'2023 ఆటో ఎక్స్‌పో'లో eVX EV కాన్సెప్ట్ ఆవిష్కరించిన మారుతి సుజుకి.. వివరాలు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్' ఈ రోజు ప్రారంభమైన '2023 ఆటో ఎక్స్‌పో' లో తన కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ SUV eVX నిప్రదర్శించింది. కంపెనీ ప్రదర్శించిన ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.
మారుతి సుజుకి ఆటో ఎక్స్‌పో 2023 లో ఆవిష్కరించబడిన కొత్త eVX కాన్సెప్ట్ అద్భుతమైన డిజైన్ కలిగి చూడగానే ఆక్షరించే విధంగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ 2025 నాటికి భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ 2025 లో విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ వెహికల్ బహుశా ఇదే కావచ్చు. దీన్ని బట్టి చూస్తే కంపెనీ ఎలక్ట్రిక్ వాహన విభాగాన్ని విస్తరించడానికి ఎలాంటి సన్నాహాలు చేస్తుందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

మారుతి సుజుకి గతంలో వెల్లడించినట్లుగానే రాబోయే రోజులలో కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల మీద పనిచేస్తుంది, మరియు మార్కెట్లో ఎక్కువ భాగం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండే అవకాశం ఉంటుంది. మారుతి సుజుకి ఈ రోజు ఆవిష్కరించిన కొత్త eVX కాన్సెప్ట్ మరో రెండు సంవత్సరాల్లో మార్కెట్లో అడుగుపెట్టనుంది. మారుతి సుజుకి eVX అనేది ఒక ఆల్-ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ SUV కావున ఇది ఒక ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంటుంది.
మారుతి సుజుకి ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన కొత్త eVX డిజైన్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. అయితే గ్రిల్ భాగం మొత్తం క్లోజ్ చేయబడి దాని మధ్యలో బ్రాండ్ లోగో ఉంటుంది. కింది భాగంలో ఫాగ్ ల్యాంప్స్ మరియు పెద్ద సిల్వర్ బాష్ ప్లేట్ వంటివి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో ఆకర్షణీయమైన వీల్ ఆర్చ్‌లు భారీ ప్లాస్టిక్ క్లాడింగ్‌ను కలిగి ఉంటాయి.

మారుతి సుజుకి eVX SUV కాన్సెప్ట్ రియర్ ప్రొఫైల్ కూడా కొత్తగా మరియు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉంటుంది, అంతే కాకుండా వెనుక వెడల్పు అంతటా విస్తరించి ఉండే లైట్‌బార్ చూడవచ్చు. ఇది రియర్ ప్రొఫైల్ ని మరింత ఆకర్షణీయంగా కనిపించే విధంగా చేయడంలో సహాయపడుతుంది. కింది భాగంలో చంకీ బాష్ ప్లేట్ కూడా గమనించవచ్చు. మొత్తం మీద మారుతి సుజుకి eVX మంచి లేటెస్ట్ డిజైన్ పొందుతుంది.
మారుతి సుజుకి eVX ఎలక్ట్రిక్ SUV లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇందులోని 60 kWh బ్యాటరీ ప్యాక్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 550 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే ఇది మార్కెట్లో లాంచ్ అయినా తరువాత ఖచ్చితమైన పరిధి తెలుస్తుంది. అయితే తప్పకుండా ఈ ఎలక్ట్రిక్ SUV 500 కిమీ పరిధిని అందిస్తుందని ఆశిస్తున్నాము. కావున ఇది తప్పకుండా ఎక్కువ పరిధిని కోరుకునే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది.

మారుతి సుజుకి eVX కాన్సెప్ట్ యొక్క పరిమాణం విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ SUV పొడవు 4,300 మిమీ, వెడల్పు 1,800 మిమీ మరియు ఎత్తు 1,600 మిమీ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ప్రస్తుతానికి కంపెనీ ఈ ఎలక్ట్రిక్ SUV యొక్క ఇంటీరియర్ ఫీచర్స్ మరియు ఇంటీరియర్ డిజైన్ వంటి వివరాలను వెల్లడించలేదు. కావున దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడవుతాయి.
2023 ఆటో ఎక్స్‌పోలో అద్భుతమైన మరియు అధునాతన మోడల్స్ ఆవిష్కరించడతాయి మరియు విడుదలవుతాయి. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడే/విడుదలయ్యే వాహనాలను గురించి అప్డేటెడ్ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి. అదే విధంగా కొత్త వాహనాలను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా అధికారిక సోషల్ మీడియా పేజీలను అనుసరిస్తూ మీకు కావాల్సిన సమాచారం పొందండి.


Click it and Unblock the Notifications








