బుకింగ్ ప్రైస్ పెరిగిన జోరు తగ్గని బుకింగ్స్: అట్లుంటది Maruti Jimny అంటే..

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన మారుతి సుజుకి యొక్క 5 డోర్స్ జిమ్ని ఎంతో మంది వాహన ప్రేమికులను ఆకర్శించడంలో విజయం పొందింది. కంపెనీ ఈ SUV కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 10 రోజుల్లో అద్భుతమైన బుకింగ్స్ వచ్చేసాయి.

కంపెనీ ఈ కొత్త 5 డోర్స్ జిమ్ని ఆవిష్కరించిన రోజు నుంచి రూ. 11,000 మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే బుకింగ్స్ ప్రారంభమైన రెండు రోజులకే జిమ్ని ఏకంగా 3,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందగలిగింది. తరువాత కంపెనీ ఈ బుకింగ్ ధరలు రూ. 25,000 కు పెంచింది. అయినప్పటికి బుకింగ్స్ పెరుగుతూనే ఉన్నాయి. బుకింగ్ ధర పెరిగినప్పటికీ జిమ్ని బుకింగ్స్ ఇప్పటికి 10,000 దాటేశాయి.

బుకింగ్ ప్రైస్ పెరిగిన తగ్గని Maruti Jimny బుకింగ్స్..

బుకింగ్ ప్రైస్ పెరిగినప్పటికీ బుకింగ్స్ మాత్రం రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే మారుతి 5 డోర్స్ జిమ్నికి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందొ స్పష్టంగా అర్థమవుతోంది. కంపెనీ ఈ SUV ని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది, అదే రోజున ఈ SUV ధరలు కూడా ప్రకటించనుంది. ధరలు తెలియకపోయినా జిమ్ని బుకింగ్స్ తారాజువ్వలా పెరిగిపోతున్నాయి.

మారుతి సుజుకి 5 డోర్స్ జిమ్నీ కొనాలనుకునే కస్టమర్లు దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ యొక్క Nexa డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. ఈ SUV ప్రపంచ మార్కెట్లో విక్రయించడానికి ముందే దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. జిమ్నీ SUV రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి జీటా మరియు ఆల్ఫా. అంతే కాకుండా ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్సన్స్ తో అందించే అవకాశం కూడా ఉంటుంది.

మారుతి 5 డోర్స్ జిమ్నీ కైనెటిక్ ఎల్లో, సిజ్లింగ్ రెడ్, గ్రానైట్ గ్రే, నెక్సా బ్లూ, బ్లూయిష్ బ్లాక్, పెరల్ ఆర్కిటిక్ వైట్ కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. కొత్త జిమ్నీ లాడెర్ ఫ్రేమ్ ఛాసిస్‌ను కలిగి ఉంది. కావున ఈ SUV నాలుగు మూలల్లో కాయిల్ స్ప్రింగ్‌లతో 3-లింక్ రిజిడ్ యాక్సిల్ టైప్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. పరిమాణం పరంగా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

మారుతి సుజుకి జిమ్నీ గొప్ప ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది, ఈ SUV లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, బ్లాక్ కలర్ బంపర్‌లు, ఫ్లాప్ టైప్ డోర్ హ్యాండిల్స్ మరియు స్లైడింగ్ రియర్ విండో వంటివి ఉన్నాయి. ఈ SUV లో 2 కెప్టెన్ సీట్లు మరియు వెనుక వైపు ముగ్గురు ప్రయాణీకులకు ఒక బెంచ్ ఉంటాయి. సైడ్ మరియు రియర్ ప్రొఫైల్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. రూప్ మాత్రం బ్లాక్ కలర్ ఉండటం చూడవచ్చు.

బుకింగ్ ప్రైస్ పెరిగిన తగ్గని Maruti Jimny బుకింగ్స్..

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. డాష్‌బోర్డ్ రెండు చివరలో రౌండ్ ఎయిర్ వెంట్స్ ఉంటాయి. ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే కింద మ్యాన్యువల్ బటన్లు ఉండటం కూడా గమనించవచ్చు. రెండవ వరుస ప్రయాణికుల కోసం బాటిల్ హోల్డర్స్ మరియు ఛార్జింగ్ సాకేట్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.

కొత్త మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్ K15B పెట్రోల్ ఇంజన్‌ పొందుతుంది. ఇది 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్సన్స్ పొందుతుంది. సుజుకి యొక్క లెజెండరీ ఆల్ గ్రిప్ ప్రో ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా జిమ్నీ యొక్క నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ పంపుతుంది.

మారుతి 5 డోర్స్ జిమ్నీ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, బ్రేక్స్ అసిస్ట్, రియర్ వ్యూ కెమెరా మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంటు ఎంకరేజ్‌ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వాహనం వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.

Most Read Articles

English summary
Maruti suzuki jimny bookings 10000 units in 10 days details
Story first published: Tuesday, January 24, 2023, 8:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X