గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?

మారుతి సుజుకి తన 'గ్రాండ్ విటారా' SUV ని భారతీయ మార్కెట్లో విడుదలచేసినప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగింది. అయితే కంపెనీ ఇప్పుడు డెలివరీ చేసిన దాదాపు 11,000 కంటే ఎక్కువ విటారా SUV లకు రీకాల్ ప్రకటించింది. ఇంతకీ కంపెనీ రీకాల్ ప్రకటించడానికి గల కారణం ఇక్కడ తెలుసుకుందాం..రండి.

కొత్త గ్రాండ్ విటారా SUV యొక్క రియర్ సీట్ బెల్ట్ మౌంటు బ్రాకెట్లలో లోపం కారణంగా కంపెనీ ఇప్పుడు రీకాల్ ప్రకటించడం జరిగింది. 2022 ఆగష్టు 08 మరియు 2022 నవంబర్ 15 మధ్య చేయబడిన దాదాపు 11,177 యూనిట్లకు మారుతి సుజుకి రీకాల్ ప్రకటించింది. కంపెనీ గ్రాండ్ విటారా SUV కి రీకాల్ ప్రకటించడం ఇది రెండవ సారి. గతంలో గ్రాండ్ విటారా ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్‌లో లోపం కారణంగా రీకాల్ ప్రకటించింది.

గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి

ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్‌తో సమస్యకు సంబంధించి మారుతి సుజుకి రీకాల్ ప్రకటించిన తరువాత, టయోటా కంపెనీ తన టయోటా గ్లాంజా హ్యాచ్‌బ్యాక్ మరియు టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ లకు కూడా రీకాల్ ప్రకటించింది. అయితే కంపెనీ ఇప్పుడు ప్రకటించిన ఈ రీకాల్ లో SUV లో తలెత్తిన సమస్యను రూపుమాపుతుంది. భవిష్యత్ లో ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి కంపెనీ ఈ రీకాల్ ప్రకటించింది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా గమనించవలసిన డిజైన్ దాని ఫ్రంట్ స్టైలింగ్. దీని ముందుభాగంలో క్రోమ్-లైన్డ్ హెక్సా గోనల్ గ్రిల్, త్రీ పాయింట్ ఎల్ఈడీ డిఆర్ఎల్, హెడ్‌ల్యాంప్ క్లస్టర్, సైడ్ బాడీ ప్యానెల్‌లు, టెయిల్‌గేట్ మరియు ఇంటిగ్రేటెడ్ టెయిల్-ల్యాంప్‌ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా టెయిల్‌గేట్‌పై పూర్తిగా వెడల్పు అంతగా విస్తరించి ఉండే ఎల్ఈడీ లైట్ బార్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

ఇంటీరియర్ విషయానికి వస్తే, కొత్త గ్రాండ్ విటారాలో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ అందుబాటులో ఉంటుంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే వంటి వాటికి సపోర్ట్‌ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ కార్ టెక్ వంటివి టాప్-స్పెక్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి. స్టీరింగ్ వీల్ డిజైన్‌ హైరైడర్ మాదిరిగానే ఉంటుంది.

గ్రాండ్ విటారాలోని 1.5 లీటర్, 4 సిలిండర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ 103 హెచ్‌పి పవర్ మరియు 136 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఇక 1.5 లీటర్, 3 సిలిండర్ల అట్కిన్సన్ సైకిల్ TNGA పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 92 హెచ్‌పి పవర్ మరియు 122 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

అదే సమయంలో ఇది AC సింక్రోనస్ మోటార్‌తో కలిపి 79 హెచ్‌పి పవర్ మరియు 141 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మొత్తమ్ మీదుగా ఇది 115 హెచ్‌పి పవర్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ CVTతో జతచేయబడి ఉంటుంది. ఇది ఒక లీటరుకు 28 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. గ్రాండ్ విటారా మొత్తం 9 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఆరు మోనోటోన్ కలర్స్ కాగా, మిగిలిన మూడు డ్యూయల్ టోన్‌ కలర్స్.

మారుతి గ్రాండ్ విటారా యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ హోల్డ్ అసిస్ట్‌, 3-పాయింట్ సీట్ బెల్ట్స్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Maruti suzuki grand vitara recalls more than 11000 units details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X