ఈ కారుకి భారీ డిమాండ్.. బుక్ చేసుకున్న ఆరు నెలల తర్వాత డెలివరీ..
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇటీవలే బ్రెజాలో CNG SUV మోడల్ ని విడుదల చేసింది. ఈ కొత్త CNG SUVకి ఊహించిన విధంగా స్పందన వస్తుంది. కొన్ని సిటీలలో ఈ సరికొత్త కారుకి భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ కారుని పొందాలంటే మీరు దాదాపు సగం సంవత్సరం వెయిట్ చేయాల్సిందే ఆ వివరాలు మీకోసం..
తాజాగా దేశంలో ఈ కార్ల కోసం బుకింగ్‌లను ఆహ్వానిస్తోంది. ఈ కారును కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు ఆన్ లైన్ లేదా డీలర్ షిప్ వద్ద బుకింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం రూ.25,000 టోకెన్ అమౌంట్ ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ 2023 మారుతి సుజుకి బ్రెజా మొత్తం 3 ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. అవి LXI, VXI, ZXI గా ఉన్నాయి.

6 నెలల సమయం..
మారుతి సుజుకి బ్రెజాను బుకింగ్ చేసుకునేందుకు జనాలు ఎగబడుతున్నారు. దాదాపు అన్నీ మెట్రో నగరాల్లో డిమాండ్ అధికంగా వస్తోంది. ఈ కారును పొందాలంటే ఏకంగా నెల నుంచి ఆరు నెలల సమయం వరకూ వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. బెంగళూరులో అయితే ఏకంగా దీని వెయిటింగ్ పిరియడ్ 6 నెలలుగా ఉంది. భారతీయ మార్కెట్ లో ఏ కారుకి కూడా ఇంతలా వెయిటింగ్ పిరియడ్ ఉండటం గమనార్హం.
1.5-లీటర్, డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT, సహజంగా ఆశించిన పెట్రోల్ ఇంజన్‌తో శక్తిని పొందుతుంది. ఇది పెట్రోల్ మోడ్‌లో 99.2 bhp వద్ద 136 NM టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ కారు 86.63 bhp వద్ద 121.5 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో ఈ కారు వస్తుంది.

అదిరే ఫీచర్స్..
ఈ కారులో అధ్బుతమైన ఫీచర్లను సంస్థ తీసుకువచ్చింది. 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్ ప్రో ప్లస్, OTA అప్‌డేట్‌తో పాటు అధునాతన ఫీచర్లను ఆ కారులో జోడించారు. భద్రత పరంగా కూడా నూతన ప్రమాణాలను జోడించడంతో దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది స్టార్ట్/స్టాప్ బటన్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ వ్యూ కెమెరాను కూడా పొందుతుంది.
ఈ CNG SUV మిడ్-స్పెక్ VXI వేరియంట్ ధర రూ. 10.49 లక్షలు కాగా, టాప్-స్పెక్ ZXI వేరియంట్ ధర రూ. 11.89 లక్షలుగా ఉంది. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ గా ఉన్నాయి. 2023 మారుతి సుజుకి బ్రెజా ఈ CNG SUVని సరసమైన ధరలో తీసుకువచ్చినట్లు చెప్పవచ్చు. దీంతో ఈ కారుపై భారీగా అంచనాలు పెరిగాయిని నిపుణులు భావిస్తున్నారు.

టాప్ లో ఉండే అవకాశం..
బ్రెజా CNG వేరియంట్ ప్రవేశపెట్టడంతో ఈ పోర్ట్‌ఫోలియోలో మారుతీ సుజుకి కంపెనీ మరింత బలోపేతం కానుంది. సబ్-4 మీటర్ల SUV విభాగంలో 'బ్రెజా' టాప్ గా ఉందని చెప్పవచ్చు. ఈ విభాగంలో ఏ ఇతర కంపెనీకి చెందిన SUVకి CNG ఎంపిక లేదు. ఇది బ్రెజా కొనుగోళ్లకు ఊతం ఇస్తుందని చెప్పవచ్చు. ఈ కారుకి ప్రత్యర్థి కార్లగా హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్ లు ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


Click it and Unblock the Notifications








