Maruti Suzuki పండుగ సీజన్‌లో మారుతి కార్లపై రూ.68 వేల వరకు తగ్గింపు..!

భారత్‌లో సాధారణంగా పండుగల సీజన్‌లో భారీగా వాహనాలు విక్రయాలు జరుగుతాయి. పండుగ సీజన్‌ డిమాండ్‌ను తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు అనేక ప్రముఖ కార్ల తయారీ సంస్థలు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తాయి. అందులో భాగంగా మారుతి సుజుకి కొన్ని కార్ల మోడళ్ల ధరలపై తగ్గింపును ప్రకటించింది (Maruti Suzuki Discounts ). ఈ జాబితాలో ఆల్టో k10, ఎస్‌ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్‌ఆర్‌, స్విఫ్ట్‌ వంటి కార్లున్నాయి.

మారుతి సుజుకి ఆల్టో k10 : పండుగ సందర్భంగా మారుతి సుజుకి k10 (Maruti Suzuki K10) హ్యాచ్‌బ్యాక్‌పై రూ.68,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్‌ CNG వేరియంట్‌కు మాత్రమే వర్తించనుంది. అయితే k10 ఇతర వేరియంట్లపై ఇప్పటికే రూ.53,000 వరకు తగ్గింపు ఆఫర్‌ అందుబాటులో ఉంది.

Maruti Suzuki discounts on CNG variants

మారుతి సుజుకి ఎస్‌ప్రెస్సో : పండుగ సీజన్ సందర్భంగా ఎస్‌ ప్రెస్సో కారుపై (Maruti Suzuki S Presso) మారుతి సుజుకి రూ.68,000 వరకు తగ్గింపును అందిస్తోంది. k10 కార్ల మాదిరిగా కేవలం CNG వేరియంట్‌పై ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. అయితే ఈ వేరియంట్‌పై ఇప్పటికే రూ.53000 వరకు తగ్గింపు ఆఫర్‌ ఉంది.

మారుతి సుజుకి సెలెరియో : మారుతి సుజుకి ఆల్టో K10, ఎస్‌ ప్రెస్సో మాదిరిగానే.. సెలెరియో CNG వేరియంట్‌పై మాత్రమే రూ.68,000 వరకు డిస్కౌంట్‌ ఉంది. అయితే మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio) సాధారణ వేరియంట్‌పై ఇప్పటికే రూ.51,000 వరకు తగ్గింపును సంస్థ అందిస్తోంది.

మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్‌ : మారుతి సుజుకికి చెందిన మోడళ్లలో దేశంలోనే ఎక్కువగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్‌లలో వ్యాగన్‌ఆర్‌ ఒకటి (Maruti Suzuki Wagon R). ఈ కారు CNG వేరియంట్‌పై రూ.58,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అయితే సాధారణ వేరియంట్లపై ఇప్పటికే రూ.46,000 వరకు తగ్గింపు ఆఫర్‌ అందుబాటులో ఉంది.

మారుతి సుజుకి స్విఫ్ట్‌ : ఫెస్టివల్‌ సీజన్‌ సందర్భంగా స్విఫ్ట్‌ కారు LXi వేరియంట్‌పై రూ.47,000 వరకు తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు ఇతర వేరియంట్లపై రూ.42,000 వరకు తగ్గింపును పొందుతారు. అయితే మారుతి సుజుకి స్విఫ్ట్‌ CNG వేరియంట్‌పై (maruti suzuki Swift) రూ.33,000 వరకు తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

పండుగ సీజన్‌ సందర్భంగా మారుతి సుజుకి వెల్లడించిన ఆఫర్లు కొత్త కస్టమర్లను ఆకట్టుకొనే అవకాశం ఉంది. దీంతోపాటు టైర్‌ 1, టైర్‌ 2 నగరాల్లో ప్రస్తుతం CNG వేరియంట్లపై ఇస్తున్న డిస్కౌంట్లతోపాటు అదనపు తగ్గింపును పొందవచ్చని తెలుస్తోంది. ఫలితంగా ఈ పండుగ మారుతి సుజుకి విక్రయాలను గణనీయంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Monday, October 9, 2023, 16:14 [IST]
English summary
Maruti suzuki cars gets rs68000 discounts ahead of festival season
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+