Mahindra XUV700 SUVకి భారీ డిమాండ్.. సెప్టెంబర్‌లో భారీగా విక్రయాలు!
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మహీంద్రా SUVలకు భారీ ఆదరణ ఉంది. కొత్తగా విడుదల అయిన మహీంద్రా ఎస్‌యూవీ700 మోడల్ (Mahindra XUV700) రికార్డు స్థాయిలో విక్రయాలు నమోదు చేస్తోంది. మహీంద్రా సంస్థ సెప్టెంబర్ 2023 నెల విక్రయాలు నివేదిక ఎస్‌యూవీ700 విక్రయాల వివరాలను వెల్లడించింది.
XUV700కు భారీ డిమాండ్! : మహీంద్రా నివేదిక ప్రకారం.. 2023 సెప్టెంబర్ నెలలో 8,555 యూనిట్ల XUV700 వాహనాలను విక్రయించింది. వీటిలో డీజిల్ వేరియంట్లు 6,350 యూనిట్లు.. పెట్రోల్ వేరియంట్లు 2,205 యూనిట్లను విక్రయించింది. మహీంద్రా XUV700 ప్రారంభ ధర రూ.14.03 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది.

లక్షకు పైగా కార్ల డెలివరీ: ఆగస్టు 2021 నెలలో మహీంద్రా సంస్థ XUV700 SUVని భారత్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. డెలివరీ ప్రారంభించిన తొలి 12 నెలల్లో 50 వేల యూనిట్లను పంపిణీ చేసింది. ఇప్పటి వరకు లక్షకు పైగా కార్లను డెలివరీ చేసింది. డిమాండ్‌కు అనుగుణంగా డెలివరీలను వేగవంతం చేసేందుకు ఎక్స్‌యూవీ700ల ఉత్పత్తి పెంచాలని నిర్ణయించింది.
మహీంద్రా XUV700 మోడల్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. డీజిల్ ఇంజిన్ వేరియంట్‌లో జిప్, జాప్, జూమ్ మరియు కస్టమ్ అనే డ్రైవింగ్ మోడ్‌లున్నాయి. 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బోఛార్జడ్ పెట్రోల్ ఇంజిన్ 200 hp శక్తి, 380 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరో 2.2 లీటర్ 4 సిలిండర్ టర్బోఛార్జడ్ డీజిల్ ఇంజిన్ 155hp శక్తి, 360Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

GNCAP 5 స్టార్ రేటింగ్ : మహీంద్రా XUV700 SUV రెండు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్/ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లను కలిగి ఉంటుంది. ఈ కారు భద్రత పరంగా మెరుగైన రేటింగ్‌ను కలిగి ఉంది. గ్లోబల్ NCAP (GNCAP) నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.
దీంతోపాటు 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS - యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ESP- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రొగ్రాం, ISOFIX యాంకర్స్, TPMS- టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అనేక కీలక భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్లలో మెరుగైన భద్రత కలిగిన వాహనంగా గుర్తింపు పొందింది.

మహీంద్రా XUV700 SUV ఫీచర్లు : దీంతోపాటు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం రెండు డిజిటల్ స్క్రీన్లు, అడ్వాన్సడ్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అనేక ఆకట్టుకొనే ఫీచర్లను కలిగి ఉంది. ప్రస్తుతం డిమాండ్ ఆధారంగా ఇవాళ ఈ కారును బుకింగ్ చేసినా.. డెలివరీ కోసం కొన్ని నెలలపాటు వేచిచూడాల్సి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








