సరికొత్త భద్రతా ఫీచర్లతో మారుతి సుజుకి ఇన్విక్టో బేస్ వేరియంట్..!!
భారత్ మార్కెట్‌లో మారుతి సుజుకీ కార్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. తన ఆధిపత్యాన్ని నిలుపుకొనేందుకు కొత్త కార్లను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మారుతి సుజుకి ఇన్విక్టోను గత నెలలో విడుదల చేసింది. ఇన్విక్టో కారు ఎంట్రీ లెవల్ జీటా ప్లస్ వేరియంట్ ఇప్పుడు వెనుక సీట్‌బెల్ట్ రిమైండర్‌తో వస్తుంది. ప్రస్తుతం ఇన్విక్టో ధర రూ.24.82 లక్షల (ఎక్స్‌షోరూం)తో ప్రారంభం అవుతుంది.
లాంచ్ సమయంలో టాప్ ఎండ్ వేరియంట్ ఆల్ఫా ప్లస్‌లో మాత్రమే వెనుక సీట్ బెల్ట్ రిమైండర్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం లాంచ్ కానున్న అన్ని కార్లలో ఈ ఫీచర్‌ను తప్పనిసరి చేసింది. దీంతో వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణికులు కూడా సీట్ బెల్ట్‌లు ధరించాలని ఈ ఫీచర్ గుర్తుచేస్తుంది. ఫలితంగా ఈ కారు ధర రూ.3000 పెరిగింది.

టయాటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా మారుతి సుజుకి ఇన్విక్టో కారు విడుదల అయింది. టయోటా, మారుతి సుజుకి ఇప్పటికే ఉన్న బ్యాడ్జ్ స్వాపింగ్ డీల్‌లో భాగంగా ఈ కారును తయారుచేశారు. ఇన్నోవా తరహాలోనే ఇన్విక్టో కూడా ఆకట్టుకొనే అవకాశం ఉంది. సుజుకి నెక్సా డీలర్‌షిప్‌లో లాంచ్ అయిన ఎనిమిదో మోడల్.. ఇన్విక్టో. మారుతి ఇన్విక్టో MPV నెక్సా బ్లూ, మిస్టిక్ వైట్, మెజిస్టిక్ సిల్వర్, స్టిల్లర్ బ్రౌన్స్ నాలుగు రంగుల్లో లభిస్తుంది.
మారుతి సుజుకి హైబ్రిడ్ సెటప్‌లో అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్‌తోపాటు NIMH బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిగి ఉంటుంది. e-CVT గేర్‌బాక్స్‌తో పాటు సమీకృత హైబ్రిడ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. 184bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 9.5 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. మారుతి ఇన్విక్టో 23.24 kmpl మైలేజీని ఇస్తుంది.

ఈ కొత్త MPV సరికొత్త గ్రిల్‌తో వస్తుంది. సుజుకి బ్యాడ్జ్‌కి LED హెడ్‌లైట్‌లను కనెక్ట్ చేసే క్రోమ్ స్లాట్‌లను కలిగి ఉంది. ముందు, వెనుక బంపర్‌ల మాదిరిగానే హెడ్‌ల్యాంప్‌లు మరియు DRLలు అప్‌డేట్ చేయబడ్డాయి. కారు లోపలి భాగంలో ఖరీదైన అప్హోల్స్టరీతో పాటు లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. డ్యాష్‌బోర్డు 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ల్‌ప్లేకి మద్దతు ఇస్తుంది.
మారుతి సుజుకి ఇన్విక్టో పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం ఆడియో సిస్టమ్, సుజుకి కనెక్ట్ సూట్‌ను కలిగి ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, వెర్‌లైస్ ఛార్జర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. డ్రైవర్ సీటు 8 విధాలుగా సర్టుబాటు చేయవచ్చు. రెండు, మూడు వరుసలో కెప్టెన్ సీట్లు ఉంటాయి.

దీంతోపాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS (యాంటీ బ్రేకింగ్ సిస్టమ్), వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్‌లను కలిగి ఉంది. మరియు 239 లీటర్ల బూట్ స్పెస్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు 4755మిమీ పొడవు, 1850మిమీ వెడల్పు, 1795 ఎత్తు ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








