మారుతి సుజుకి బ్రెజా CNG కారు బుకింగ్స్ షురూ.. కేవలం రూ.25,000 కడితే చాలు..

దేశంలో నేడు చమురు ధరలు ఆకాశానంటుతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడటంతో కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారు వాటికి ప్రత్యామ్నాయ CNG, ఎలక్ట్రిక్ వాహనాల వైచు చూస్తున్నారు. పెరిగతున్న ధరలకు తగినట్లు అధిక మైలేజీ/రేంజ్ ఇచ్చే వాహనాల కోసం చూస్తున్నారు. కార్ల కంపెనీలు కూడా అందుకు తగినట్లుగానే వివిధ రూపాల్లో వాహనాలను మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి.

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకీ' బ్రెజా CNG వెర్షన్ బుకింగ్స్ ని ఆరంభించింది. జనవరిలో ముగిసిన ఆటో ఎక్స్‌పోలో బ్రెజాను CNG SUVని కంపెనీ పరిచయం చేసింది. అప్పటినుంచే ఈ కారుపై చాలా అంచనాలను పెరిగాయి. తాజాగా వాటి బుకింగ్స్ ని అధికారికంగా ఆహ్వానిస్తోంది. దగ్గర్లోని డీలర్‌షిప్ లేదా కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా బుక్ ఈ కార్లను చేసుకోవచ్చు.

మారుతి సుజుకి

త్వరలోనే అందుబాటులోకి..

అతి త్వరలోనే ఈ SUV దేశీయ మార్కెట్లోకి త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అదే కంపెనీ నుంచి వచ్చిన ఎర్టిగా MPV కి ఉపయోగించే ఇంజన్ 1.5-లీటర్ K15 ఇంజిన్‌తో బ్రెజా CNG SUV కూడా రానుంది. ఈ కారు 86.63 bhp వద్ద 121.5 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో ఈ కారు వస్తుంది. కస్టమర్లు తమకు నచ్చిన గేర్ ఆప్షన్ ని ఎంచుకోవచ్చు.

ధర విషయానికి వస్తే, మారుతి సుజుకి బ్రెజ్జా CNG SUV కొనుగోలుదారులకు అత్యంత సరసమైన ధర రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కారును కొనుగోలు చేయాలి అనుకుంటే రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అద్భుతమైన పనితీరును కూడా కలిగి ఉందని చెప్పవచ్చు. ఈ కారు 26.11 km/kg మైలేజీని అందించగలదు. ప్రస్తుతం భారత మార్కెట్లో లభ్యమవుతున్న బ్రెజా పెట్రోల్ వెర్షన్ ధర రూ.7.99 లక్షల నుంచి రూ.12.30 లక్షల మధ్య ఉంది.

మారుతి సుజుకి

మార్పులు లేకుండా..

ప్రస్తుతానికి, బుకింగ్ ప్రారంభించిన మారుతి సుజుకి బ్రెజా సిఎన్‌జి ఎక్ట్సీరియర్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇంటీరియర్ లో పూర్తి నులుపును సంస్థ తీసుకువచ్చింది. 328 లీటర్ల కెపాసిటీ గల బూట్ స్పేస్‌ను ఈ కారులో ఉంది. ఈ SUVకారు VXI, ZXI అనే రెండు వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ లుక్ కస్టమర్లను ఆకర్షిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

మారుతి సుజుకి బ్రెజా CNG SUV ఫీచర్ల గురించి మాట్లాడితే.. ఇది 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్ ప్రో ప్లస్, OTA అప్‌డేట్‌తో సహా మరిన్నీ అధునాతన ఫీచర్లను పొందుతుంది. కొనుగోలుదారులు భద్రత అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది స్టార్ట్/స్టాప్ బటన్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ వ్యూ కెమెరాను కూడా పొందుతుంది.

మారుతి బ్రెజా

తొలి CNG..

బ్రెజా CNG వేరియంట్‌ ప్రవేశపెట్టడంతో ఈ పోర్ట్‌ఫోలియోలో మారుతీ సుజుకి కంపెనీ మరింత బలోపేతం కానుంది. సబ్-4 మీటర్ల SUV విభాగంలో 'బ్రెజా' టాప్ గా ఉందని చెప్పవచ్చు. ఈ విభాగంలో ఏ ఇతర కంపెనీకి చెందిన SUVకి CNG ఎంపిక లేదు. ఇది బ్రెజా కొనుగోళ్లకు ఊతం ఇస్తుందని చెప్పవచ్చు. ఈ కారుకి ప్రత్యర్థి కార్లగా హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్ లు ఉన్నాయి.

ఆటో ఎక్స్‌పో ప్రదర్శిన అనంతరం రెండు నెలల తర్వాత బుకింగ్‌లు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. ఈ కారు అద్భుతమైన పనితీరు మరియు ఆకర్షణీయమైన ఫీచర్లతో సరసమైన ధరలో విడుదల చేయబడింది. చాలా మంది కస్టమర్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారు. విడుదలైన తర్వాత వినియోగదారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

More from DriveSpark

Article Published On: Friday, March 17, 2023, 13:35 [IST]
English summary
Maruti suzuki brezza cng bookings open token amount pricing details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+