Mahindra కారుపై రూ.1.30 లక్షల విలువైన తగ్గింపు ప్రయోజనాలు.. ఈ ఆఫర్ ఎప్పటివరకు ఉందంటే?
మహీంద్రా డీలర్‌షిప్‌లు కీలక ప్రకటన చేశాయి. డిసెంబర్ నెలలో భారీ తగ్గింపు ప్రయోజనాలను ప్రకటించాయి. ఈ ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. ఈ ఆఫర్‌లో భాగంగా మహీంద్రా XUV300పైన (Mahindra XUV300) భారీ తగ్గింపు లభించింది. రూ. లక్ష నగదు తగ్గింపు, రూ.30వేల ఎక్స్చేంజీ బోనస్‌ను కలిగి ఉంటుంది.
జనవరి నుంచి పెరగనున్న ధరలు : ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రాంతం, డిలర్‌షిప్‌పై ఆధారపడి ఆఫర్ భిన్నంగా ఉండే అవకాశం ఉంది. మరింత స్పష్టమైన సమాచారం కోసం దగ్గరలోని షోరూంను సంప్రదించాల్సి ఉంటుంది. అయితే జనవరి నుంచి కార్ల ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే మహీంద్రా సంస్థ వెల్లడించింది.

మహీంద్రా XUV300 ధర : మహీంద్రా XUV300 SUV భారత్ మార్కెట్ రూ.7.99 లక్షల నుంచి రూ.14.76 లక్షల మధ్య ఉంది. ఈ SUV 5 వేరియంట్లలో అందుబాటులో ఉంది. మరియు 7 రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. XUV300 SUV పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది.
మహీంద్రా XUV300 ఇంజిన్లు, పనితీరు : 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ గరిష్ఠంగా 110Ps శక్తి, మరియు 200Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు 1.2 లీటర్ TGDI పెట్రోల్ ఇంజిన్ 130PS మరియు 250Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ గరిష్ఠంగా 117ps శక్తి, 300Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఎస్‌యూవీ ఎంత మైలేజీ ఇస్తుందో తెలుసా ?: 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ గరిష్ఠంగా 117ps శక్తిని, 300Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మహీంద్రా XUV300 వాహనం వేరియంట్‌ను బట్టి టూ వీల్ డ్రైవ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. అలాగే ఈ SUV 20.1 kmpl మైలేజీని ఇస్తుంది.
మహీంద్రా SUV 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, సింగిల్ పేన్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఏసీ, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, కనెక్టెడ్ కార్ టెక్ వంటి అనే ఫీచర్లు XUV300 కలిగి ఉంది. ఈ వాహనం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








