24 గంటల్లో 751 కిమీ ప్రయాణం.. మంచు కొండల్లో మహీంద్రా XUV400 EV అరుదైన రికార్డ్
దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా గత ఏడాది సెప్టెంబర్ నెలలో తన XUV400 ఎలక్ట్రిక్ ఆవిష్కరించింది. ఈ నెలలో కంపెనీ ధరలను కూడా ప్రకటించే అవకాశం ఉంది, కానీ అప్పుడే ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సరి కొత్త రికార్డ్ సృష్టించి తన ఖాతాలో వేసుకుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ సరికొత్త రికార్డును నెలకొల్పినట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించి. ఇటీవల ఎక్స్‌యూవీ400 హిమాచల్ ప్రదేశ్‌లోని కైలాంగ్, లాహౌల్ స్పితి నుంచి డ్రైవింగ్ ప్రారంభించి సున్నా డిగ్రీలకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద 24 గంటలు 751 కిలోమీటర్లు ప్రయాణించింది. సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలో 24 గంటల్లో 751 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనంగా మహీంద్రా ఎక్స్‌యూవీ400 నిలిచిపోయింది.

మార్కెట్లో ఇంకా అధికారికంగా లాంచ్ కాక ముందే ఈ గొప్ప రికార్డ్ కైవసం చేసుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. సబ్-జీరో భూభాగంలోని నిటారుగా ఉన్న వాలులలో కూడా XUV400 సజావుగా ముందుకు సాగింది. ఎత్తైన ప్రదేశాల్లోని వంపుల్లో కారు నడపడం కష్టతరం, అయినప్పటికీ XUV400 24 గంటల్లో 751 కిమీ ప్రయాణించి తన పనితీరుని నిరూపించుకుంది.

మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ 112 Ah కెపాసిటీ రేటింగ్ కలిగిన 39.4 kWh బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఈ బ్యాటరీ ప్యాక్‌లో NMC (నికెల్, మాంగనీస్ మరియు కోబాల్ట్) సమ్మేళనం ఉంటుంది. కావున ఈ ఎలక్ట్రిక్ కారు బరువు 1,960 కేజీలు కాగా, ఇందులోని బ్యాటరీ బరువు 309 కేజీల వరకు ఉంటుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 147.5 బిహెచ్‌పి పవర్ మరియు 310 ఎన్ఎమ్ టార్క్ అందించే ఒక పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ఉంటుంది. ఇది కారులో అమర్చిన శక్తివంతమైన 39.5kWh బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ఇండియన్ డ్రైవింగ్ సైకిల్ (MIDC) ప్రకారం, ఒక పుల్ ఛార్జ్ తో గరిష్టంగా 456 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని ధృవీకరించబడింది.

ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలోని బ్యాటరీ ప్యాక్ డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ కోసం IP67 రేటింగ్ కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 8.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో ఇది 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం కావడానికి పట్టే సమయం కేవలం 4 సెకన్లు మాత్రమే. దీని గరిష్ట వేగం గంటకు 150 కిమీ వరకు ఉంటుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పరిమాణం పరంగా కూడా ఉత్తమంగా ఉంటుంది. దీని పొడవు 4,200 మిమీ, వెడల్పు 1,821 మిమీ మరియు ఎత్తు 1,634 మిమీగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ SUV యొక్క వీల్‌బేస్ 2,600 మిమీగా ఉంది మరియు దీని బూట్ స్పేస్ సామర్థ్యం 378 లీటర్ల వరకు ఉంటుంది.

ఎక్స్‌యూవీ400 యొక్క బ్యాటరీ ప్యాక్ 50kW DC సూపర్ ఫాస్ట్ ఛార్జర్ కి కూడా సపోర్ట్ చేస్తుందని మహీంద్రా పేర్కొంది. ఈ ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 50 నిమిషాల్లోనే 0 నుండి 80 శాతం వరకూ బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
అంతే కాకుండా ఇది స్టాండర్డ్ 7.2 kW/32A అవుట్‌లెట్‌కి కూడా సపోర్ట్ చేస్తుంది. దీని సాయంతో ఇది 0 నుండి 100 శాతం ఛార్జ్ చేసుకోవడానికి 6 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. దాని కన్నా తక్కువ సామర్థ్యం కలిగిన స్టాండర్డ్ 3.3 kW/16A డొమెస్టిక్ సాకెట్ సాయంతో చార్జ్ చేసినప్పుడు, బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయడానికి 13 గంటల సమయం పడుతుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ400 మంచి డిజైన్ కలిగి ఉంటుంది. ముందు భాగంలో ఫేక్ ఫ్రంట్ గ్రిల్ పై కాపర్-కలర్ మహీంద్రా ఎలక్ట్రిఫైడ్ ట్విన్ పీక్ బ్యాడ్జ్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. ఈ కాపర్ కలర్ ఎలిమెంట్స్ కొత్త ఎక్స్‌యూవీ400 ప్రంట్ బంపర్, సైడ్ డోర్స్, రూఫ్, వెనుక లోగో మరియు ఇంటీరియర్‌లో అక్కడక్కడా కనిపిస్తాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ400లో డైమండ్-కట్ హై-కాంట్రాస్ట్ సర్ఫేస్ ట్రీట్‌మెంట్‌ను కలిగి ఉన్న కొత్త హై గ్లోస్ అల్లాయ్ వీల్స్ కూడా చాలా స్పెషల్ గా కనిపిస్తాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన 60కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు ఆర్కిటిక్ బ్లూ, ఎవరెస్ట్ వైట్, గెలాక్సీ గ్రే, కాపర్ ఫినిషింగ్ రూఫ్‌తో నాపోలి బ్లాక్ మరియు బ్లూ శాటిన్ అనే కలర్ ఆప్సన్స్ లో లభిస్తాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మహీంద్రా XUV400 ధరల గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








