ఈ మారుతి కార్లపై దీపావళి ధమాకా ఆఫర్లు.. రూ. లక్ష వరకు భారీ తగ్గింపు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ తన నెక్సా షోరూమ్‌లలో విక్రయించే కార్లపై దీపావళి ధమాకా ఆఫర్లను ప్రకటించింది. తన డీలర్‌షిప్‌లలో విక్రయించే బాలెనో, ఇగ్నిస్, జిమ్నీ ఇంకా సియాజ్ కార్లపై డిస్కౌంట్ వివరాలను ఈ మేరకు నెక్సా వెల్లడించింది. ఏయే కార్లపై ఎంత డిస్కౌంట్ అందిస్తుందో ఈ కథనంలో అందిస్తున్నాం.
Maruti Suzuki Jimny: దేశీయ మార్కెట్లో వాహనప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న మారుతీ ఇటీవలే కొత్త జిమ్నీని విడుదల చేసింది. ఇది పెట్రోల్‌తో కూడిన ఫీచర్-రిచ్ ఆఫ్-రోడ్ SUVగా అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇందులో జీటా వేరియంట్‌పై రూ.లక్ష వరకు భారీ తగ్గింపును పొందవచ్చు.

విక్రయ ధరపై నేరుగా రూ.50,000 తగ్గింపును అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ బోనస్‌గా అదనంగా రూ.50,000 వర్తించనున్నట్లు సమాచారం. అదే సమయంలో, ఆల్ఫా వేరియంట్‌కు రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌గా ప్రకటించింది. Zeta వేరియంట్‌లోని ఆటోమేటిక్ మరియు మాన్యువల్ గేర్ బాక్స్ వేరియంట్లపై ఈ ఆఫర్లు వర్తిస్తాయి.
Maruti Ignis: మారుతీ తన ఇగ్నిస్ కారుపై రూ.70,000 వరకు భారీ తగ్గింపులను ప్రకటించింది. ఇందులో రూ. 35,000 నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌గా ప్రకటించింది. ఇంకా రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు, నిర్దిష్ట కార్ల మార్పిడిపై అదనంగా రూ. 10,000 తగ్గింపు పొందవచ్చు. మొత్తంగా మారుతి ఇగ్నిస్ కారును రూ. 70,000 వరకు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.

Maruti Suzuki Baleno: దీపావళి సందర్భంగా మారుతి సుజుకి తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనోపై కూడా తగ్గింపులను ప్రకటించడం విశేషం. ఈ ఆఫర్ ప్రకారం బాలెనోపై రూ.40,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే ఇందులో రూ. 20,000 నేరుగా నగదు తగ్గింపు అని తెలిపింది,
ఎక్స్‌ఛేంజ్ బోనస్ కింద రూ. 10,000 ఇంకా ఇతర రకాల కార్ల మార్పిడిపై బోనస్‌గా అదనంగా రూ. 10,000 డిస్కౌంట్ అందించనుంది. కాగా ఇందులో CNG వెర్షన్ కారుకు రూ.10,000 నగదు తగ్గింపుతో పాటు రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌గా ఇవ్వనుంది.

Maruti Suzuki Ciaz: మారుతీ తన సియాజ్ కారుపై రూ.38,000 వరకు తగ్గింపులను దీపావళి ధమాకా ఆఫర్‌గా ప్రకటించింది. ఇందులో కారు ధరపై రూ.10,000 తగ్గింపు పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ బోనస్‌గా రూ.25,000 మరియు కార్పొరేట్ డిస్కౌంట్‌గా రూ. 3000 ఇవ్వనున్నట్లు సంస్థ తెలిపింది.
కాగా మారుతి ఇంకా తన నెక్సా బ్రాండ్ క్రింద కొన్ని కార్లపై డిస్కౌంట్లను ప్రకటించలేదు. అయితే ఆ కార్లన్నీ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు కాగా.. మారుతి ఇంకా ఫ్రాంక్స్, ఇన్విక్టో, XL6 మరియు గ్రాండ్ విటారాపై దీపావళి సందర్భంగా డిస్కౌంట్లను ప్రకటించలేదు.

అయితే ఈ డిస్కౌంట్లన్నీ ఆ మోడల్ మరియు వేరియంట్ లభ్యతకు లోబడి ఉంటాయని గుర్తించాలని సంస్థ తెలిపింది. పూర్తి సమాచారం కోసం మీ సమీప డీలర్‌ను సంప్రదించవచ్చు. కాగా నాన్-స్టాక్ వాహనాలకు ఎటువంటి తగ్గింపులు అందుబాటులో లేవని వెల్లడించింది. దేశవ్యాప్తంగా మారుతి నెక్సా డీలర్‌షిప్‌లలో దీపావళికి ఈ తగ్గింపును మారుతి ప్రకటించడం కస్టమర్లకు తీపి కబురు లాంటింది.
మీరు ఈ దీపావళిని సరికొత్త మారుతీ కారుతో జరుపుకోవాలని అనుకుంటే.. ఈ ఆఫర్లను ఇప్పుడే వినియోగించుకోండి. కాగా ఈ తగ్గింపులన్నీ మారుతి నేరుగా తన కస్టమర్లకు అందిస్తోంది. మీ ప్రాంతాన్ని బట్టి ఈ కార్లపై ఎంత తగ్గింపు, డిస్కౌంట్ లభిస్తుందనే మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని మారుతి నెక్సా షోరూమ్‌ని సందర్శించండి.

దీపావళి సందర్భంగా ప్రముఖ కార్ల కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లను, డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. తమ కార్ల సేల్స్‌ను మరింత పెంచుకోవడానికి పండుగల సీజన్ వారికి మంచి అవకాశం. అంతే కాకుండా స్పెషల్ ఆఫర్‌లో బ్రాండ్ కార్లను సొంతం చేసుకోవడానికి కస్టమర్లకు కూడా ఇది మంచి టైమ్.. ఈ డిస్కౌంట్‌ను కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications








