భారత్‌లో Maruti Suzuki Invicto MPV విడుదల.. మంచి మైలేజ్‌ సహా..!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి భారత మార్కెట్‌లో వరుసగా కార్లను విడుదల చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో Fronx, Jimny వాహనాలను విడుదల చేయగా తాజాగా Maruti Suzuki Invicto MPV లాంచ్‌ చేసింది. ఇన్విక్టో అనే పదం లాటిన్‌ నుంచి తీసుకోబడింది. ఈ వాహనాన్ని కర్ణాటకలోని బిడాడి ప్లాంట్‌లో తయారు చేయనున్నారు.

మారుతి సుజుకి మరియు టయోటా మధ్య బ్యాడ్జ్‌ స్వాపింగ్‌ ఒప్పందంలో భాగంగా ఇన్విక్టో ఎంపీవీ నిర్మించబడింది. కాబట్టి మారుతి సుజుకి ఇన్విక్టో.. టయాటో ఇన్నోవా హైక్రాస్‌ను రీబ్యాడ్జ్‌ వెర్షన్‌గా రానుంది. అయితే హైక్రాస్‌ మాదిరిగా కాకుండా ఇన్విక్టో ఒకే ఇంజిన్ అది కూడా శక్తివంతమైన హైబ్రిడ్‌ మోడల్‌తో అందించబడుతుంది.

Maruti Suzuki Invicto MPV

ఇన్విక్టో ఎంపీవీ అట్కిన్సన్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ మరియు NIMH బ్యాటరీ ప్యాక్‌తో కూడిన e CVT గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. ఈ శక్తివంతమైన హైబ్రిడ్‌ సిస్టమ్‌ 184 bhp గరిష్ఠ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కేవలం 9.5 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు 23.24 కి.మీ మైలేజ్‌ ఇస్తుంది.

టయోటా ఇన్నోవాతో పోలిస్తే మారుతి సుజుకి ఇన్విక్టో ఎంపీవీ సరికొత్త గ్రిల్‌ను కలిగి ఉంటుంది. సుజుకి బ్యాడ్జ్‌కి కనెక్ట్‌ చేసే క్రోమ్‌ స్లాట్‌ను కలిగి ఉంటుంది. ముందు, వెనుక బంపర్‌ల మాదిరిగానే హెడ్‌ల్యాంప్‌లు మరియు డీఆర్ఎల్‌లు రీడిజైన్‌ చేయబడ్డాయి. మారుతి కొత్త ఇన్విక్టో 18 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంటుంది.

Maruti Suzuki Invicto MPV

మారుతి సుజుకి ఇన్విక్టో లోపలి భాగం అప్హోల్స్టరీటతో సహా లగ్జరిగా ఉంటుంది. మరియు 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌.. ఆండ్రాయిడ్‌ ఆటో, కార్‌ప్లేలను సపోర్టు చేస్తుంది. మరియు వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, డ్రైవర్ సీట్‌ను అవసరానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు. రెండో వరుసలో ఓట్టోమన్‌ పనితీరుతో కూడిన కెప్టెన్‌ సీట్లు ఉన్నాయి.

మారుతి సుజుకి ఇన్విక్టో పనోరమిక్‌ సన్‌రూఫ్‌, యాంబియంట్‌ లైటింగ్‌, ప్రీమియం ఆడియో సిస్టమ్‌, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, 360 డిగ్రీ కెమెరా, వెర్‌లైస్‌ చార్జర్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది. దీంతోపాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS (యాంటీ బ్రేకింగ్‌ సిస్టమ్‌), వెహికల్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌, రివర్స్‌ పార్కింగ్‌ కెమెరా, ముందు, వెనుక పార్కింగ్‌ సెన్సార్‌లను కలిగి ఉంది.

Maruti Suzuki Invicto MPV

మారుతి సుజుకి ఇన్విక్టో ఎంపీవీ కారు మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. జిటా+ (7 సీటర్‌), జిటా+ (8 సీటర్‌), ఆల్ఫా+ (7 సీటర్‌)లో రానుంది. జిటా+ (7 సీటర్‌) ధర రూ. 24,79,000 (ఎక్స్‌షోరూం), జిటా+ (8 సీటర్‌) ధర రూ. 24,84,000 (ఎక్స్‌షోరూం), ఆల్ఫా+ (7 సీటర్‌) ధర రూ. 28,42,000 (ఎక్స్‌షోరూం)కు సొంతం చేసుకోవచ్చు.

Maruti Suzuki Invicto MPV

మారుతి సుజుకి ఇన్విక్టో నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. నెక్సా బ్లూ, మెజిస్టిక్‌ సిల్వర్‌, స్టెల్లార్‌ బ్రౌన్‌, మిస్టిక్‌ వైట్‌ రంగుల్లో లభిస్తుంది. మరియు 239 లీటర్ల బూట్‌ స్పెస్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు 4755మిమీ పొడవు, 1850మిమీ వెడల్పు, 1795 ఎత్తు ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, July 5, 2023, 14:12 [IST]
English summary
Maruti suzuki invicto mpv launched in india specs and features are here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+