కొత్త సంవత్సరంలో భారీగా పెరిగిన Scorpio N ధరలు.. వేరియంట్ వారీగా లిస్ట్ ఇక్కడ చూడొచ్చు
మహీంద్రా అండ్ మహీంద్రా గత సంవత్సరం దేశీయ మార్కెట్లో విడుదల చేసిన తన "స్కార్పియో ఎన్" ధరలను ఎట్టకేలకు 2023 వ సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.01 లక్షలు పెంచింది. మహీంద్రా స్కార్పియో ఎన్ ధరల పెరుగుదల గురించి మరిన్ని విక్రయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం కంపెనీ భారతీయ మార్కెట్లో ఇప్పటికే విక్రయిస్తున్న తన లేటెస్ట్ SUV స్కార్పియో ఎన్ ధరలను రూ. 15,000 నుంచి రూ. 1.01 లక్షల వరకు పెరిగింది. ఇన్‌పుట్ ధరలు మరియు నిర్వహణ వ్యయాలు పెరగడం ధరల పెరుగుదల జరిగిందని కంపెనీ తెలిపింది. ధర పెరుగుదల తరువాత స్కార్పియో ఎన్ ప్రారంభ ధర రూ. 12.74 లక్షలు (Z2 MT 7s). ధరల పెరుగుదలకు ముందు ఈ SUV ధర రూ. 11.99 లక్షలు.

ధరల పెరుగుదల తరువాత గరిష్టంగా రూ. 1.01 లక్షలు (Z8 MT 4WD 7s) పెరిగింది. కావున దీని ప్రస్తుత ధర రూ. 20.95 లక్షలు (Z8 MT 4WD 7s). టాప్ వేరియంట్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ, బేస్ వేరియంట్ ధరలు రూ. 65,000 (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 75,000 (ఎక్స్-షోరూమ్) వరకు పెరిగాయి. ఈ కొత్త సంవత్సరంలో ధరల పెరుగుదల కాకుండా ఇందులో ఎటువంటి మార్పులు లేదు.
| Mahindra Scorpio-N Price Hike | ||||
| Variant | Petrol MT | Petrol AT | Diesel MT | Diesel AT |
| Z2 | ₹12.74 Lakh | ₹13.24 Lakh | ||
| Z4 | ₹14.24 Lakh | ₹16.20 Lakh | ₹14.74 Lakh | ₹16.70 Lakh |
| Z6 | - | ₹15.64 Lakh | ₹17.60 Lakh | |
| Z8 | ₹17.64 Lakh | ₹19.60 Lakh | ₹18.14 lakh | ₹20.10 Lakh |
| Z8L | ₹19.54 Lakh | ₹21.10 Lakh | ₹20.04 Lakh | ₹21.60 Lakh |
| Variant | Petrol AT (2WD) | Diesel AT (2WD) | Diesel AT (4WD) | |
| Z4 | ₹16.20 Lakh | ₹16.70 Lakh | ||
| Z6 | ₹17.60 Lakh | |||
| Z8 | ₹19.60 Lakh | ₹20.10 Lakh | ₹22.55 Lakh | |
| Z8L | ₹21.10 Lakh | ₹21.60 Lakh | ₹24.05 Lakh | |
మహీంద్రా స్కార్పియో-ఎన్ మొత్తం 5 వేరియంట్‌లలో అందించబడుతుంది. అవి Z2, Z4, Z6, Z8 మరియు Z8L వేరియంట్స్. స్కార్పియో ఎన్ 6-సీట్లు మరియు 7-సీట్ల ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఇప్పటికే ఒక లక్షకు పైగా బుకింగ్స్ కూడా పొందింది, కావున డెలివరీలు వేగంగా జరపడానికి కంపెనీ తగిన సన్నాహాలు చేస్తుంది. కాగా కంపెనీ మొదట వెల్లడించిన ధరలు మొదటి 25,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి.
కొత్త మహీంద్రా స్కార్పియో ఎన్ రెండు ఇంజిన్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అవి ఒకటి 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్, రెండవది 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్. ఇందులోని మొదటి ఇంజిన్ 175 పిఎస్ పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండవ ఇంజిన్ 203 పిఎస్ పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతుంది.
మహీంద్రా స్కార్పియో ఎన్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 20.32 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, 17.78 సెం.మీ కలర్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ క్రూయిజ్ కంట్రోల్స్, 6-వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, ప్రీమియం-లుకింగ్ బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్ సీట్లు మరియు డ్యూయల్ ఛానెల్ సబ్-వూఫర్‌తో కూడిన సోనీ 3డి ఆడియో సిస్టమ్ వంటివి ఉన్నాయి.
మహీంద్రా స్కార్పియో-ఎన్ మంచి డిజైన్ కలిగి ఉంటుంది. దీని ముందుభాగంలో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, సి షేప్ ఎల్ఈడి డిఆర్ఎల్, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, సిగ్నేచర్ వీల్ ఆర్చెస్, రూఫ్ రెయిల్స్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, స్కార్పియో స్టింగ్ క్రోమ్ విండో లైన్, సిగ్నేచర్ డబుల్ బారెల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, లోడ్ బేరింగ్ స్కీ ర్యాక్, రూఫ్ స్పాయిలర్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ వంటివి కూడా ఉన్నాయి.
ఇక చివరగా మహీంద్రా స్కార్పియో-ఎన్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎబిఎస్ విత్ ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, రోల్ ఓవర్ మిటిగేషన్, బ్రేక్ డిస్క్ వైపింగ్ మరియు ఐసోఫిక్స్ సీట్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది డీప్ ఫారెస్ట్, న్యాపోలి బ్లాక్, ఎవరెస్ట్ వైట్, రెడ్ రేజ్, డాజ్లింగ్ సిల్వర్, రాయల్ గోల్డ్ మరియు గ్రాండ్ కాన్యన్ అనే 7 కలర్స్ లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








