ఆల్టో కె10 ఎక్స్‌ట్రా ఎడిషన్‌ విడుదలకు సిద్దమవుతున్న మారుతి సుజుకి.. వివరాలు

భారతీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన 'మారుతి సుజుకి' ఇప్పుడు తన 'ఆల్టో కె10 ఎక్స్‌ట్రా ఎడిషన్‌' ఆవిష్కరించింది. ఈ స్పెషల్ ఎడిషన్ దేశీయ మార్కెట్లో త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ విడుదల చేయనున్న ఈ స్పెషల్ ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.. రండి.

ఇప్పటికే అధిక ప్రజాదరణ పొందిన మారుతి ఆల్టో ఇప్పుడు సరికొత్త ఎడిషన్ లో రావడం ఆల్టో ప్రేమికులకు శుభవార్త అనే చెప్పాలి. ఈ స్పెషల్ ఎడిషన్ నిజంగా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇది బయట మరియు లోపల కూడా అనేక అప్డేట్స్ పొందుతుంది. ఈ కొత్త అప్డేట్స్ మీరు ఇందులో స్పష్టంగా గుర్తించవచ్చు. అయితే ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా హుందాగా ఉంటుంది.

ఆల్టో కె10 ఎక్స్‌ట్రా ఎడిషన్‌ విడుదలకు సిద్దమవుతున్న మారుతి

సరికొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 ఎక్స్‌ట్రా ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ ఎక్కువ కాస్మొటిక్ అప్‌గ్రేడ్‌లను పొందుతుంది. కావున ఇవన్నీ ఈ కారుని సరికొత్త హ్యాచ్‌బ్యాక్ మాదిరిగా చూపించడంలో సహాయపడతాయి. ఇందులో గుర్తించదగిన మార్పులు ఏమిటంటే ఆరంజ్ కలర్ ORVM, ముందు భాగంలో ఉండే స్పాయిలర్ ఆరంజ్ కలర్ లో ఉంటుంది. అదే సమయంలో వెనుక స్కిడ్ ప్లేట్‌ కూడా ఆరంజ్ కలర్ లో ఉండటం ఇందులో గమనించవచ్చు.

వీటితో పాటు ఈ స్పెషల్ ఎడిషన్ ఆల్టో కె10 వీల్ ఆర్చ్ క్లాడింగ్ కూడా పొందుతుంది, ఇందులో మీరు స్పష్టంగా గమనించవచ్చు. అంతే కాకుండా ఇందులో కొత్త స్వెప్ట్‌బ్యాక్ హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, పెద్ద సింగిల్ పీస్ ఫ్రంట్ గ్రిల్, సిల్వర్ కవర్‌లతో కూడిన స్టీల్ వీల్స్, బాడీ-కలర్ డోర్ హ్యాండిల్స్‌ ఉన్నాయి. ఇవి కాకుండా మిగిలినవన్నీ కూడా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉండటం చూడవచ్చు.

ఇక ఈ స్పెషల్ ఎడిషన్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో కొన్ని ఆరెంజ్ కలర్ యాక్సెంట్‌లను గమనించవచ్చు. అంతే కాకుండా ఇందులో డోర్ హ్యాండిల్స్ కూడా ఉంటాయి, అంతే కాకుండా ఈ స్పెషల్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ పెద్ద 7 ఇంచెస్ స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కలిగి ఉంటుంది మరియు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి.

కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 ఎక్స్ట్రా ఎడిషన్ డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అప్డేట్స్ పొందినప్పటికీ మెకానికల్ పరంగా ఎటువంటి మార్పులకు లోనుకాలేదు, కావున ఈ స్పెషల్ ఎడిషన్ లో అదే 1 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ కె10సి సిరీస్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 64.3 బిహెచ్‌పి పవర్ మరియు 89 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

ఇక ఈ స్పెషల్ ఎడిషన్ లో కంపెనీ ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా అందిస్తుంది. కావున ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ సిస్టం మరియు డీఫాగర్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్దారించడంలో సహాయపడతాయి. కావున ఇపుడు మారుతి ఆల్టో కె10 ఎక్స్ట్రా ఎడిషన్ లో భద్రతకు ఏ లోటు ఉండదు.

ఆధునిక కాలంలో అన్ని కంపెనీలు కొత్త ఉత్పత్తలను లేదా అప్డేటెడ్ ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మార్కెట్లో మారుతి ఆల్టో కె10 ఎక్స్ట్రా ఎడిషన్ ఆవిష్కరించింది. ఇది త్వరలోనే దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల కానుంది. ఈ స్పెషల్ ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Maruti alto k10 xtra edition unveiled features expected price details in telugu
Story first published: Monday, January 30, 2023, 10:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X