Mahindra XUV300 ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌.. ఇతర కంపెనీలకు గట్టిపోటీ?

మహీంద్రా సంస్థకు భారత్‌ ఆటోమొబైల్‌ రంగంలో మంచి ఆదరణ ఉంది. దేశంలోని విదేశీ సంస్థలకు గట్టిపోటీని ఇచ్చేందుకు మహీంద్రా సంస్థ తన XUV300 (Mahindra XUV300 SUV) కారును అప్‌గ్రేడ్‌ చేస్తోంది. ఈ వాహనాన్ని త్వరలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

మహీంద్రా XUV300 SUV 2019 ఫిబ్రవరిలో భారత్‌లో విడుదల అయింది. ఈ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఉంది. ఆ కారణంగా ఇతర సంస్థలకు గట్టి పోటీనిచ్చేందుకు మహీంద్రా సంస్థ ఈ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను విడుదల చేస్తోంది. ఇతర స్వదేశీ సంస్థలు కూడా తమ ఉత్పత్తుల ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌లను విడుదల చేస్తున్నాయి. టాటా ఇటీవలే నెక్సాన్‌ ఎస్‌యూవీని ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది.

mahindra XUV300 2024 latest updates

గతకొంత కాలంగా సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మహీంద్రా సంస్థ ఇతర ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో ప్రస్తుతం XUV300 ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ సెగ్మెంట్‌లో ఇతర సంస్థలకు గట్టి పోటీ ఇవ్వాలని మహీంద్రా సంస్థ భావిస్తోందని తెలుస్తోంది.

హాలోజన్‌ బల్బులు.. : త్వరలో విడుదల కానున్న మహీంద్రా XUV300 ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ సాధారణ హాలోజన్ బల్బులను కలిగి ఉంది. లోభీమ్‌ లైటింగ్‌ కోసం ప్రాజెక్టర్‌ తరహా యూనిట్‌ను కలిగి ఉంది. అయితే ఇతర సంస్థలు మాత్రం అధునాతన LED హెడ్‌లైట్ల సెటప్‌ను కలిగి ఉన్నారు. అయితే XUV300 కొత్త వెర్షన్‌లో అప్‌డేట్‌ చేయబడిన ఫ్రంట్ బంపర్‌, రియర్‌ బంపర్‌, అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంది.

mahindra XUV300 Facelift powertrain

డ్యాష్‌బోర్డ్‌ అప్‌గ్రేడ్‌: ఈ కొత్త వెర్షన్ కారులో టెయిల్‌ల్యాంప్‌లు ప్రీమియం లుక్‌ కోసం 3D ఎలిమెంట్‌లను కలిగి ఉంటాయి. దాంతోపాటు ఈ SUV వెనుక సీట్లో ముగ్గురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చొని ప్రయాణం చేసే వీలుంది. అయితే డ్యాష్‌బోర్డు అప్‌గ్రేడ్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫోటైన్‌మెంట్‌ యూనిట్‌ మరియు డిజిటల్‌ ఇన్‌స్ర్టుమెంట్ క్లస్టర్‌ కూడా వచ్చే అవకాశం ఉంది.

ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ ఫీచర్లు..! : ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఈ కొత్త ఎస్‌యూవీ XUV300 పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, వైర్‌లెస్‌ ఛార్జర్‌, వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీల సరౌండ్‌ వ్యూ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్‌, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ సహా మరిన్ని ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది.

mahindra XUV300 Facelift car

ప్రస్తుతం అందుబాటులో ఉన్న XUV300 SUV భద్రతపరంగా గ్లోబల్‌ NCAP 5-స్టార్‌ రేటింగ్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం భారత్‌లో సురక్షితమైన వాహనాల్లో ఒకటిగా ఉంది. అయితే త్వరలో విడుదల కానున్న ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ ADAS- అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ టెక్నాలజీతో వస్తుందా లేదా అనేదానిపై స్పష్టత లేదు.

అయితే ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ 1.2 లీటర్‌ టర్బోఛార్జ్‌ TCMPFi పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 109bhp శక్తి, 200Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే 1.2 లీటర్‌ టర్బోఛార్జ్‌డ్‌ mStallion TGDi పెట్రోల్ ఇంజిన్‌.. 128bhp శక్తి, 230Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

mahindra XUV300 Facelift specs

ఈ కారు 1.5 లీటర్ టర్బోఛార్జడ్‌ డీజిల్‌ ఇంజిన్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 115bhp, 300Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. mStallion TGDi పెట్రోల్ ఇంజిన్‌ 6-స్పీడ్ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. అదే మిగిలిన ఇంజిన్లు 6-స్పీడ్‌ AMT ట్రాన్స్‌మిషన్‌ గేర్‌బాక్స్‌తో జతచేయబడతాయి.

More from DriveSpark

Article Published On: Saturday, November 4, 2023, 9:08 [IST]
English summary
Mahindra xuv300 facelift version raedy to launch soon here are the details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+