IPL: 4 ఐపీఎల్ జట్లతో SUV భాగస్వామిగా మహీంద్రా ఒప్పందం.. క్రికెటర్లను మీట్ చేసే ఛాన్స్
దేశంలో ఇప్పటికే ఐపీఎల్ ఫీవర్ ప్రారంభంమైంది. దేశంలోని వివిధ సంస్థలు పది జట్లతో కలిసి భాగస్వామిగా చేరుతున్నాయి. ఈ కోవాలనే మహీంద్రా & మహీంద్రా ఏకంగా నాలుగు జట్లతో అధికారిక SUVగా ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటనను ఆ సంస్థ విడుదల చేసింది. SUV తయారీదారుల్లో ప్రథమ స్థానంలో ఉన్న మహీంద్రా ఈ ఒప్పందంతో మరింత బలోపేతం కానుంది.
ఐపీఎల్ జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లి క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ లతో అధికారిక భాగస్వామిగా వ్యవహరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ అగ్రిమెంట్ తో వినియోగదారులు, అభిమానుల కోసం ఆన్‌లైన్ ఆఫ్‌లైన్‌లో అనేక ప్రచార కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు పేర్కొంది.

అభిమానుల కోసం ప్రత్యేకంగా..
ఈ ఒప్పందం ద్వారా, నాలుగు జట్లకు చెందిన అభిమాన క్రికెట్ ఆటగాళ్లతో సమావేశాలు, ఇతర కార్యకలాపాలు ఏర్పాటు చేయనుంది. ఈ జట్లకు చెందిన క్రికెటర్ల జెర్సీలు, మ్యాచ్ టిక్కెట్ అలానే బ్రాండ్ వస్తువులను గెలుచుకునే అవకాశాన్ని మహీంద్రా కల్పించనుంది. 2023 IPL సీజన్‌లో మహీంద్రా నిర్వహించే పోటీలో గెలుపొందిన అభిమానుల కోసం మాత్రమే మీట్ అండ్ గ్రీట్ సెషన్ ఏర్పాటు చేయనుంది.
ఈ డీల్, దేశవ్యాప్తంగా ఈ సంస్థకు ఉన్న తన డీలర్‌షిప్‌లలో టెస్ట్ డ్రైవ్‌లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలానే మహీంద్రా తన షోరూమ్‌లకు T20 లీగ్ ఉత్సాహాన్నీ నింపడం కోసం తన కస్టమర్‌లు అభిమానులకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించడానికి ఏర్పాట్లు చేస్తుంది. క్రికెట్ ప్రేమికులు అమితంగా ప్రేమించే ఈ లీగ్ ద్వారా మహీంద్రా షోరూమ్ లతో పాటు ఇతర ప్లాట్ ఫామ్ ల ద్వారా ప్రచారాన్ని నిర్వహించనుంది.
బ్రాండ్ ఇమేజ్ కి ప్లస్..
T20 లీగ్‌లో పోటీ పడుతున్న నాలుగు అత్యుత్తమ టీమ్‌లతో భాగస్వామిగా చేరడం సంతోషంగా ఉందని మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, ఆటోమోటివ్ సెక్టార్ ప్రెసిడెంట్ వీజయ్ నక్రా తెలిపారు. ఈ అసోసియేషన్ మా కస్టమర్‌లతో కనెక్ట్ అవ్వడానికి సరైన అవకాశాన్ని అందిస్తుందని ఆయన అన్నారు. ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన రీతిలో అభిమానులు T20 లీగ్ ఉత్సాహాన్ని దేశంలోని మా షోరూమ్‌లు, డీలర్‌షిప్‌లకు తీసుకురావడానికి, మేము అనేక రకాల ఆన్-గ్రౌండ్ కార్యకలాపాలను ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.
ఈ T20 లీగ్ ప్రపంచంలోనే అతిపెద్దది. క్రికెట్ లీగ్‌లు, ఈ భాగస్వామ్యం మా బ్రాండ్‌పై సానుకూల ప్రభావం చూపుతుందని, ఆసక్తి విలువను పెంచుతుందని మేము విశ్వసిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని మహీంద్రా సద్వినియోగం చేసుకుంటుందని తెలిపారు. భవిష్యత్ లో మరిన్నీ రకాలుగా ఇది ఉపయోగపడుతుందని వెల్లడించారు. త్వరలోనే ఐపీఎల్ కి సంబంధించి అన్నీ ఇతర ఏర్పాట్లను తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవలే టైటిల్ స్పాన్సర్ షిప్ రోల్..
ఇటీవల, దేశంలో మార్చి 28న ముగిసిన IBA ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ 2023కి మహీంద్రా టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. XUV300 టర్బోస్పోర్ట్ థార్ ఆ ఈవెంట్‌కు అధికారిక SUVలుగా ఉన్నాయి. ఈ పోటీలో బంగారు పతకం సాధించిన భారతీయ బాక్సర్ నిఖత్ జరీన్‌కు మహీంద్రా థార్ SUVని ప్రధానం చేసింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








