భారత్‌లోకి మారుతి సుజుకి జిమ్నీ SUV.. ధర ఎంతంటే?
Maruti Suzuki Jimny (5 డోర్) భారత్‌లో విడుదల అయింది. 2018లో జిప్సీ ఉత్పత్తిని నిలిపివేసిన తర్వాత మారుతి సుజుకి జిమ్నీ రూపంలో భారత్ మార్కెట్లోకి తిరిగి ప్రవేశించింది. ఈ కారు అద్బుతమైన డిజైన్, ఆకట్టుకొనే ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకర్షించే అవకాశం ఉంది.
ఈ కారు మూడు ట్రిమ్ లెవల్స్ అంటే జీటా, ఆల్ఫా, ఆల్ఫా (డ్యూయర్ టోన్)లో అందుబాటులో ఉంది. మరియు ఈ మూడు ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో అందుబాటులో ఉంటుంది. దీంతో మారుతి సుజుకి జిమ్నీ మొత్తం ఆరు వేరియంట్లలో లభించనుంది. ప్రారంభ ధర రూ.12.74 లక్షల (ఎక్స్ షోరూం)గా ఉంది.

విదేశాల్లో విక్రయించిన జిమ్నీ తరహాలోనే భారత్లో లాంచ్ చేసిన జిమ్నీ ఉంది కానీ ఒక డోర్ అదనంగా కలిగి ఉంది. మారుతి సుజుకి జిమ్నీ లేడార్ ఫ్రేమ్ సెటప్‌తో 3 లింక్ రిజిడ్ యాక్సిల్ సస్పెన్షన్ సెటప్ మరియు కాయిల్ స్పింగ్‌లను ఉపయోగిస్తుంది. మరియు జిమ్నీ 15 అంగుళాల స్టీల్/ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.

మారుతి సుజుకి జమ్నీ K15B 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. 103.4bhp మరియు 134.2Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ మరియు 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ మరియు సుజుకి అల్ గ్రిప్ ప్రో 4 వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా శక్తి పంపబడుతుంది.

మారుతి సుజుకి జమ్నీ లోపలి భాగంలో 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేస్తుంది. ఇది మినహా మిగిలిన భాగం ఎంతో స్పార్టన్‌గా ఉంటుంది. హై డెఫినిషన్ డిస్‌ప్లే ఆర్కామిస్ ద్వారా సౌండ్ సిస్టమ్‌కు కనెక్ట్ చేయబడి ఉంటుంది.

ఈ ఫీచర్లతో పాటు మరిన్ని భద్రతా ఫీచర్లు కూడా మారుతి సుజుకి జిమ్నీ సొంతం. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS (యాంటీ బ్రేకింగ్ సిస్టమ్), బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ ప్రాగ్రాం (ESP), బ్రేక్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్సియల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెట్ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్‌లు, మరియు రేర్ వ్యూ కెమెరా ఉంటుంది.

బేస్ వేరియంట్ జిటా MT ధర రూ.12.74 లక్షలు, ఆల్ఫా MT ధర రూ.13.69 లక్షలు మరియు ఆల్ఫా MT (డ్యూయర్ టోన్) ధర రూ.13.85 లక్షలు ఉంది. ఆటోమేటిక్ వేరియంట్లు జిటా AT ధర రూ.13.94 లక్షలు, ఆల్ఫా AT ధర రూ.14.89 లక్షలు మరియు టాప్ ఎండ్ ఆల్ఫా AT (డ్యూయర్ టోన్) ధర రూ.15.05 లక్షలుగా ( అన్ని వేరియంట్లు ఎక్స్ షోరూం ధరలు) ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








