మహీంద్రా, మారుతి ఆఫ్ రోడర్ వాహనాల సత్తా చూశారా... వైరల్ అవుతున్న వీడియో.!
ఆఫ్ రోడ్ SUVలు అంటే ప్రస్తుతం మహీంద్రా థార్ (Mahindra Thar), మారుతి జమ్మీ (Maruti Jimny) వాహనాలు గుర్తొస్తాయి. ఇందులో మహీంద్రా ఆఫ్ రోడర్ 3- డోర్ వేరియంట్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉండగా.. మారుతి జిమ్నీ తాజాగా అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ రెండు ఆఫ్ రోడ్ SUVలు ఎలాంటి సామర్థ్యాలను కలిగి ఉంటాయో మీకు తెలుసా.. తెలియకుంటే ఈ ప్రత్యేక కథనం మీకోసం.
ఈ ఎస్‌యూవీల ఆఫ్‌రోడ్ సామర్థ్యాలు తెలుసా? : మహీంద్రా థార్, మారుతి జిమ్మీ రెండు SUVలు తమ ఆఫ్ రోడ్ సామర్థ్యాలను ప్రదర్శిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను అన్షుమన్ బిష్ణోయ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోలో వ్లాగర్ ఈ రెండు SUVల సామర్థ్యాలను తెలియజేసేందుకు ఆఫ్ రోడ్ పరీక్షలకు తీసుకెళ్తాడు.

ఎటువంటి ఇబ్బంది లేకుండా : తొలుత మహీంద్రా థార్‌ను గొయ్యిలోకి తీసుకెళ్లి.. అస్పష్టంగా ఉన్న ఆఫ్ రోడ్ గుండా థార్ SUV ప్రయాణం చేసేలా ఏర్పాట్లు చేశాడు. ఈ సమయంలో మహీంద్రా థార్ బంపర్‌ను నేలకు తాకకుండా ఉండేలా.. చిన్న మార్పులు చేశాడు. దీంతో అస్పష్టంగా ఉన్న రోడ్లపై మహీంద్రా థార్ 3-డోర్ సులభంగా ప్రయాణించడం వీడియోలో గమనించవచ్చు.
మారుతి జిమ్నీని ఆ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. ఈ SUV కూడా ఎటువంటి సమస్య లేకుండా గొయ్యి నుంచి బయటకు వచ్చింది. ఈ టాస్క్ తర్వాత మట్టి దిబ్బలను ఎక్కేందుకు ఈ రెండు ఎస్‌యూలను తీసుకెళ్లాడు. మహీంద్రా థార్ యొక్క తక్కువ బ్రేక్ ఓవర్ యాంగిల్ కారణంగా భూమిని తాకుతుంది. రెండుసార్లు ప్రయత్నం చేశాక.. సులభంగా గమ్యాన్ని చేరుకుంటుంది. మారుతి జిమ్నీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా గమ్యం చేరుకుంటుంది.

అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శించాయి : ఈ టాస్క్ అనంతరం దట్టమైన పొదలు, మట్టితో కూడిన మార్గంలో మహీంద్రా థార్, మారుతి జిమ్నీలను పరీక్షించారు. ఈ రెండు ఆఫ్ రోడ్ SUVలు అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఈ రెండు వాహనాలు ఆఫ్ రోడ్ స్పెక్ టైర్లతో అమర్చబడి ఉన్నాయి. ఫలితంగా మట్టి, ఇసుక మార్గాల్లో ఎటువంటి సమస్యలు లేకుండా నావిగేట్ చేస్తాయి.
ఆఫ్‌రోడ్ SUVల పనితీరు : మహీంద్రా థార్ 2.0 లీటర్ టర్బోఛార్జడ్ పెట్రోల్ ఇంజిన్, 2.2 లీటర్ టర్బోఛార్జడ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌తో లభిస్తుంది. అదే మారుతి జిమ్నీ 1.2 నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 5-స్పీడ్ మాన్యువల్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








