Maruti Suzuki 2023 సంవత్సరంలో ఏయే కార్లను విడుదల చేసిందో తెలుసా?

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) 2023లో అనేక కార్లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ జాబితాలో గ్రాండ్‌ విటారా సీఎన్‌జీ, బ్రెజ్జా సీఎన్‌జీ, ఫ్రాంక్స్‌, జిమ్నీ -5 డోర్‌, మారుతి సుజుకి ఇన్విక్టో వంటి కార్లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్ల ధర, స్పెసిఫికేషన్లు, ప్రత్యేకతలపై కథనం మీకోసం.

మారుతి సుజుకి గ్రాండ్‌ విటారా సీఎన్‌జీ : మారుతి సుజుకి గ్రాండ్‌ విటారా మోడల్‌ను 2022లో విడుదల చేసింది. అయితే ఆ సమయంలో సీఎన్‌జీ వేరియంట్‌ను విడుదల చేయలేదు. జనవరి 2023లో గ్రాండ్‌ విటారా సీఎన్‌జీ వేరియంట్‌ను విడుదల చేసింది. విడుదల సమయంలో ఈ వాహనం ధర రూ.12.85 లక్షలుగా (ఎక్స్‌షోరూం) గా ఉంది. ఈ సీఎన్‌జీ కారు 26.6 km/kg మైలేజీని అందిస్తుంది.

 maruti-grand-vitara

అనంతరం k సిరీస్‌ 1.5 లీటర్‌ డ్యూయల్‌ జెట్‌ డ్యూయల్‌ VVD పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది సీఎన్‌జీ, పెట్రోల్ రెండింటిలోనూ పనిచేస్తుంది. పెట్రోల్‌ వెర్షన్‌లో 74kW శక్తిని విడుదల చేస్తుంది. ఇది 100.61 bhp శక్తికి సమానం. మరియు 136Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ వెర్షన్‌లో 87.83ps శక్తి, 121.5Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మారుతి సుజుకి బ్రెజ్జా CNG : ఈ కారు భారత్‌లో 2023 మార్చిలో విడుదల అయింది. బ్రెజ్జా సీఎన్‌జీ ధర రూ.9.14 లక్షలు (ఎక్స్‌షోరూం) గా ఉంది. ఈ కారు 1462 4 సిలిండర్‌ ఇన్‌లైన్‌ 4 వాల్వ్‌ DOHC ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్‌ 87bhp, 121.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

maruti-suzuki-brezza-cng

మారుతి సుజుకి ఫ్రాంక్స్ : ఈ సంవత్సరం నిర్వహించిన ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు విడుదల అయింది. ఏప్రిల్‌ నుంచి విక్రయాలు ప్రారంభం అయ్యాయి. విడుదల సమయంలో ఈ కారు ప్రారంభ ధర రూ.7.46 లక్షలు (ఎక్స్‌షోరూం) ఉంది.

మారుతి సుజుకి జిమ్నీ 5- డోర్‌ : మహీంద్రా థార్‌ ఆఫ్‌ రోడర్‌కు పోటీగా మారుతి సుజుకి జిమ్నీ ఈ కారును ప్రారంభించింది. ఈ కారు ఆటో ఎక్స్‌పో 2023లో విడుదల చేశారు. జూన్‌లో విక్రయాలను ప్రారంభం అయ్యాయి. దీని ప్రారంభ రూ.12.74 లక్షలు ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.

 maruti-suzuki-jimny

మారుతి సుజుకి ఇన్విక్టో : టయోటా ఇన్నోవా వాహనానికి రీ బ్యాడ్జ్‌ వెర్షన్‌గా మారుతి సుజుకి ఇన్విక్టో కారు విడుదల అయింది. ఈ మోడల్‌ జూలైలో భారత్‌ మార్కెట్‌లో విడుదల అయింది. ఈ వాహనం ధర రూ.24.79 లక్షలు (ఎక్స్‌షోరూం) ఉండేది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Friday, December 22, 2023, 18:29 [IST]
English summary
Maruti suzuki cars launched in 2023 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+