Maruti Suzuki eVX మార్కెట్‌లోకి రానున్న మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు.. విడుదల ఎప్పుడో తెలుసా?
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను పలు సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఈ విభాగంలో తమ సత్తాను చాటుతున్నాయి. గత కొన్ని నెలలుగా భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ప్రపంచంలోని లభించే అంతర్జాతీయ లగ్జరీ కార్ బ్రాండ్లు కూడా భారత దేశంలో కూడా తమ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తున్నాయి.
దేశంలో చాలా సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్నప్పటికీ టాటా మోటార్స్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ సంస్థ నుంచి భారత మార్కెట్లో టాటా నెక్సాన్, టిగోర్ ఈవీ మరియు టియాగో ఈవీలను విక్రయిస్తుంది. వీటిలో టాటా నెక్సాన్ అత్యధిక ప్రాధాన్యత కల్గిన కారుగా గుర్తింపు పొందింది.

దేశంలో కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి తయారీ సంస్థ తొలిస్థానంలో ఉంది. తాజాగా ఈ సంస్థ కూడా కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. 2023 ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి eVX కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. అప్పటి నుంచి దీనిపై ఆసక్తి పెరుగుతోంది. ఈ కారుకి సంబంధించి వివరాలు మీకోసం..
ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారుని అక్టోబర్ 2024లో అధికారికంగా మార్కెట్ లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. అప్పుడే దీని ధరను ప్రకటించనుంది. ప్రస్తుతం ఈ ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గుజరాత్ లోని సుజుకి ప్లాంట్ లో తయారు చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఆల్‌న్యూ ఎలక్ట్రిక్ కారు టయోటాతో అభివృద్ధి చేయబడుతోంది.
ఇక ఈ ఎస్‌యూవీ 2023 ఆటో ఎక్స్‌పోలో చూపించబడిన విధంగా 2,700 మిమీ వీల్ బేస్ ను కలిగి ఉంది. మారుతి ఈవీ పొడవు 4,300 మిమీ, వెడల్పు 1,800 మిమీ మరియు ఎత్తు 1,600 మిమీ ఉంటుంది. ఎంట్రీ-లెవల్ వేరియంట్‌లో 48kWh బ్యాటరీతో చిన్న బ్యాటరీ అమర్చబడి ఉంటుందని భావిస్తున్నారు. ఇది 400km రేంజ్ అందించే అవకాశం ఉంది.
ఇక టాప్‌ఎండ్ కారులో ఇది 60 కిలోవాట్ల లిథియం-అయాన్ పవర్‌ఫుల్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. ఇది 550 కిలోమీటర్ల పరిధిని అందించనుంది. 2డబ్ల్యూడీ (టూ వీల్ డ్రైవ్), ఏడబ్ల్యూడీ (ఆల్ వీల్ డ్రైవ్) ఆప్షన్లతో ఈ కారు వచ్చే అవకాశం ఉంది. సంవత్సరానికి 1.25 లక్షల వాహనాలను తయారు చేయాలనే లక్ష్యంతో ఉంది.
భారతదేశంలో మూడు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసిన తరువాత, టాటా మోటార్స్ మరో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ మొత్తానికి ఈ కారు అందుబాటోలోకి రావాలంటే 2025 ప్రారంభం వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈ సరికొత్త ఈవీఎక్స్ కారు హ్యుందాయ్ క్రెటా EVకి పోటీగా ఉండే అవకాశం ఉంది. మార్కెట్ లో టాటా పోటీని నిలదొక్కుకోవాలంటే మారుతి అంతకు మించి మార్క్‌ని కనబర్చాల్సి ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








