XUV400 EV బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా?

మహీంద్రా కంపెనీ ఇది వరకు చెప్పినట్లుగానే జనవరి 26 నుంచి అంటే 'రిపబ్లిక్ డే' సందర్భంగా తన XUV400 ఎలక్ట్రిక్ SUV కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే కస్టమర్లు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బుక్ చేసుకోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

మహీంద్రా కంపెనీ యొక్క ఈ XUV400 EV కోసం కస్టమర్లు రూ. 21,000 చెల్లించి కంపెనీ యొక్క అధీకృత డీలర్‌షిప్‌లో లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు మార్చి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ ఈలక్ట్రిక్ SUV చూడటానికి మంచి డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్శించే అవకాశం ఉందని భావిస్తున్నాము.

XUV400 EV బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా

మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV EC (3.2kw), EC (7.2kw) మరియు EL (7.2kw) అనే మూడు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు వరుసగా రూ. 15.99 లక్షలు, రూ. 16.49 లక్షలు మరియు రూ. 18.99 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ ధరలు కేవలం మొదటి 5000 యూనిట్లకు (ప్రతి వేరియంట్‌కు) మాత్రమే వర్తిస్తాయి. కావున కొనుగోలుదారులు ముందుగా బుక్ చేసుకోవలసిన అవసరం ఉంది.

మహీంద్రా మంచి పనితీరుని అందించేలా చేయడానికి తన కొత్త XUV400 EV ని రెండు బ్యాటరీ ప్యాక్‌లతో అందిస్తుంది. అవి 34.5 కిలోవాట్ బ్యాటరీ మరియు 39.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్. ఈ రెండూ 150 హెచ్‌పి పవర్ మరియు 310 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఫ్రంట్ యాక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును కూడా పొందుతాయి. ఇది కేవలం 8.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

XUV400 EV గంటకు 150 కిమీ వరకు వేగవంతం అవుతుంది. XUV400 EV మూడు డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది. అవి ఫన్, ఫాస్ట్ మరియు ఫియర్‌లెస్ డ్రైవింగ్ మోడ్స్. ఇందులోని 34.5 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 375 కిమీ రేంజ్ అందించగా, 39.4 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 456 కిమీ రేంజ్ అందిస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ కారు 50kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 50 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది. అదే సమయంలో 7.2kW ఛార్జర్‌ ద్వారా 6 గంటల 30 నిమిషాలు మరియు 3.3kW AC ఛార్జర్‌ ద్వారా 13 గంటల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోగలదు. ఈ కొత్త XUV400 EV మొత్తం ఐదు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. ఇందులో సింగిల్ టోన్ కలర్స్ మరియు డ్యూయెల్ టోన్ కలర్స్ ఉన్నాయి.

XUV400 EV డిజైన్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ SUV ప్రంట్ బంపర్, సైడ్ డోర్స్, రూఫ్, వెనుక లోగో మరియు ఇంటీరియర్‌లో అక్కడక్కడా కనిపిస్తాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ400లో డైమండ్-కట్ హై-కాంట్రాస్ట్ సర్ఫేస్ ట్రీట్‌మెంట్‌ను కలిగి ఉన్న కొత్త హై గ్లోస్ అల్లాయ్ వీల్స్‌ కూడా చాలా స్పెషల్ గా కనిపిస్తాయి. మొత్తానికి ఈ ఎలక్ట్రిక్ XUV400 చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్, సింగిల్-పేన్ సన్‌రూఫ్ మరియు ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌లతో కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ వంటి ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా XUV400 EV ని మేము ఇప్పటికే డ్రైవ్ చేసాము. ఈ ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Mahindra xuv400 ev booking details in telugu
Story first published: Friday, January 27, 2023, 10:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X