Maruti Suzuki Jimny ఆటోమేటిక్ వేరియంట్‌కు భారీ డిమాండ్.. ఏంటి కారు ప్రత్యేకత!
మారుతి జిమ్నీ.. ఇటీవల భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో (Maruti suzuki Jimny) అందుబాటులోకి వచ్చింది. అతికొద్ది కాలంలో భారీగా ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ పలు వేరియంట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్న ఆటోమేటిక్ వేరియంట్‌కు- AT భారీ డిమాండ్ ఉంది.
2023 జనవరిలో ఢిల్లీలో నిర్వహించిన ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి.. జిమ్నీ 5-డోర్ ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీను ఆవిష్కరించింది. అప్పుడే బుకింగ్‌ను ప్రారంభించింది. ఈ ఎస్‌యూవీని జూన్‌లో మారుతి సుజుకి సంస్థ విడుదల చేసింది. ఈ కారు అనేక వేరియంట్లలో అందుబాటులో ఉండగా.. AT వేరియంట్‌కు భారీ ఆదరణ లభిస్తోంది.

ప్రతి నెల 2500 యూనిట్ల ఉత్పత్తి: మారుతి సుజుకి సంస్థ 14,500 యూనిట్ల జిమ్నీ 5- డోర్ ఎస్‌యూవీను లాంచ్ చేసింది. వాటిలో ఇప్పటి వరకు 10,000 యూనిట్లు విక్రయించినట్లు తెలుస్తోంది. ఆఫ్‌రోడ్ SUV జిమ్నీకి ఉన్న భారీ డిమాండ్ కారణంగా ప్రస్తుతం ప్రతి నెల 2500 యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. మారుతి సుజుకి జమ్నికి గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో అధిక డిమాండ్ ఉంది.
భారత్ మార్కెట్‌లో మారుతి జిమ్నీ 5 డోర్ ఎస్‌యూవీ ధర రూ.12.74 లక్షల నుంచి రూ.15.05 లక్షలు (ఎక్స్‌షోరూం) ధరకు అందుబాటులో ఉంది. ఈ ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ 1.5 లీటర్ K- సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 6000 rpm వద్ద 103bhp శక్తిని, 4000rpm వద్ద 134.2 గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మైలేజీ: జిమ్నీ SUV మాన్యువల్ వేరియంట్ 16.94 km/l మైలేజీ ఇస్తుంది. అదే ఆటోమేటిక్ వేరియంట్ 16.39 km/l మైలేజ్ ఇస్తుంది. 40 లీటర్ల ఇంధన ట్యాంక్ కలిగి ఉన్న మారుతి సుజుకి జిమ్నీ 650 కి.మీ మేర మైలేజీ ఇస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, 4- స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది.
మారుతి జిమ్ని ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ డిజైన్ పరంగా ఆకట్టుకుంది. ఫ్లాట్ క్లామ్‌షెల్ బానెట్, LED ప్రాజెక్టర్ హెడ్‌ల్యాంప్, అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ కారు 4 వీల్ డ్రైవ్ టెక్నాలజీపై పనిచేస్తుంది. ఈ ఎస్‌యూవీ 2590mm వీల్ బేస్‌తో వస్తుంది.

ఈ వాహనం కీలక ఫీచర్లను కలిగి ఉంది. 9 అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ వంటి అనేక అధునాత ఫీచర్లతో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది.
భద్రతా పరంగాను అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS- యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, END- ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, సైడ్ ఇంపాక్ట్ డోర్ బీమ్‌లతో సహా డజర్ల కొద్దీ భద్రతా ఫీచర్లను మారుతి 5-డోర్ ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ జిమ్నీ కలిగి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








