XUV400 EV ధరలు వెల్లడించిన Mahindra.. వేరియంట్స్ వారీగా ధరలు

దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్లో ఇప్పటికే ఆవిష్కరించిన తన ఎక్స్‌యూవీ400 ఈవి (XUV400 EV) ధరలను అధికారికంగా వెల్లడించింది. మహీంద్రా XUV400 EV ధరలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

కంపెనీ వెల్లడించిన సమాచారం ప్రకారం, మహీంద్రా ఎక్స్‌యూవీ400 మూడు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి EC (3.2kw), EC (7.2kw) మరియు EL (7.2kw). వీటి ధరలు వరుసగా రూ. 15.99 లక్షలు, రూ. 16.49 లక్షలు మరియు రూ. 18.99 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ ధరలు మొదటి 5000 యూనిట్లకు (ప్రతి వేరియంట్‌కు) మాత్రమే వర్తిస్తాయి. డెలివరీలు మార్చి నుంచి ప్రారంభమవుతాయి.

XUV400 EV ధరలు వెల్లడించిన Mahindra

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ SUV ని గత సెప్టెంబర్ నెలలో ఆవిష్కరించింది. అయితే దీని కోసం జనవరి 26 నుంచి బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభమవుతాయి. కావున ఆసక్తి కలిగిన కస్టమర్లు జనవరి 26 నుంచి బుక్ చేసుకోవచ్చు. ఈ SUV మంచి డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ముందు భాగంలో ఫేక్ ఫ్రంట్ గ్రిల్ పై కాపర్-కలర్ మహీంద్రా ఎలక్ట్రిఫైడ్ ట్విన్ పీక్ బ్యాడ్జ్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది.

ఈ కాపర్ కలర్ ఎలిమెంట్స్ కొత్త ఎక్స్‌యూవీ400 ప్రంట్ బంపర్, సైడ్ డోర్స్, రూఫ్, వెనుక లోగో మరియు ఇంటీరియర్‌లో అక్కడక్కడా కనిపిస్తాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ400లో డైమండ్-కట్ హై-కాంట్రాస్ట్ సర్ఫేస్ ట్రీట్‌మెంట్‌ను కలిగి ఉన్న కొత్త హై గ్లోస్ అల్లాయ్ వీల్స్‌ కూడా చాలా స్పెషల్ గా కనిపిస్తాయి. కస్టమర్లు సమీపంలో ఉన్న డీలర్‌షిప్ వద్ద టెస్ట్ డ్రైవ్ కోసం నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా 34 నగరాల్లో టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభమయ్యాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఫీచర్స్ విషయానికి వస్తే, టాప్-స్పెక్ వెర్షన్ మహీంద్రా యొక్క అడ్రినోఎక్స్ సాఫ్ట్‌వేర్‌తో 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్, సింగిల్-పేన్ సన్‌రూఫ్ మరియు ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌లతో కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ వంటి ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో ఏసీ కంట్రోల్స్ మరియు ఇతర ఆధునిక ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

మహీంద్రా XUV400 EV రెండు బ్యాటరీ ప్యాక్‌లను పొందుతుంది. అవి 34.5kWh బ్యాటరీ మరియు 39.4kWh బ్యాటరీ ప్యాక్. ఈ రెండూ 150 hp మరియు 310 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే ఫ్రంట్ యాక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును కూడా పొందుతాయి. ఇది కేవలం 8.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది గంటకు 150 కిమీ వరకు వేగవంతం అవుతుంది. XUV400 ఫన్, ఫాస్ట్ మరియు ఫియర్‌లెస్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది.

మహీంద్రా XUV400 EV లోని 34.5 kWh బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 375 కిమీ రేంజ్ అందిస్తుంది. అదే సమయంలో ఇందులోని 39.4 kWh బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 456 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఇది 50kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 50 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

7.2kW ఛార్జర్‌ ద్వారా 6 గంటల 30 నిమిషాలు మరియు 3.3kW AC ఛార్జర్‌ ద్వారా 13 గంటల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు. XUV400 EV ఎలక్ట్రిక్ కారు ఇది కలర్ 5 ఆప్సన్స్ లో లభిస్తుంది. అవి ఆర్కిటిక్ బ్లూ, ఎవరెస్ట్ వైట్, గెలాక్సీ గ్రే, కాపర్ ఫినిషింగ్‌ రూఫ్‌తో నాపోలి బ్లాక్ మరియు బ్లూ శాటిన్ కలర్లు ఉన్నాయి (బ్లాక్ మరియు బ్లూ శాటిన్ కలర్లు రెండూ డ్యూయెల్ టోన్ కలర్లు). XUV400 పనితీరు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ మహీంద్రా XUV400 ఈవీ రివ్యూపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Mahindra xuv400 ev launched at rs 15 99 lakh design features and details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X