లక్షకు పైగా కార్లను రీకాల్ చేసిన మహీంద్రా.. అటువంటి ప్రమాదాలు జరగకుండా..!
భారత ఆటోమొబైల్ మార్కెట్ మహీంద్రా అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా గుర్తింపు పొందింది. ఈ సంస్థకు చెందిన అనేక మోడళ్లు వినియోగదారులను భాగా ఆకర్షించాయి. అయితే మహీంద్రా సంస్థ కీలక ప్రకటన చేసింది. లక్షకు పైగా కార్లను వెనక్కి పిలిచింది. సాంకేతిక లోపాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వీటిని ఉచితంగానే మరమ్మతులు చేస్తామని ప్రకటించింది.
మహీంద్రా XUV700 ప్రస్తుతం అత్యధిక వెయిటింగ్ పిరియడ్ ఉన్న వాహనంగా ఉంది. అలాగే మహీంద్రా సంస్థ తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ XUV400 కార్లు రీకాల్ జాబితాలో ఉన్నాయి. 2021 జాన్ 8 నుంచి 2023 జూన్ 28 వరకు ఉత్పత్తి చేసిన 1,08,306.. XUV700 కార్లలో ఇంజిన్ బే వైరింగ్ లూమ్‌ను తనిఖీ చేయాల్సి ఉందని సంస్థ వెల్లడించింది.

ఇందులో ఎటువంటి సమస్య తలెత్తినా.. ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతోపాటు 2023 ఫిబ్రవరి 16 నుంచి జూన్ 5 మధ్య తయారైన 3,560 యూనిట్ల XUV400 కార్లను రీకాల్ చేసింది. ఈ కార్లలో స్ర్పింగ్ రిటర్న్ యాక్షన్ బ్రేక్ పొటెన్షియో మీటర్‌ను తనిఖీ చేయాల్సి ఉందని తెలిపింది. కార్లను కొనుగోలు చేసిన కస్టమర్లను మహీంద్రా సంస్థ సంప్రదిస్తోంది.
మహీంద్రా XUV700 SUV ప్రస్తుత ధర రూ.14.01 లక్షల నుంచి రూ.26.18 లక్షల మధ్య కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ కారు 6- స్పీడ్ మ్యాన్యువల్/ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. 2.0 లీటర్ 4- సిలిండర్ టర్బోఛార్జడ్ పెట్రోల్, 2.2 లీటర్ 4- సిలిండర్ టర్బోఛార్జడ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.

XUV700 SUV కారులోపల 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్‌తో వస్తుంది. ప్రయాణికులు భద్రత కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్) సహా ఇతర కీలక ఫీచర్లను కలిగి ఉంటుంది.
మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ కారు రూ.15.99 లక్షల నుంచి రూ.19.39 లక్షల (ఎక్స్‌షోరూం)కు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ కారు 34.5kWh మరియు 39.4kWh బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 150hp శక్తి, 310Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఫన్, ఫాస్ట్, ఫియర్‌లెస్ మూడు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది.

ఈ కారు 34.5kWh బ్యాటరీ ప్యాక్.. 375 కి.మీ రేంజ్, 39.5kWh బ్యాటరీ ప్యాక్ 456 కి.మీ రేంజ్ ఇస్తుంది. మరియు 150kmph గరిష్ఠ వేగంతో ప్రయాణించగలదు. గృహ విద్యుత్ కనెక్షన్ ద్వారా ఈ కారు బ్యాటరీని ఛార్జింగ్ చేసేందుకు 13 గంటల సమయం పడుతుంది.
గత సంవత్సరం డిసెంబర్‌లో మహీంద్రా కొన్ని వేల కార్లను రీకాల్ చేసింది. జూలై 1 నుంచి నవంబర్ 11, 2022 మధ్య ఉత్పత్తి చేసిన 6618 స్కార్పియో N, 12,566 యూనిట్ల XUV700 కార్లను రీకాల్ చేసింది. భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎస్‌యూవీ విక్రయాల్లో మహీంద్రా కంపెనీ రికార్డును సృష్టించింది.
2023, జూలైలో 36,205 యూనిట్ల SUVలను విక్రయించింది. అదే 2022, జూలైలో 27,574 యూనిట్లను విక్రయించింది. అంతే గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సుమారు 30 శాతం వృద్ధి నమోదు చేసింది. స్కార్పియో, ఎక్స్‌యూవీ 700 ఇందుకు ప్రధాన కారణం.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








