాహనాల అమ్మకాల్లో తప్పకుండా మంచి పురోగతిని సాధించే అవకాశం ఉంది, ఎందుకంటే కంపెనీ ఈ ఏడాది ఆధునిక ఉత్పత్తులను విడుదల చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా మహీంద్రా ఇక త్వరలో జరగనున్న 2023 ఆటో ఎక్స్‌పోలో తన ఎలక్ట్రిక్ SUV XUV400 ని విడుదల చేయనుంది. కంపెనీ ఈ సమయంలోనే ధరలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఈ నెలలో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ SUV యొక్క తయారీని కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ SUV పూర్తి చార్జ్ పై 456 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని సర్టిఫై చేయబడింది.

మహీంద్రా కంపెనీ 2022 వ సంవత్సరంలో మంచి అమ్మకాలను చేపట్టగలిగింది. 2022 ప్రారంభంలో ఆశించిన అమ్మకాలు పొందినప్పటికీ 2022 చివరి నాటికి అమ్మకాలలో మంచి పురోగతిని పొందగలిగింది. కాగా ఈ కొత్త సంవత్సరంలో ఎలాంటి అమ్మకాలను పొందగలిగితుంది అనే విషయాలు త్వరలో తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడంతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, January 2, 2023, 18:15 [IST]
English summary
Mahindra car sales december 2022 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+