ఈ కారును ఇవాళ బుక్ చేసినా డెలివరీకి 8 నెలలు పడుతుంది..!!
మారుతి సుజుకి జనవరిలో ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో జిమ్మీని ప్రదర్శించింది. మరియు భారత మార్కెట్‌లోకి ఇటీవల మారుతి సుజుకి జిమ్నీ విడుదల అయింది. 5 డోర్లు కలిగిన జిమ్నీ SUV.. జిటా మరియు ఆల్ఫా రెండు వేరియంట్లు అందుబాటులో ఉంది. అలాగే ఆకర్షణీయమైన లుక్‌తో జిమ్నీ వెంటనే ఆకట్టుకుంటుంది. అలాగే క్యాబిన్ లోపలి భాగం మంచి ఫీచర్లు, డిజైన్‌తో సౌకర్యవంతంగా ఉంటుంది.
మారుతి సుజుకి జిమ్నీ SUV 1.5 లీటర్, 4- సిలిండర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 103bhp వద్ద 134.2Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు జిమ్నీ 4- స్పీడ్ ఆటోమేటిక్ మరియు 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్‌లు కలిగి ఉంది.

జిమ్నీ SUV మాన్యువల్ వేరియంట్ 16.94 km/l మైలేజీ ఇస్తుందని మారుతి సుజుకి తెలిపింది. అదే ఆటోమేటిక్ వేరియంట్ 16.39 km/l మైలేజ్ ఇస్తుంది. 40 లీటర్ల ఇంధన ట్యాంక్ కలిగి ఉన్న మారుతి సుజుకి జిమ్నీ 650 కి.మీ మేర మైలేజీ ఇస్తుంది.
మారుతి సుజుకి జిమ్నీ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. కారులోపల 9 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ వంటి అనేక ఫీచర్లు జిమ్నీ సొంతం.

భద్రత పరంగాను జిమ్నీ SUV మంచి ఫీచర్లను కలిగి ఉంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), హిల్ డిసెంట్ కంట్రోల్, సైడ్ ఇంపాక్ట్ డోర్ భీమ్స్, 3- పాయింట్ లాకింగ్, ఎమర్జెన్సీ కెమెరాను కలిగి ఉంటుంది. మారుతి సుజికీ జిమ్నీ SUV యొక్క అన్ని వేరియంట్లు సుజుకీ యొక్క AllGrip Pro 4WD సిస్టమ్‌తో వస్తాయి.
మారుతి సుజుకి జిమ్నీ SUV ఇక ధరల విషయానికి వస్తే.. మాన్యువల్ ట్రాన్సిమిషన్ జిటా వేరియంట్ ధర రూ.12.74 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది. అదే టాప్ స్పెసిఫికేషన్లు, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన ఆల్ఫా వేరియంట్ ధర రూ.15.05 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది.

మారుతి సుజుకి జిమ్నీ ఇప్పటి వరకు 31,000 బుకింగ్‌ను సొంతం చేసుకుంది. ఈ వాహనాన్ని ఇవాళ బుక్ చేసినా డెలివరీ తీసుకొనేందుకు సుమారు 8 నెలలు వేచి ఉండాల్సిందే. ఇప్పటి వరకు వచ్చిన బుకింగ్‌ల్లో మాన్యువల్ వేరియంట్లపైనే ఎక్కువ మంది మక్కువ చూపారని మారుతి సుజుకి తెలిపింది. అలాగే అధిక స్పెసిఫికేషన్లు కలిగిన ఆల్ఫా వేరియంట్ కూడా ఎక్కువ బుకింగ్‌లు వచ్చాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








