ఆఫ్-రోడ్ ప్రియులారా ఊపిరి పీల్చుకొండి.. 'మహీంద్రా థార్ RWD' వచ్చేసింది: ధర రూ. 9.99 లక్షలు
భారతీయ మార్కెట్లో 'మహీంద్రా థార్' కి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు, ఎందుకంటే ఇప్పటికే మార్కెట్లో విక్రయించబడుతున్న థార్ అధిక సంఖ్యలో బుకింగ్స్ పొందింది. అయితే కంపెనీ ఈ రోజు 'మహీంద్రా థార్ RWD' విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

చాలా రోజులు నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహీంద్రా థార్ RWD (రియర్-వీల్-డ్రైవ్) ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఈ కొత్త థార్ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధరలు కేవలం మొదటి 10,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. కావున ఏ ధరలు మొదట బుక్ చేఉకున్న 10,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి.

మహీంద్రా థార్ RWD మొత్తమ్ మూడు వేరియంట్స్ లో కేవలం హార్డ్‌టాప్ రూఫ్‌తో అందించబడతాయి. అయితే ఇవన్నీ కూడా డీజిల్ (మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే) మరియు పెట్రోల్ ఇంజన్ (ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్) ఆప్సన్స్ తో లభిస్తాయి. మహీంద్రా థార్ ఆర్‌డబ్ల్యుడి డెలివరీలు జనవరి 14 నుంచి ప్రారంభమవుతాయి.

మహీంద్రా థార్ ఆర్‌డబ్ల్యుడి ఎఎక్స్ (ఓ) వేరియంట్ లేదా బేస్ వేరియంట్ ధర రూ. 9.99 లక్షలు కాగా, కాగా థార్ ఆర్‌డబ్ల్యుడి ఎల్‌ఎక్స్ వేరియంట్ ధర రూ. 10.99 లక్షల వరకు ఉంటుంది. అదే సమయంలో థార్ ఆర్‌డబ్ల్యుడి ఎల్‌ఎక్స్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 13.49 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).
| Mahindra Thar RWD Price | |
| AX (O) RWD - Diesel MT - Hard Top | ₹9.99 Lakh |
| X RWD - Diesel MT - Hard Top | ₹10.99 Lakh |
| LX RWD - Petrol AT - Hard Top | ₹13.49 Lakh |

సరికొత్త మహీంద్రా థార్ RWD లో ఉన్న 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ దాని 4WD వేరియంట్ మాదిరిగా అదే పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ 6 సీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.
డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, థార్ RWD మోడల్ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ పొందుతుంది. ఇది 117 బిహెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది. అయితే ఈ డీజిల్ ఇంజిన్ కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందించబడుతుంది. ఇందులో డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ అందుబాటులో లేదు.

మహీంద్రా థార్ RWD రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి బ్లేజింగ్ బ్రాంజ్ మరియు ఎవరెస్ట్ వైట్ కలర్స్. మహీంద్రా థార్ ఇప్పుడు కొత్త యాక్ససరీస్ ప్యాక్ తో అందించబడుతుంది. ఇందులో నాలుగు విభిన్న డిజైన్స్ తో అందుబాటులో ఉన్న ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ స్టైల్ ప్యాక్‌లు ఉన్నాయి.
ఈ కొత్త యాక్సెసరీస్‌లో కొత్త ఫ్రంట్ మరియు రియర్ ఆర్మ్‌రెస్ట్‌లు స్టోరేజ్‌తో పాటు వెనుక భాగంలో కప్ హోల్డర్‌లు మరియు USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్త మహీంద్రా థార్ ని మరింత అద్భుతంగా చూపడంలో సహాయపడతాయి.

ఇంటీరియర్ విషయానికీ వస్తే, ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ వంటి వాటికి సపోర్ట్ చేసే 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. అంతే కాకుండా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ రియర్ వ్యూ మిర్రర్స్, క్రూయిజ్ కంట్రోల్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫీచర్స్ తో పాటు కొత్త మహీంద్రా థార్ ఆటో స్టార్ట్/స్టాప్ ఫంక్షన్ పొందుతుంది. దీనిని స్టీరింగ్ వీల్ మరియు డ్రైవర్ డోర్ మధ్య కంట్రోల్ ప్యానెల్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి బటన్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.
ఎక్కువమంది కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో మహీంద్రా ఈ కొత్త మహీంద్రా థార్ RWD విడుదల చేయడం జరిగింది. ఇది దేశీయ మార్కెట్లో ఫోర్స్ గూర్ఖా మరియు రాబోయే మారుతి జిమ్నీ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కొత్త మహీంద్రా థార్ ఆఫ్ రోడర్ మార్కెట్లో తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము.


Click it and Unblock the Notifications








