మహీంద్రా XUV700 ఈవీ టెస్టింగ్ ఫోటోలు వైరల్.. ఆ కార్లకు పోటీ..!
భారత్‌లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్ ఎక్కువగా ఉంది. ఎక్కువ మంది పెట్రోల్, డీజిల్ కార్లకు బదులుగా ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఈ విభాగంలో టాటా అగ్రస్థానంలో ఉంది. చాలా వరకు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. మహీంద్రా ఈ విభాగంలో గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధం అయింది.
Mahindra XUV700 EVని చెన్నైలో పరీక్షిస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కారు టాటా కార్లతో పోటీపడే అవకాశం ఉంది. టాటా ప్రస్తుతం హారియర్ మరియు సఫారీ కార్ల ఎలక్ట్రిక్ వెర్షన్‌లను విడుదల చేయబోతోంది. ఇందుకు పోటీగా మహీంద్రా కూడా తన XUV700 EV సిద్ధం చేస్తోంది.

మహీంద్రా INGLO ప్లాట్‌ఫాంపై మొత్తం 5 ఎలక్ట్రిక్ SUVలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్నాయి. 2024లో లేదా 2025 ఏడాది తొలి భాగంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. టెస్ట్ మ్యూల్‌తో సరైన సాంకేతిక సమాచారాన్ని ఊహించి చెప్పలేము. లాంచింగ్ సమయంలోనే సరైన సమాచారం విడుదల అవుతుంది.
మహీంద్రా కారు వెనుక భాగంలో ఆరెంజ్ రంగు కేబుళ్లు కనిపించాయి. నీలం రంగు కేబుళ్లు సాధారణంగా 36V నుంచి 42V వరకు శక్తిని తీసుకెళ్లగలవు. అదే ఆరెంజ్ రంగు కేబుళ్లు 1000V వరకు శక్తిని తీసుకెళ్లవచ్చు. వీటిని HV- హైఓల్టేజ్ కేబుళ్లు అంటారు. ఆరెంజ్ కేబుళ్లు హై ఓల్టెజ్ ఏసీ లేదా డీసీ విద్యుత్‌ను తీసుకెళ్లగలవు. దీనిని బట్టి మహీంద్రా కారుకు అధిక సామర్థ్యం గల బ్యాటరీ అమర్చబడి ఉంటుందని భావించవచ్చు.

మహీంద్రా ఈవీ వెనుక చక్రాలపై సింగిల్ మోటార్ లేదా AWD డ్యూయల్ మోటార్ లేఅవుట్ సెటప్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. మహీంద్రా INGLO ఫ్లాట్‌ఫాం సింగిల్ మోటార్ లేదా డ్యూయల్ మోటార్ రెండింటిని సపోర్టు చేస్తుంది. అయితే ఎలా విడుదల అవుతుందో వేచిచూడాలి. అయితే బ్యాటరీ 60kWh మరియు 80kWh సామర్థ్యంతో తీసుకువచ్చే అవకాశం ఉంది.
మహీంద్రా XUV700 ప్రత్యేకమైన రేర్ వీల్ సస్పెన్షన్ వ్యవస్థను కలిగి ఉంది. గుంతల్లోకి కారు దిగినా లోపలున్న ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూస్తుంది. ఇటువంటి వ్యవస్థ టాటా మరియు ఇండిగో కార్లలో ఉంది. ప్రస్తుతం కేవలం లగ్జరీ కార్లలో మాత్రమే అందుబాటులో ఉంది.

వీటిటో పాటు మహీంద్రా XUV700 ఎలక్ట్రిక్ వాహనం ADAS టెక్నాలజీ (అడ్వాన్సడ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్), ఫ్లష్ డోర్ హ్యాండిల్, క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ కలిగిన బాడీ షేల్, పనోరమిక్ సన్‌రూఫ్ సహా మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. అలాగే డ్యాష్ బోర్డులో 3 స్క్రీన్ లేఅవుట్‌లు ఉన్నాయి. ఈ వాహనం ధర రూ.30 లక్షలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








