Maruti Suzuki Fronx మారుతి సుజుకి ఫ్రాంక్స్ ధర వెల్లడి.. తక్కువ ధరకే మైలేజ్, అధిరిపోయే ఫీచర్స్
దేశంలో మారుతి సుజుకి కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ సంస్థ నుంచి విడుదల అయ్యే కొత్తకారులు ఎప్పుడైనా సరే జనాలు హార్ట్ కేకుల్లా బుక్ చేసుకుంటారు. తక్కువ ధరలో వీటిని కస్టమర్లకు అందించడం వల్ల మారుతి సుజుకి బాగా ప్రసిద్ధి చెందిందిగా చెప్పవచ్చు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరల్ని సంస్థ నిర్ణయిస్తుంది.
తాజాగా మారుతి సుజుకి నుంచి వస్తున్న ఫ్రాన్స్ ధరను మారుతి వెల్లడించింది. బాలెనో ఆధారంగా రూపొందించిన ఫ్రాంక్స్ కూపే-ఎస్‌యూవీని దేశంలో విడుదల చేసింది. అతి తక్కువ ధరలో రూ. 7.46 లక్షలు (ఎక్స్-షోరూమ్)కే ఈ కారును సంస్థ అందిస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఈ కారును విడుదల చేసినప్పటి నుంచే దీనికి సంబంధించిన బుకింగ్స్ ను సంస్థ స్వీకరిస్తుంది. రూ.11000 చెల్లించి దీనిని బుక్ చేసుకోవచ్చు.

సంస్థ ఈ కారును ప్రకటించినప్పటి నుంచే దీనిపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటివరకు ఈ కారును దాదాపు 39 వేల మందికి పైగా వినియోగదారులు బుక్ చేసుకున్నారు. దీంతో విడుదలకు ముందే ఈ అధునాతన SUV వార్తల్లో నిలిచింది. దీనిని మారుతి నెక్సా డీలర్ షిప్ ల ద్వారా విక్రయించనుంది. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇంకా మరెన్నో అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఈ కారు రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులోకి తీసుకువచ్చింది. 1.2-లీటర్ K-సిరీస్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 89.7 PS వద్ద 113 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఎంపికతో లభిస్తుంది.
ఇక మరొక ఇంజన్ 1.0-లీటర్ K-సిరీస్ టర్బో బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది. ఇది గరిష్టంగా 100 PS వద్ద 147.6 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో వినియోగదారులు 5 స్పీడ్ మాన్యువల్ అలానే 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతారు.
ఇది 22.89kmpl వరకు అధికంగా మైలేజ్ ను అందించగలదు. 1.2 లీటర్ ఇంజన్, 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ లో లీటర్ కి 21.79 కిమీ మైలేజ్ ని ఇస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ లో 22.89 కిమీ/లీ మైలేజ్ ని ఇస్తుంది. 1.0-లీటర్, 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ 21.50 కిమీ/లీ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లో 20.01 కిమీ/లీ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
కొత్త ఫ్రాంక్స్ కూపే SUV సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా,ఆల్ఫా అనే ఐదు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో కస్టమర్లు తమకు ఇష్టమైన వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. వేరియంట్ ని బట్టి ధర మారుతూ వస్తుంది. బేసిక్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు అందుబాటులో దీని ధరలు ఉన్నాయని చెప్పవచ్చు.
ఈ కొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ SUV ఆర్కిటిక్ వైట్, గ్రాండియర్ గ్రే, ఆర్టిన్ బ్రౌన్, స్లెయిన్ సిల్వర్, ఓపులెంట్ రెడ్, ఎర్త్ బ్రో విత్ బ్లూయిష్ బ్లాక్ రూఫ్, ఓపలెంట్ రెడ్ విత్ బ్లూయిష్ బ్లాక్ రూఫ్,స్లెయిన్ సిల్వర్ విత్ బ్లూ బ్లాక్ రూఫ్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇందులో కస్టమర్లు తమకు ఇష్టమైన కలర్ మోడల్‌ని ఎంచుకోవచ్చు.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే కొత్త మారుతి ఫ్రాంక్స్ లో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, సుజుకి కనెక్ట్, వాయిస్ కమాండ్‌లను వంటి అదనపు ఫీచర్లను కలిగి ఉంది. ఇది డిజిటల్ కన్సోల్, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఛార్జింగ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, వెనుక AC వెంట్‌లను కూడా కలిగి ఉంది.
ABS, EBD, ఎయిర్ బ్యాగ్స్ ఈఎల్ ఆర్ సీట్ బెల్ట్స్ తో పాటు హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ముందు భాగంలో ఆకర్షణీయమైన గ్రిల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, LED DRL ఉన్నాయి. 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ వెనుక వైపు ఆకర్షణీయమైన లుక్ తో దీనిని తీసుకువచ్చింది. ఇది 3995mm పొడవు, 1765mm వెడల్పు, 1550mm ఎత్తు, 2520mm వీల్‌బేస్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








