మారుతి సుజుకి సెలెరియో కార్లపై రూ. 59,000 డిస్కౌంట్‌.. దసరా ధమాకా సేల్‌లో వెంటనే కొనేయండి.!!

మారుతి సుజుకి సెలెరియో కార్లను దసరా, దీపావళి పండుగ సందర్భంగా భారీ డిస్కౌంట్ ధరలో సొంతం చేసుకోవచ్చు. ఈ మేరకు సంస్థ పూర్తి వివరాలను వెల్లడించింది. ఇది కేవలం పరిమిత కాల ఆఫర్‌ మాత్రమే.

పండుగ సీజన్‌ వచ్చిందంటే చాలు వాహనాల సంస్థలు భారీ డిస్కౌంట్లు, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్లను అందిస్తాయి. ఈ క్వార్టర్‌లో కార్లు, బైక్స్‌ ఎక్కువగా కొనుగోళ్లు జరుగుతాయి. చాలా కంపెనీలకు చెందిన కార్లు ఈ ఏడాది అక్టోబర్‌లో భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి. నగదు డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్లు మరియు కార్పొరేట్ డిస్కౌంట్ల రూపంలో తక్కువ ధరలో కార్లను ఇంటికి తీసుకువెళ్లవచ్చు.

Offers-On-Maruti-Celerio

మారుతి సుజుకి సెలెరియో కారు ఊహించని ధరలో అందుబాటులో ఉంది. నెక్సా మరియు ఎరీనా చైన్‌ డీలర్‌షిప్‌లలో తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు. మారుతి సుజుకి సెలెరియో యొక్క వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ మరియు జెడ్ఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్లపై రూ.35,000 నగదు తగ్గింపు ఉంది. అంతే కాకుండా రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ .4,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఏఎంటీ వేరియంట్లపై రూ.30,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.4,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. మరోవైపు, సీఎన్‌జీ వేరియంట్లపై డిస్కౌంట్లు రూ. 30,000 నగదు తగ్గింపు మరియు రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మాత్రమే లభించనుంది.

Offers-On-Maruti-Celerio

సీఎన్‌జీ వెర్షన్‌లపై కచ్చితమైన డిస్కౌంట్‌, ఎక్సేంజ్‌ బోనస్‌లు ఉన్నాయి. వీటిలో ఎలాంటి మార్పు ఉండదు. అయితే డీలర్‌షిప్‌ల వద్ద మాత్రం ధరల్లో స్వల్ప మార్పులు లేదా కూపన్‌ల రూపంలో కొంతమేర తగ్గింపు లభించే అవకాశం ఉంది. ఇది కస్టమర్లకు కాస్త ఊరటను ఇచ్చే అంశం. ఈ వెర్షన్ కార్లపై కూడా భారీ తగ్గింపును పొందే అవకాశం ఉంది.

మారుతి సెలెరియో వేరియంట్స్‌: సెలెరియో మోడల్‌ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ మరియు జెడ్ఎక్స్ఐ +. ఈ కార్లు మొత్తం ఏడు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1.0-లీటర్, 3 సిలిండర్, న్యాచ్‌రల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్ ఇంజిన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్‌తో జతచేయబడింది.

Offers-On-Maruti-Celerio

ఇక పెట్రోల్ వెర్షన్ 66bhp వద్ద 89nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. సీఎన్‌జీ వెర్షన్ 56bhp వద్ద 82Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ధరలో మారుతి సుజుకి సెలెరియో మంచి హ్యాచ్‌బ్యాక్‌గా వర్ణించవచ్చు. ఇది మంచి పనితీరును కలిగి ఉంటుంది. ఇక ఈ కారు మైలేజ్‌లోనూ మేటి. ఈ కారు లీటరుకు సుమారు 31.79 కి.మీ మైలేజ్‌ ఇస్తుంది. ఆటోమేటిక్‌ 26.68kmpl మైలేజ్‌ ఇస్తుంది.

ఇందులో 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ కన్సోల్, ఇరువైపులా నిలువుగా ఉండే AC వెంట్‌లు ఉంటాయి. ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు స్టీరింగ్ వీల్ వంటి ఇతర అంశాలు వ్యాగన్ Rని పోలినట్లు ఉంటాయి. ఇంటీరియర్‌ ఫీచర్లు రెండు కార్లకు ఒకేలా ఉంటాయి. మంచి ఫీచర్లు బెస్ట్‌ మైలేజీ ఆప్షన్ వారికి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

ఇక మారుతి సెలెరియో టాటా టియాగో, రెనాల్ట్ క్విడ్ మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ వంటి కార్లతో ప్రత్యర్థిగా ఉంది. ఇంచుమించు ఇదే ధరలో లభిస్తున్న కార్లలో ది బెస్ట్‌ కారుగా సెలెరియోను భావించవచ్చు. కస్టమర్ల అభిరుచికి తగినట్లు పూర్తి వివరాలు డీలర్‌షిప్‌లలో అడిగి తెలుసుకోవచ్చు. పండుగ సీజన్లతో పాటు సాధారణ సమయాల్లోనూ మారుతి కార్లపై నిత్యం ఆఫర్లు లభిస్తూనే ఉంటాయని గమనించాలి.

More from DriveSpark

Article Published On: Friday, October 20, 2023, 14:50 [IST]
English summary
Maruti suzuki celerio cars available on huge discount
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+