మారుతి సుజుకి ఖాతాలో మరో రికార్డ్.. ఒక్క రోజే 222 Alto K10 కార్ల డెలివరీలు.!!
పండుగ సీజన్‌లో మారుతి సుజుకీ రికార్డు సృష్టించింది. ఇవ్వాళ ఒక్కరోజే ఏకంగా 222 సరికొత్త మారుతి ఆల్టో K10 కార్లను డెలివరీ చేసింది. కశ్మీర్‌లో 'Alto K10 Grand Delivery Fest' దీనికి వేదికైంది.
దేశలంనే అతి పెద్ద కార్ల తయారీ కంపెనీగా మారుతీ సుజుకీ నెం.1 స్థానంలోనే కొనసాగుతోంది. ఇప్పటి వరకూ అనేక ప్రముఖ మోడళ్లతో అగ్రస్థానంలో నిలుస్తోంది. కాగా మారుతి బ్రాండ్ కార్లలో ఆల్టో మోడల్ కారు త్వరగా మార్కెట్లో కస్టమర్ల దృష్టిని ఆకర్షించింది. దేశీయ ఆటో మొబైల్ రంగంలో ఆల్టో మోడల్ కారుకు ప్రత్యేక స్థానం ఉందనడంలో ఆశ్చర్యం లేదు.

మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ధరలో, అధిక మైలేజ్‌తో ఆల్టో మోడల్ కార్లు ప్రసిద్ధి చెందాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన 'ఆల్టో K10 గ్రాండ్ డెలివరీ ఫెస్ట్' సందర్భంగా ఏకకాలంలో 222 కస్టమర్లకు సరికొత్త ఆల్టో K10 హ్యాచ్‌బ్యాక్‌లను మారుతి సుజుకి డెలివరీ చేసి రికార్డు సృష్టించింది.
కశ్మీర్‌లో మారుతి సుజుకి ఉనికిని, విజయాన్ని డీలర్ భాగస్వాములు హైలాండ్ ఆటో, జమ్‌కాష్ వెహికల్స్, కాశ్మీర్ ప్రైవేట్ లిమిటెడ్, పీక్స్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ బలోపేతం చేశాయి. జమ్మూ మరియు కశ్మీర్‌లో మారుతి సుజుకికి సంబంధించి 60 విక్రయ కేంద్రాలు ఉన్నాయి. కాగా ఆల్టో కె10 గతేడాది ఆగష్టులో మార్కెట్‌లోకి విడుదలైంది.

కాగా మారుతి సుజుకి బ్రాండ్‌పై హ్యాచ్‌బ్యాక్‌లు, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు, SUVలు, MUVలు వంటి విస్తృత శ్రేణి వాహనాలు ఎన్నో ఉన్నాయి. జమ్మూ మరియు కాశ్మీర్‌లో 60 సేల్స్ అవుట్‌లెట్‌లు ఉండగా.. వీటికి 54 వర్క్‌షాప్‌లు, 27 బాడీ షాపులు ఉన్నాయని సంస్థ తెలిపింది. ఇవన్నీ మారుతి సుజుకి కస్టమర్లకు సేవలందించనున్నాయి.
ఇంజిన్ విషయానికొస్తే మారుతి సుజుకి ఆల్టో K10 1.0-లీటర్ K10C మూడు-సిలిండర్ Dual Jet Dual VVT పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఐడిల్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ మరో ప్రత్యేకత. ఇంజిన్ 67 bhp శక్తి వద్ద 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. 24.90 kmpl మైలేజీని అందిస్తుంది.

మారుతి ఆల్టో K10 డిజైన్‌ను పరిశీలించినట్లయితే ఇది ఫ్రంట్ ఫాసియా బ్లాక్ కలర్‌లో తేనెగూడు మెష్ నమూనాతో రీడిజైన్ చేసిన సింగిల్-పీస్ ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంటుంది. C-షేప్‌తో బంపర్ ఉంటుంది. లో సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్, స్వెప్‌బ్యాక్ హెడ్‌ల్యాంప్‌లు ఆకర్షణీయంగా ఉంటాయి.
కొత్త మారుతి ఆల్టో K10 హ్యాచ్‌బ్యాక్ కొత్త ఫ్రంట్ విండ్‌షీల్డ్‌ను కలిగి ఉంది. ఇంకా కొత్త 13-అంగుళాల స్టీల్ వీల్స్‌తో పాటు, స్క్వేర్ టెయిల్ ల్యాంప్స్, బ్లాక్ ఫినిష్డ్ ORVMలు, బాడీ-కలర్ డోర్ హ్యాండిల్స్, కొత్త రియర్ బంపర్, ట్వీక్డ్ టెయిల్‌గేట్ లాంటి ఆకర్షణీయమైన డిజైన్‌తో ఆల్టో K10 కస్టమర్లను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇక క్యాబిన్ విషయానికొస్తే ఇంటీరియర్‌ను మరింత మోడ్రన్ ఫీచర్లతో పాటు ఆధునిక టెక్నాలజీని కలిగి ఉంది.
ఆల్టో 800తో పోల్చినట్లయితే ఆల్టో K10 క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది. ఈ కారు పొడవు 3,530 mm, వెడల్పు 1,490 mm మరియు ఎత్తు 1,520 mm. కారు వీల్‌బేస్ పొడవు 2,380 మిమీ కాగా, బరువు 1,150 కిలోలు. ఇంకా కొత్త హ్యాచ్‌బ్యాక్ 160 mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది. లగేజ్ స్టోరేజ్ కోసం 177-లీటర్ కెపాసిటీతో అతి పెద్ద బూట్ స్పేస్‌ను అందించడం విశేషం.


Click it and Unblock the Notifications








