Mahindra Supro CNG Duo మహీంద్రా నుంచి మరో సరికొత్త బిజినెస్ ట్రక్కు విడుదల.. మూడేళ్ల వారంటీ మరెన్నో ఫీచర్లు..

స్వదేశీ వాహన తయారీ సంస్థ మహీంద్రా వాహనప్రియుల అభిరుచికి అనుగుణంగా కొత్త కొత్త ట్రక్కులను మార్కెట్‌లోకి విడుదల చేస్తుంది. తాజాగా ఓ కొత్త బిజినెస్ ట్రక్కును లాంచ్‌ చేసింది. సుప్రో సీఎన్‌జీ డ్యుయో(Supro CNG Duo) మోడల్‌ను గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహీంద్రా కంపెనీ విడుదల చేసిన సుప్రో సీఎన్‌జీ డ్యుయో డ్యూయెల్‌ ఫ్యూయల్‌తో కూడిన చిన్న వాణిజ్య వాహనం. ఎక్స్‌ షో రూమ్‌లో ఈ కొత్త Supro CNG Duo మోడల్ ప్రారంభ ధర రూ.6.32 లక్షలుగా ఉంది. ఇంకా ఈ కారుకు సంబంధించిన పూర్తి ఫీచర్లు చూద్దాం.

Mahindra Supro CNG Duo

కొత్త మహీంద్రా సుప్రో సీఎన్‌జీ Duo మోడల్ అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. ఈ కొత్త వాణిజ్య వాహనం సరసమైన ధరలో లభించడమే కాకుండా మరింత శక్తివంతమైనది. అధిక పేలోడ్ సామర్థ్యం మరియు అధిక మైలేజీని ఇస్తుంది. దీంతో వినియోగదారులకు మరింత లాభం చేకూరుతుంది. మహీంద్రా సుప్రో సీఎన్‌జీ డ్యుయో మోడల్‌లో 909 సీసీ ఇంజిన్ కలదు.

ఈ ఇంజన్ 26.8 bhp వద్ద 60 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 4 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి వచ్చింది. ఇది ముందు చక్రాలకు శక్తిని పంపిస్తుంది. ఈ కొత్త మహీంద్రా సుప్రో సీఎన్‌జీ Duo వాణిజ్య వాహనం కేజీ సీఎన్‌జీకి 23.35 కిమీ దూరం ప్రయాణిస్తుంది.

Mahindra Supro CNG Duo

మహీంద్రా సుప్రో CNG డ్యుయో భారీ లగేజీని కూడా మోస్తుంది. ఈ మోడల్ 750 కిలోగ్రాముల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మహీంద్రా సుప్రో CNG డ్యుయో 145 R12, 8PR టైర్లతో 12 అంగుళాల స్టీల్ వీల్స్‌తో వస్తుంది. ఈ చిన్న వాణిజ్య వాహనం 158mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది.

మహీంద్రా సుప్రో సీఎన్‌జీ డ్యుయోలో రెండు సీఎన్‌జీ ట్యాంకులు ఉన్నాయి. సుప్రో సీఎన్‌జీ డ్యుయోలో 75 లీటర్ల సామర్థ్యంతో కూడిన సీఎన్‌జీ ట్యాంక్‌ ఉంది. 5-లీటర్ స్టోరేజ్‌తో పెట్రోల్‌ ట్యాంక్‌ను కలిగి ఉంది. సుప్రో సీఎన్‌జీ డ్యుయో (Supro CNG Duo) డ్యూయల్ ఫ్యూయల్‌ ఫెసిలిటీతో పూర్తిగా భర్తీ చేస్తే 325 కి.మీ ప్రయాణించవచ్చు.

Mahindra Supro CNG Duo

మహీంద్రా సుప్రో సీఎన్‌జీ డ్యుయో వాణిజ్య వాహనం యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికొస్తే ఇది పెద్ద భారీ వాహనాల్లో కనిపించే లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. ఇది ముందువైపు 8 లీఫ్ స్ప్రింగ్ సెటప్ మరియు వెనుకవైపు 7 లీఫ్ స్ప్రింగ్ సెటప్‌ను కలిగి ఉంది.

మహీంద్రా సుప్రో CNG డ్యుయో మోడల్‌పై 3 సంవత్సరాలు/80,000 కి.మీ క్లాస్ లీడింగ్ వారంటీతో వస్తుంది. Supro CNG Duo డైమండ్ వైట్ మరియు డీప్ వార్మ్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. వినియోగదారులు తమకు ఇష్టమైన రంగుల నమూనాను ఎంచుకోవచ్చు.

Mahindra Supro CNG Duo

మహీంద్రా & మహీంద్రా సుప్రో 2016 నుంచి 1.75 లక్షల యూనిట్లకు పైగా చిన్న వాణిజ్య వాహనాలను విక్రయించిందని కంపెనీ వెల్లడించింది. ఇది ఇంటర్ సిటీ ఆపరేట్ చేయడంలో సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. మహీంద్రా సుప్రో CNG Duo కంపెనీ యొక్క మొట్టమొదటి డ్యూయల్ ఫ్యూయల్ చిన్న వాణిజ్య వాహనం.

More from DriveSpark

Article Published On: Thursday, June 8, 2023, 16:14 [IST]
English summary
Mahindra supro cng duo launched with dual fuel segment full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+