Brezza Price Hike పెరిగిన మారుతి బ్రెజా ధరలు.. కారణం ఏంటో తెలుసా,,?

BS 6 ఫేజ్ 2 నియమాలను ప్రభుత్వం కచ్చితం చేయడంతో దేశంలో కార్ల ధరల్ని అన్ని సంస్థలు పెంచేశాయి. పెరిగిన ధరలన్నీ ఏప్రిల్ 1 నుంచే దేశంలోకి అమల్లోకి వచ్చాయి. వీటితో పాటు కొన్ని చిన్న కార్లను సంస్థలు నిలిపి వేస్తున్నట్లు కూడా ప్రకటించాయి. తాజాగా టాటా తమ కార్ల ధరల్నీ 0.8శాతం పెంచింది. మారుతి బ్రెజా కారు ధరను 0.8శాతం పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది.

దేశంలో ఆటో రంగంలో పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా కార్ల విడిభాగాల ధరల పెరుగుతూ వస్తుంది. దేశంలోని చాలా కంపెనీలు తాము ఉత్పత్తి చేస్తున్న మోడల్స్‌పై ధరల పెంపుదలను ప్రకటించాయి. తాజాగా ఒక్కో కంపెనీ వివిధ మోడల్స్ పై ధరల్నీ పెంచుతూ వస్తున్నాయి. అయితే ఈ ధరల పెరుగుదల కేవలం తక్కువ మొత్తంలో ఉండటం వినియోగదారులకు పెద్ద భారంగా మారకపోవచ్చు.

maruti brezza

గత నెలలోనే ఏప్రిల్ 1 నుంచి మారుతీ సుజుకీ తన మోడల్స్ ధరలను పెంచుతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఆ సంస్థ నుంచి ప్లాగ్ షిప్ మోడల్ 0.8 శాతం ధరను పరిగణనలోకి తీసుకుంటే, మారుతి సుజుకి బ్రెజ్జా రూ.10,000 పెరుగనుంది. ప్రస్తుతం ఈ బ్రెజ్జా కాంపాక్ట్ SUV ధరలు రూ.8.28 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. టాప్-స్పెక్ డ్యూయల్-టోన్ వేరియంట్ కోసం రూ. 14.03 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.

మారుతి బ్రెజా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 103bhp వద్ద 138Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆరు స్పీడ్ మాన్యువల్ అలానే ఆటోమేటిక్ యూనిట్‌తో జత చేయబడింది. SUV పెట్రోల్-CNG పవర్‌ట్రెయిన్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.

ప్రస్తుతం బ్రెజా SUV LXi, VXi, ZXi, ZXi ప్లస్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. మారుతి సుజుకి బ్రెజ్జా CNGలో కూడా లభిస్తుంది: మారుతి సుజుకి తన S-CNG పోర్ట్‌ఫోలియోను కూడా విస్తరించింది. దీనిని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ.25000 టోకెన్ మొత్తం చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. కొత్త Brezza CNG ప్రారంభ ధర రూ.9.14 లక్షలు, ఎక్స్-షోరూమ్ గా ఉంది.

ఈ 2023 మారుతి సుజుకి బ్రెజ్జా CNG SUV 3 ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉంది. 2023 మారుతి సుజుకి బ్రెజా CNG SUV కేవలం 25.51 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే, బ్రెజా CNG SUV 1.5-లీటర్, డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT, సహజ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది సీఎన్‌జీ మోడ్‌లో 86.63bhp వద్ద 86.63nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

2023 మారుతీ సుజుకి బ్రెజా CNG SUVలో అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ SUVలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), 360 డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD మరిన్ని ఉన్నాయి. మారుతి సమీప భవిష్యత్తులో 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ని ఆప్షన్‌గా అందించే అవకాశం ఉంది.

కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు మారుతి సుజుకి సరికొత్తగా IDFC ఫస్ట్ బ్యాంక్ తో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఇది కొత్త కార్ లోన్‌లు, ప్రీ-ఓన్డ్ కార్ లోన్‌లు, కమర్షియల్ లోన్‌ల ద్వారా కస్టమర్‌లకు వ్యక్తిగతంగా ఫైనాన్స్ అందించేందుకు ఉపయోగపడనుంది. తాజా పెంపుతో మారుతికి ఉన్న క్రేజ్ ఆధారంగా ఎటువంటి ప్రభావం సేల్స్ పై చూపబోదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Monday, April 17, 2023, 14:03 [IST]
English summary
Maruti brezza price hiked details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+