జులై 5న లాంచ్‌ కానున్న మారుతి సుజుకి Engage.. ఆ MPV తరహాలోనే..!

టయోటా ఇన్నోవా హైక్రాస్‌ భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లోకి 2022 డిసెంబర్‌లో విడుదలైంది. ఆ సమయంలోనే మారుతి సుజుకి కూడా పోటీగా కారు విడుదల చేయనుందనే వార్తలు వచ్చాయి. దీనిపై మారుతి నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. Maruti Suzuki Engage ప్రీమియం MPVను జులై 5న విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీనిపై ఓ టీజర్‌ను విడుదల చేసింది.

ఎంపీవీ వాహనాల విభాగంలో అగ్రశ్రేణిగా ఉండాలనే లక్ష్యంతో మారుతి సుజుకి.. పెట్రోల్‌, హైబ్రిడ్‌ వేరియంట్లలో ఈ కారును లాంచ్ చేస్తుంది. టయోటా హైక్రాస్‌తో పోలిస్తే మారుతి సుజుకి ఎంగేజ్‌లో ఫ్రంట్‌, రేర్‌ డిజైన్‌ కొన్ని గణనీయమైన మార్పులు చేసే అవకాశం ఉంది.

Maruti suzuki Engage

మారుతి సుజుకి ఎంగేజ్‌ కొత్త ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌గా లాంచ్‌ కానుంది. ప్రస్తుతం ఉన్న కార్లలో ఎంగేజ్‌ అత్యంత ఖరీదైన కారుగా విడుదల కానున్నట్లు సమాచారం. టయోటా ఇన్నోవా హైక్రాస్‌లో ఉన్నట్లుగానే మారుతి సుజుకి ఎంగేజ్‌ కూడా అదే తరహా పవర్‌ట్రైన్‌ను కలిగి ఉంటుంది.

టయోటా హైక్రాస్‌ 2 లీటర్‌ నేచురల్‌ ఆస్ఫిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంది. మరియు 174bhp మరియు 205Nm టార్క్‌ను ఉత్పిత్తి చేయనుంది. మరియు సీవీటీ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది.టాయోటా హైక్రాస్‌ ఎంపీవీ 2 లీటర్‌ ఇంజిన్‌ మరియు ఎలక్ట్రిక్‌ మోటర్‌తో 186bhp శక్తి మరియు 209Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. e-CVT ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది. మరియు లీటర్‌కు 21 కి.మీ మైలేజ్‌ ఇస్తుంది.

అలాగే మారుతి సుజుకి ఎంగేజ్‌ ఎంపీవీ 10 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ యూనిట్‌, డ్యూయల్‌ జోన్‌ క్లైమెట్‌ కంట్రోల్‌, డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే, పనోరమిక్‌ సన్‌రూఫ్‌, ఓట్టోమన్‌ పనితీరుతో వెంటిలేటెడ్ ముందు, వెనుక సీట్లు సహా మరెన్నో కీలక ఫీచర్లు కలిగి ఉండే అవకాశం ఉంది.

మారుతి సుజుకి ఎంగేజ్‌ MPV.. టయోటా హైక్రాస్‌ తరహా భద్రతా ఫీచర్లు కలిగి ఉండే అవకాశం ఉంది. 6 ఎయిర్‌ బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ (ESC), హిల్‌ స్టార్ట్, డిసెంట్‌ అసిస్ట్‌, అడ్వాన్సడ్‌ డ్రైవర్‌ అసిస్టెంట్ సిస్టమ్‌ (ADAS) లాంటి ఫీచర్లు కలిగి ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుతం మారుతి సుజుకి మూడు వరుసల సిటింగ్‌ ఉన్న కార్లు Ertiga మరియు XL6 కార్లు అధిక సంఖ్యలో విక్రయాల జరుగుతున్నాయి. ఎంగేజ్‌ మాత్రం MPV సెగ్మెంట్‌ను టార్గెట్‌ చేయనుంది. మారుతి సుజుకి సాధారణంగా చిన్న వాహనాల పరంగా మంచి డిమాండ్‌ కలిగి ఉంటుంది. ఎంగేజ్‌ ఎంపీవీ మాత్రం కొత్త సెగ్మెంట్‌లో అవకాశాల సృష్టించనుందని సంస్థ భావిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, June 9, 2023, 14:39 [IST]
English summary
Maruti suzuki engage mpv set to launch on july 5
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+