ఎట్టకేలకు 2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన 5 డోర్స్ మారుతి జిమ్నీ, అప్పుడే మొదలైన బుకింగ్స్

ఎంతో మంది వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సరికొత్త 5 డోర్స్ మారుతి జిమ్నీ 2023 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడింది. కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఈ 5 డోర్స్ మారుతి జిమ్నీ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

మారుతి సుజుకి విడుదల చేసిన ఈ ఆధునిక 5 డోర్స్ మారుతి సుజుకి జిమ్నీ కొనాలనుకునే కస్టమర్లు దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ యొక్క Nexa డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫ్ రోడ్ SUV కఠినమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా రూపొందించబడింది. ఈ SUV ప్రపంచ మార్కెట్లో విక్రయించడానికి ముందే దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇది జీటా మరియు ఆల్ఫా అనే రెండు ట్రిమ్స్ లో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో అందించబడుతుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన 5 డోర్స్ మారుతి జిమ్నీ

మారుతి సుజుకి జిమ్నీ డిజైన్ విషయానికి వస్తే, ఇందులో LED హెడ్‌ల్యాంప్‌లు, బ్లాక్ కలర్ బంపర్‌లు, ఫ్లాప్ టైప్ డోర్ హ్యాండిల్స్ మరియు స్లైడింగ్ రియర్ విండో వంటివి ఉన్నాయి. ఈ SUV లో 2 కెప్టెన్ సీట్లు మరియు వెనుకవైపు 3 మంది ప్రయాణీకులకు ఒక బెంచ్ ఉంటాయి. సైడ్ మరియు రియర్ ప్రొఫైల్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. రూప్ మాత్రం బ్లాక్ కలర్ ఉండటం చూడవచ్చు.

ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. డాష్‌బోర్డ్ రెండు చివరలో రౌండ్ ఎయిర్ వెంట్స్ ఉంటాయి. ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే కింద మ్యాన్యువల్ బటన్లు ఉండటం కూడా గమనించవచ్చు. రెండవ వరుస ప్రయాణికుల కోసం బాటిల్ హోల్డర్స్ మరియు ఛార్జింగ్ సాకేట్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన 5 డోర్స్ మారుతి జిమ్నీ

పరిమాణం పరంగా కూడా కొత్త మారుతి జిమ్నీ 5-డోర్ విశాలంగా ఉంటుంది. ఈ SUV పొడవు 3,985 మిమీ, వెడల్పు 1,645 మిమీ, ఎత్తు 1,720 మిమీ వరకు ఉంటుంది. ఇది 3 డోర్ వెర్షన్ వీల్‌బేస్‌ కంటే ఎక్కువ (2,590 మిమీ పొడవైన) వీల్‌బేస్‌ను పొందుతుంది. కావున ఇది 3 డోర్స్ వెర్షన్ కంటే కూడా పెద్దదిగా ఉంటుంది. ఇది 85 లీటర్ బూట్ స్పేస్, 210 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 48 లీటర్ కెపాసిటీ గల ఫ్యూయల్ ట్యాంక్ పొందుతుంది.

కొత్త మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్ K15B పెట్రోల్ ఇంజన్‌ పొందుతుంది. ఇది 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్సన్స్ పొందుతుంది. సుజుకి యొక్క లెజెండరీ ఆల్ గ్రిప్ ప్రో ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా జిమ్నీ యొక్క నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ పంపుతుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన 5 డోర్స్ మారుతి జిమ్నీ

కొత్త జిమ్నీ లాడెర్ ఫ్రేమ్ ఛాసిస్‌ను కలిగి ఉంది. కావున ఈ SUV నాలుగు మూలల్లో కాయిల్ స్ప్రింగ్‌లతో 3-లింక్ రిజిడ్ యాక్సిల్ టైప్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. 5 డోర్స్ జిమ్నీ 195/80 R15 టైర్లతో 15 ఇంచెస్ వీల్స్ కలిగి ఉంటుంది. కావున ఆఫ్ రోడింగ్ సమయంలో కూడా డ్రైవ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద 5 డోర్స్ జిమ్నీ దాని 3 డోర్స్ జిమ్నీ కంటే చాలా అనుకూలంగా ఉంటుంది.

మారుతి 5 డోర్స్ జిమ్నీ కైనెటిక్ ఎల్లో, సిజ్లింగ్ రెడ్, గ్రానైట్ గ్రే, నెక్సా బ్లూ, బ్లూయిష్ బ్లాక్, పెరల్ ఆర్కిటిక్ వైట్ కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. కంపెనీ ఈ SUV ధరలను ఇంకా ప్రకటించలేదు, అయితే ధరలు తప్పకుండా త్వరలోనే వెల్లడవుతాయి, ఈ SUV లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, బ్రేక్స్ అసిస్ట్, రియర్ వ్యూ కెమెరా మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంటు ఎంకరేజ్‌ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Thursday, January 12, 2023, 12:54 [IST]
English summary
Auto expo 2023 maruti jimny 5 door debuts at auto expo 2023 disign and bookings details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+