అదిరిపోయే ఫీచర్లతో కొత్త మారుతి ఇన్విక్టో.. టీజర్ చూస్తే కొనకుండా ఉండలేరు..

మారుతీ సుజుకి కొత్త MPV ఇన్విక్టోను జూలై 5న భారత మార్కెట్‌లోకి విడుదల చేయనంది. ఇది ఇన్నోవా హైక్రాస్‌ ఆధారంగా రూపొందింబడింది. కాగా ఈ కారుకు సంబంధించి కొత్త టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ వీడియో టయోటా ఇన్నోవా హైక్రాస్‌తో పోలిస్తే ఇన్విక్టో పొందే మార్పులను ప్రదర్శిస్తుంది.

అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. వివిధ మోడళ్ల కార్లతో విక్రయాల్లో అగ్రగామిగా కొనసాగిస్తూ దశాబ్దాలుగా భారతీయ మార్కెట్‌ను శాసిస్తోంది. ఈ క్రమంలో భారత మార్కెట్లోకి అధునాతన ఫీచర్లతో కొత్త కార్ల కంపెనీల ప్రవేశం పెరిగింది. ఈ నేపథ్యంలో మారుతి నుంచి కొత్తగా ఇన్విక్టో మరికొద్ది రోజుల్లో మార్కెట్‌లోకి రానుంది. ఈ కారుకు సంబంధించి ఫీచర్లతో తాజాగా టీజర్‌ విడుదలైంది.

Maruti-Suzuki-Invicto

మారుతి సుజుకి కొత్త ఇన్విక్టో MPV ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ కారుకు సంబంధించిన 20 సెకన్ల టీజర్ వీడియోను కంపెనీ విడుదల చేసింది. ఈ కొత్త టీజర్ వీడియో రానున్న మారుతి సుజుకి ఇన్విక్టో MPV బగ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను వెల్లడించింది. ఈ వీడియో వెంటిలేటెడ్ లెదర్ సీట్ల క్లోజ్-అప్ పాసింగ్ షాట్‌తో ప్రారంభమవుతుంది.

టీజర్ వీడియోలో, కారు యొక్క ఫ్రంట్ గ్రిల్ పాక్షికంగా రివీల్ చేయబడింది. కారు వెనుక భాగంలో 'ఇన్విక్టో' బ్యాడ్జింగ్‌తో పాటు LED హెడ్ ల్యాంప్ ఇన్‌స్టాల్ అయి ఉంది. ఈ కొత్త మారుతి MPV ఇన్నోవా హైక్రాస్‌ ఆధారంగా రూపొందించబడింది. ఇన్విక్టో బిడాడి ప్లాంట్‌లో తయారు అవుతోంది. ఈ కొత్త MPV కొనుగోలుకు సంబంధించిన అధికారికంగా బుకింగ్‌లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

Maruti-Suzuki-Invicto

కొత్త ఇన్విక్టో కారు యొక్క బంపర్ కూడా టయోటా నుంచి భిన్నంగా కనిపిస్తోంది. అల్లాయ్ వీల్స్ మరియు టెయిల్ గేట్ ఇప్పుడు సుజుకి లోగోను కలిగి ఉంటాయి. ఇన్విక్టో టయోటా యొక్క TNGA-C ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించబడింది. అంతేకాకుండా మోనోకోక్ ఛాసిస్‌ను కలిగి ఉంటుంది. ఇది 2.0 లీటర్, 4 సిలిండర్ అట్కిన్సన్ సైకిల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ మరియు 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో అందుబాటులోకి రానుంది.

కొత్త మారుతి ఇన్విక్టో MPV యొక్క ప్లాట్‌ఫారమ్, కొలతలు, ఫీచర్లు మరియు పవర్‌ట్రెయిన్‌లు టొయోటా ఇన్నోవా హైక్రాస్‌ని పోలి ఉంటాయి. కాగా కొంచెం భిన్నంగా ఉండేందుకు పలు మార్పులు చేశారు. ముందు భాగంలో చాలా మార్పులతో రానుంది. కొత్త మారుతి ఇన్విక్టో.. గ్రాండ్ విటారా మాదిరిగానే ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంటుందని, దాని మధ్యలో సుజుకి బ్యాడ్జ్ ఉంటుందని స్పై చిత్రాలు వెల్లడిస్తున్నాయి.

Maruti-Suzuki-Invicto

ఇన్విక్టో మైలేజ్‌ను చూసుకుంటే టయోటా ఇన్నోవా హైక్రాస్‌ మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో 23.24 kmpl మరియు పెట్రోల్ యూనిట్‌తో 16.13 kmpl మైలేజీని అందిస్తుంది. ఇంటీరియర్ డిజైన్‌ విషయానికొస్తే ఇన్విక్టో ఎమ్‌పివి 7- మరియు 8-సీట్ల కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది.

కొత్త మారుతి ఇన్విక్టో కారు ఫీచర్లు చూస్తే ఇది పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 9-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్‌ని అందిస్తుంది.

Maruti-Suzuki-Invicto

ఫ్లాగ్‌షిప్ మోడల్ కావడంతో మారుతి సుజుకి ఇన్విక్టో అనేక అధునాతన కంఫర్ట్ బటన్‌లు మరియు భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది. కొత్త మారుతి ఇన్విక్టో మోడల్ లైనప్ కొన్ని వేరియంట్‌లకే పరిమితం కావచ్చు. మారుతి సుజుకి బ్రాండ్‌గా మరియు ఇన్నోవా హైక్రాస్‌ను రీబ్యాడ్జ్ చేయడం వల్ల ఈ కారు ఎక్కువ మందిని ఆకర్షించే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, June 22, 2023, 14:52 [IST]
English summary
Maruti suzuki invicto teaser released shows features over the toyota innova hycross
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+