దుమ్మురేపిన మారుతి ఎకో వ్యాన్.. 1 మిలియన్ కి పైగా అమ్మకాలతో రికార్డ్

మారుతి సుజుకి ఎకో వ్యాన్ 10 లక్షల సేల్స్ ను అధిగమించి కొత్త రికార్డును నమోదు చేసింది. ఐదు, ఏడు సీటింగ్ కెపాసిటీతో పాటు కార్గో, టూర్, అంబులెన్స్ మొదలగు 13 వేరియంట్లలో ఈ వ్యాన్ అందుబాటులో ఉంది. తాజాగావినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎకో వ్యాన్‌ ను ఆధునీకరించినట్లు మారుతి సుజుకి ఇండియా తెలిపింది.

వ్యాన్ ల అమ్మకాల్లో సరికొత్త రికార్డును మారుతి సాధించింది. 2001లో ఈ టైప్ వాహనాలను మారుతి సుజుకి ఇండియా ప్రారంబించింది. ఎకోను 2010లో మారుతి ప్రవేశ పెట్టింది. అప్పటినుంచి దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వ్యాన్ గా గుర్తింపు పొందింది. సేల్స్ లో ఇదే జోరును ఈ కారు కొనసాగించింది. ఈ కారు ఇంతలా పాపులర్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి.

మారుతి ఎకో

స్మార్ట్ ఫీచర్స్..

అందుబాటు ధరలో కమర్షియల్, సొంత ఉపయోగాలకు వాడుకునేలా ఈ వాహనాన్ని రూపొందించడంతో ఈ వ్యాన్ కు కలిసి వచ్చింది. తాజాగా అప్ డెటెడ్ ఎకో వ్యాన్‌ ను కొన్ని స్మార్ట్ ఫీచర్లను జతచేసి తీసుకు వచ్చింది. కొత్త మోడల్‌ లో ఇంజన్, మెరుగైన ఇంటీరియర్స్ ఇంకా మెరుగైన సేఫ్టీ ఫీచర్లను ఆధునీకరించి మారుతి ప్రవేశ పెట్టింది.

మారుతి సుజుకి ఎకో 1.2L K-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్‌ తో 6,000 rpm వద్ద 80.76 PS శక్తిని, 3,000 rpm వద్ద 104.4 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త పవర్‌ ట్రెయిన్ పాత మోడల్ కంటే 10% ఎక్కువ శక్తిని అందిస్తుందని సంస్థ పేర్కొంది. అలానే CNG వెర్షన్ లో, 6000 rpm వద్ద 71.65 PS శక్తిని, 3,000 rpm వద్ద 95 Nm గరిష్ట టార్క్‌ ను ఈ వ్యాన్ అందించనుంది.

మారుతి ఎకో వ్యాన్

కారు మాదిరి డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్..

కొత్తగా అప్ డేట్ చేసిన వెహికిల్ లో స్టీరింగ్ స్టైల్ ను మార్చింది. అలానే డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ను ప్రవేశ పెట్టింది. మారుతి సుజుకి ఆల్టో, సెలెరియో, ఎస్ ప్రెస్సో కార్లకు వచ్చే డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఈ వ్యాన్ కు అమర్చింది. పూర్తిగా కారులో ఆపరేట్ చేస్తున్న అనుభూతిని కొత్త మోడల్ లో పొందవచ్చు.

ఈ వ్యాన్ లో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. టూర్ వేరియంట్ వెహికిల్ పెట్రోల్‌ ఇంజన్ లో 20.20kmpl మైలేజ్ ను.. అలానే CNG వెర్షన్‌ లో 27.05km/kg మైలేజ్ ను ఈ వ్యాన్ అందిస్తుంది. ప్యాసింజర్ వెర్షన్ పెట్రోల్ పై 19.71kmpl, CNG వెర్షన్ 26.78km/kg మైలేజ్ ని పొందవచ్చు. ఇలాంటి సూపర్ అట్రాక్టివ్ మైలేజ్ ఆఫర్లతో ఈ వ్యాన్ దూసుకెళ్తుంది. తాజాగా పెంచిన మైలేజ్ ని చూసుకుంటే ఇంకా సేల్స్ పెరిగే అవకాశం ఉంది.

మారుతి వ్యాన్

ఎయిర్ బ్యాగ్స్..

3675 మిల్లీ మీటర్ల పొడవు, 1475మిల్లీ మీటర్ల వెడల్పు, 1825మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. ఇక వ్యాన్ భద్రత సౌకర్యాల విషయానికి వస్తే చైల్డ్ సేఫ్టీ లాక్, డిస్క్ బ్రేక్ సౌకర్యాన్ని కల్పించింది. ప్యాసింజర్ వైపు ఎయిర్‌బ్యాగ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, బ్యాక్ పార్కింగ్ సెన్సార్ వంటి స్టాండర్డ్ ఫీచర్లను ఈ వ్యానులో జత చేశారు.

ఈ వ్యాన్ లో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండటం వల్ల ఆరు లేదా ఏడుగురు సులభంగా కూర్చోవచ్చు. 5 లేదా అంతకంటే తక్కువ మందితో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఎక్కువ స్థలం ఇందులో ఉంటుంది. ఇది చాలా మంచి సదుపాయంగా చెప్పవచ్చు. అంబులెన్స్ సేవల్లోనూ ఈ వాహనాన్ని వాడుకోవచ్చు. ఇలా అన్ని విధాలా ఈ వ్యాన్ ఉపయోగ పడుతుంది.

More from DriveSpark

Article Published On: Monday, February 27, 2023, 21:59 [IST]
English summary
Maruti suzuki eeco sales cross 10lakh units
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+