చరిత్ర సృష్టించిన చిన్న కుటుంబాల ఉత్తమ కారు.. 45 లక్షల కార్ల విక్రయాలతో సరికొత్త రికార్డ్
దేశీయ మార్కెట్‌లో వాహనదారులకు ఫేవరెట్ బ్రాండ్ మారుతి సుజుకి. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలో ఇప్పటికే మారుతి నుంచి చాలా రకాల మోడల్స్ విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో వాహనప్రియులకు ఇష్టమైన కార్లలో మారుతి సుజుకి ఆల్టో ఒకటి. కాగా మారుతి సుజుకి ఆల్టో సరికొత్త రికార్డు సృష్టించి మార్కెట్‌లో దూసుకుపోతోంది.
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్ మోడల్ ఆల్టో కార్ల సేల్స్‌లో సరికొత్త మైలురాయిని నమోదు చేసింది. 2000లో దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన ఆల్టో మోడల్ కారు 2004కల్లా దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. తాజాగా 45 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.

హిందుస్థాన్ అంబాసిడర్ మరియు మారుతి 800 లాగానే, మారుతి సుజుకి ఆల్టోకు దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ కారును ప్రారంభించిన 23 ఏళ్లలో విక్రయాల్లో పోటాపోటీగా దూసుకుపోతే దానికంటూ ప్రత్యేక గుర్తింపును సాధించింది. పూర్తి వివరాలు ఈ కథనంలో చదవండి.
2000 సంవత్సరంలో భారత మార్కెట్‌లో విడుదలైన మారుతి సుజుకి ఆల్టో విక్రయాల్లో ప్రత్యేక మైలురాయిని అధిగమింతింది. దాదాపు 23 ఏళ్ల తర్వాత మారుతీ సుజుకి ఆల్టో కార్ల విక్రయాల్లో కొత్త రికార్డు సృష్టించింది. మొత్తంగా ఈ 23 ఏళ్లలో 45 లక్షల ఆల్టో కార్ల అమ్మకాలు జరగడం కొత్త మైలురాయి.

2008లో తొలి పది లక్షలు, 2012లో 20 లక్షలకు, 2016లో 30 లక్షల యూనిట్ల విక్రయానికి చేరుకుంది. 2020 ఆగస్టులో 40 లక్షల యూనిట్ల మార్క్ దాటేసింది. తాజాగా గురువారం 45 లక్షల యూనిట్లు విక్రయించిన మార్క్‌ను అధిగమించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
మారుతి సుజుకి ఆల్టో ప్రస్తుతం భారత మార్కెట్లో పెట్రోల్ మరియు CNG ఇంజిన్ ఎంపికలలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. మార్కెట్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి ఆల్టో వినియోగదారులను ఆకర్షిస్తూ విక్రయాల్లో దూసుకుపోయింది. 2016 వరకు మారుతీ సుజుకి ఆల్టో 30 లక్షల యూనిట్లను విక్రయించి సరికొత్త మైలురాయిని అధిగమించింది.
ఆ తర్వాత ఏడేళ్లలో, మరో 1.5 లక్షల మంది వినియోగదారులు మారుతి సుజుకి ఆల్టోను కొనుగోలు చేశారు. అలా మొత్తంగా సుమారు 23 ఏళ్లలో 45 లక్షల మంది కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్న కారుగా మారుతి సుజుకి ఆల్టో రికార్డు సృష్టించింది. ఇది నిజంగా మారుతికి గొప్ప విజయం అనడంలో సందేహం లేదు.
మారుతి సుజుకి ఆల్టో 45 లక్షల యూనిట్ల సేల్స్‌పై మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ మరియు సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడారు. గత 2 దశాబ్దాలుగా ఆల్టో కస్టమర్లతో భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరచుకుందన్నారు. ఆల్టో కారు అద్భుతమైన ప్రయాణం గురించి గర్విస్తున్నట్లు చెప్పారు. ఆల్టో కార్లు 45 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని దాటడం కస్టమర్లు తమపై ఉంచిన అచంచలమైన నమ్మకానికి నిదర్శనంగా పేర్కోన్నారు.
మారుతి సుజుకి కార్లలో 5 స్టార్ రేటింగ్ భద్రత లేకపోవడం వంటి విమర్శలు ఉన్నప్పటికీ, కస్టమర్లు మారుతి సుజుకి ఆల్టోను ఎక్కువగా ఇష్టపడటానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ధర చాలా తక్కువగా ఉండటం. అంతేకాకుండా, ఈ కారు నిర్వహణ చాలా సులభం. నిర్వహణ ఖర్చులు చాలా తక్కువ ఖర్చులో పూర్తవుతుంది.
అదే విధంగా మారుతి సుజుకి ఆల్టో చిన్న హ్యాచ్‌బ్యాక్ కారు కాబట్టి, రద్దీగా ఉండే సిటీ రోడ్లపై నడపడం చాలా సులభం. మారుతి సుజుకి ఆల్టోను అంతగా అనుభవం లేనివారు కూడా చాలా సులభంగా నడపవచ్చు. ఇలాంటి కారణాల వల్ల దేశంలోని మధ్యతరగతి ప్రజలు ఆల్టో కార్లను కొనుగోలు చేస్తున్నారని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








