లాటిన్ అమెరికాకు పయనమైన 'మారుతి గ్రాండ్ విటారా'.. అంతర్జాతీయ మార్కెట్లో అద్భుతం చేయనుందా..?

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి గత 2022 సెప్టెంబర్ నెలలో తన 'గ్రాండ్ విటారా' ప్రారంభించింది. కంపెనీ ఈ SUV ని మార్కెట్లో విడుదల చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతూ ఇప్పుడు విదేశీ మార్కెట్ కోసం సిద్ధమైపోయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

మారుతి సుజుకి యొక్క గ్రాండ్ విటారా మొదటి బ్యాచ్ ఇటీవల కామరాజర్ పోర్ట్ (పూర్వపు ఎన్నూర్ పోర్ట్) నుండి లాటిన్ అమెరికాకు పయనమైంది. ప్రస్తుతం కంపెనీ ఈ SUV ని కేవలం లాటిన్ అమెరికాకి మాత్రమే కాకుండా.. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఏషియన్ (ASEAN) మొదలైన దాదాపు 60 దేశాలకు పైగా ఎగుమతి చేయడానికి ప్రయత్నిస్తోంది. విదేశాలకు ఎగుమతవుతున్న మోడల్స్ లో గ్రాండ్ విటారా అనేది కంపెనీ యొక్క 17 వ మోడల్.

లాటిన్ అమెరికాకు పయనమైన మారుతి గ్రాండ్ విటారా.. వివరాలు

ఇప్పటికే మారుతి సుజుకి విదేశాలకు మారుతి డిజైర్ సెడాన్, స్విఫ్ట్, S-ప్రెస్సో, బాలెనో హ్యాచ్‌బ్యాక్‌ మరియు బ్రెజ్జా SUV వంటి వాటిని ఎగుమతి చేసి అధిక ప్రజాదరణ పొందుతోంది. అయితే ఇప్పుడు తాజాగా గ్రాండ్ విటారా మోడల్ ని ఎగుమతి చేస్తోంది. గత ఏడాది కంపెనీ మొత్తం 2,35,670 యూనిట్ల కంటే ఎక్కువ వాహనాలను ఎగుమతి చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం కూడా ఎగుమతులు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము.

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO హిసాషి టేకుచి మాట్లాడుతూ.. భారతదేశం నుంచి ఎగుమతులు క్రమంగా వృద్ధి చెందుతున్నాయి. దీనికి భారత ప్రభుత్వం కూడా తమ వంతు సహకారం అందిస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ కూడా అంతర్జాతీయ మార్కెట్లో తమ ఉనికిని పెంచుకోవడానికి కావాల్సిన ప్రయత్నాలు కూడా చేస్తోంది. రాబోయే రోజుల్లో భారతీయ మార్కెట్ నుంచి మరిన్ని ఆధునిక వాహనాలు ఎగుమతి అవుతాయని అన్నారు.

విదేశీ మార్కెట్ కోసం సిద్దమైన మారుతి గ్రాండ్ విటారా SUV లు భారతీయ మార్కెట్లో విక్రయించబడుతున్న మోడల్ మాదిరిగానే ఉన్నప్పటికీ ఇందులో స్టీరింగ్ వీల్ మాత్రం ఎడమవైపు ఉండటం చూడవచ్చు. ఇది కాకుండా డిజైన్ మరియు ఫీచర్స్, పర్ఫామెన్స్ వంటి వాటిలో ఎటువంటి మార్పులు ఉండే అవకాశం లేదని భవిస్తున్నాము. ప్రస్తుతం మార్కెట్లో ఈ SUV మంచి అమమకాలు పొందుతూ ముందుకు సాగుతోంది.

భారతీయ మార్కెట్లో అధిక డిమాండ్ తో ముందుకు సాగుతున్న గ్రాండ్ విటారా ఇప్పుడు CNG వెర్షన్ లో కూడా అందుబాటులో ఉంది. మారుతి గ్రాండ్ విటారా దేశీయ మార్కెట్లో రూ. 10.45 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదలైంది. అయితే CNG వెర్షన్ రెండు వేరియంట్స్ లో మాత్రమే లభిస్తుంది. అవి డెల్టా (మ్యాన్యువల్) మరియు జీటా (మ్యాన్యువల్). వీటి ధరలు వరుసగా రూ. 12.85 లక్షలు మరియు రూ. 14.84 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

కొత్త మారుతి గ్రాండ్ విటారా S-CNG వెర్షన్ యొక్క 1,462 సిసి ఫోర్ సిలిండర్ K15C డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్ అనేది పెట్రోల్ మరియు CNG రెండింటిలోనూ పని చేస్తుంది. CNG మోడ్‌లో, గ్రాండ్ విటారా S-CNG లోని K15C ఇంజన్ 5,500rpm వద్ద 86.63bhp మరియు 4,200 rpm వద్ద 121.5Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ మోడ్‌లో ఇంజిన్ 99.2bhp మరియు 136Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా CNG కేవలం 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందించబడుతుంది. ఈ CNG మోడల్ మైలేజ్ విషయానికి వస్తే, ఇది 26.6 కిమీ/కేజీ పరిధిని అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించబడింది. ఈ మైలేజ్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ. కావున వాహన వినియోగదారులు తప్పకుండా ఈ CNG మోడల్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారని ఆశిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Friday, January 20, 2023, 9:49 [IST]
English summary
Maruti grand vitara export starts to latin america details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+