మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ కారులో సరికొత్త అప్‌డేట్స్.. అవేంటో తెలుసా..?
దేశీయ మార్కెట్లో ప్రముఖ కార్ల తయారీ దారు మహీంద్రా అండ్ మహీంద్రా మోటార్స్ వినియోగదారుల్లో మంచి ఆదరణ పొందింది. ఇటీవల మహీంద్రా ఎలక్ట్రిక్ సెగ్మెంట్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల మహీంద్రా XUV 400 పేరుతో ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది.
అయితే మహీంద్రా విడుదల చేసిన ఎలక్ట్రిక్ కారు ఇదొక్కటే. తాజాగా మహీంద్రా XUV 400 ఎలక్ట్రిక్ కారును కొత్త ఫీచర్స్‌తో అప్‌డేట్ చేసింది ఈ సంస్థ. ఆ ఫీచర్లేంటి.? వాటి ప్రయోజనాలు.. ఇంకా ఈ ఎలక్ట్రిక్ కారు గురించి పూర్తి వివరాలను ఈ కథనంలో మీకు అందిస్తున్నాం.

దేశీయ మార్కెట్లో సాధారణంగా పండుగల సమయంలో కొత్త వాహనాలు కొనడానికి వినియోగదారులు ఆసక్తి కనబరుస్తారు. అందుకు తగినట్లుగా ఆటో మేకర్లు సైతం డిస్కౌంట్లు, ఆఫర్లు, కొత్త మోడళ్లతో వినియోగదారులను ఆకర్షిస్తాయి. ఈ నేపథ్యంలో మహీంద్రా XUV 400 సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి రానుంది.
మహీంద్రా తన ఎలక్ట్రిక్ కారు XUV 400 మోడల్‌ను 8 కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. ఈ 8 కొత్త ఫీచర్లలో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో డిమ్మింగ్ రియర్‌వ్యూ మిర్రర్, ఫాగ్ ల్యాంప్స్, బూట్ ల్యాంప్ మరియు 6-స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను తీసుకువచ్చింది.

అయితే ఈ అప్‌డేట్‌లు XUV 400 యొక్క ఖరీదైన టాప్-ఎండ్ వేరియంట్, ELలో మాత్రమే ప్రవేశపెడుతుంది. కొత్త అప్‌డేట్ల కారణంగా మహీంద్రా XUV 400 ఎలక్ట్రిక్ కారు యొక్క EL వేరియంట్ ధరను రూ.20,000 పెంచింది. ఫలితంగా, మహీంద్రా XUV 400 EL ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ.19.19 లక్షల నుంచి రూ.19.39 లక్షలకు పెరగనుంది.
మహీంద్రా యొక్క ఎలక్ట్రిక్ సబ్ కాంపాక్ట్ XUV 400, 34.5 kWh మరియు 39.4 kWh కంటే లార్జ్ బ్యాటరీ ఎంపికలను అందిస్తుంది. 34.5 kWh బ్యాటరీ ప్యాక్ ఫుల్ ఛార్జింగ్ తో 375 km వరకు రేంజ్‌ను ఇస్తుంది. భారీ 39.4 kWh బ్యాటరీ ప్యాక్ సింగిల్ పూర్తి ఛార్జింగ్‌తో 456 కి.మీల రేంజ్‌ను కవర్ చేస్తుంది.

ప్రస్తుతం, XUV 400 EL వేరియంట్, 8 కొత్త ఫీచర్లను కలిగి ఉంది. ఇది 39.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. XUV 400 ఎలక్ట్రిక్ కారు గరిష్ఠంగా 147.5 bhp శక్తిని మరియు 310 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 8.3 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదు.
ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ DC ఛార్జర్‌తో, XUV 400 బ్యాటరీని కేవలం 50 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేస్తుంది. గృహ వినియోగం కోసం 7.2 kW AC ఛార్జ్‌పై 6 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. XUV 400 ఎలక్ట్రిక్ కారు ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ. 15.99 లక్షలుగా ఉంది.
మహీంద్రా జనవరి 2023లో XUV 400 ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఏడాది చివరి నాటికి కనీసం 20,000 XUV 400లను కస్టమర్లకు డెలివరీ చేస్తామని మహీంద్రా కారు విడుదల సందర్భంగా తెలిపింది. ఏదైనా కారుకు అదనపు ఫీచర్లను జోడించడం వల్ల కొనుగోలుదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అమ్మకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications








