Mahindra XUV Discount : కారుపై రూ.4 లక్షల వరకు విలువైన తగ్గింపు ప్రయోజనాలు.. ఆఫర్ ఎప్పటివరకు ఉందంటే?

భారత ఆటోమొబైల్‌ మార్కెట్‌లో మహీంద్రా కార్లకు ప్రత్యేక స్థానం ఉంది. డిజైన్‌, ఫీచర్ల సహా ఇతర భద్రతా ఫీచర్లతో ఈ కార్లు కస్టమర్లను భారీగా ఆకట్టుకున్నాయి. మరి కొద్ది రోజుల్లో 2023 సంవత్సరం ముగిసిపోనుంది. దీంతో ఏడాది చివర్లో కార్ల విక్రయాలను వృద్ధి చేసేందుకు మహీంద్రా సంస్థ భారీ తగ్గింపులను ప్రకటన చేసింది.

ఎలక్ట్రిక్‌ కారుపై రూ.4 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలు : ఈ ఆఫర్‌లో భాగంగా మహీంద్రా ఏకైక ఎలక్ట్రిక్‌ కారు మహీంద్రా XUV400 SUVపై (Mahindra XUV400) అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటన చేసింది. ఈ ఎలక్ట్రిక్‌ కారు EC, EL వేరియంట్లపై రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలు అందిస్తోంది. ఆ తగ్గింపు ఆఫర్‌ డీలర్‌షిప్, స్టాక్‌, ప్రాంతాల ఆధారంగా మార్పులు ఉంటాయని తెలిపింది.

mahindra-xuv400

ఆఫర్‌ డిసెంబర్ 31 వరకు మాత్రమే : మహీంద్రా XUV400 కారుపై తగ్గింపు ప్రయోజనాల ఆఫర్‌ డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం సమీపంలోని మహీంద్రా డీలర్‌షిప్‌ను సందర్శించాలని కోరింది. ప్రస్తుతం ఈ కారు ధర రూ.15.99 లక్షల నుంచి రూ.19.39 లక్షల మధ్య ఉంది. అయితే జనవరి 2024 నుంచి దేశవ్యాప్తంగా కార్ల ధరలను పెంచుతున్నట్లు మహీంద్రా తెలిపింది.

మహీంద్రా XUV400 34.5 kWh మరియు 39.4 kWh బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ వాహనంలోని ఎలక్ట్రిక్‌ మోటార్ 150ps శక్తి, 310Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 50kW DC ఫాస్ట్‌ ఛార్జర్‌తో ఈ బ్యాటరీ ప్యాక్‌ను 0-80 శాతం చేసేందుకు 50 నిమిషాల సమయం పడుతుంది.

375 కి.మీ, 456 కి.మీ రేంజ్‌ : అదే గృహ విద్యుత్‌ వినియోగానికి 13 గంటల సమయం పడుతుంది. 34.5kWh బ్యాటరీ సింగిల్‌ ఛార్జింగ్‌తో 375 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. అదే 39.4kWh బ్యాటరీ ప్యాక్‌ సింగిల్‌ ఛార్జింగ్‌పై 456 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఈ మహీంద్రా ఎలక్ట్రిక్‌ కారు అనేక కీలక ఫీచర్లను కలిగి ఉంది.

7- అంగుళాల టచ్‌స్క్రీన్‌ సిస్టమ్‌, 60కిపైగా ఫీచర్లు, సింగిల్‌ పేన్‌ సన్‌రూఫ్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, పుష్‌ బటన్‌, స్టార్ట్‌ స్టాప్‌ బటన్‌, ఫోల్డబుల్‌ ORVM వంటి ఫీచర్లున్నాయి. భద్రత పరంగా ఈ కారు మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), కార్నరింగ్ బ్రేక్‌ కంట్రోల్, టైర్‌ ప్రెజర్ మానిటరింగ్‌ సిస్టమ్‌, హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌, రియర్‌ పార్కింగ్ కెమెరాలున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Friday, December 22, 2023, 14:00 [IST]
English summary
Mahindra xuv400 suv gets upto rs 4 lakh valuable discount in december 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+