కొనసాగుతున్న మారుతి 'నెక్సా' జోరు.. ఏకంగా 20 లక్షల యూనిట్ల సేల్స్ తో హోరు

తన రిటైల్ అమ్మకాల చైన్ విభాగం నెక్సా నుంచి ఇప్పటివరకు 20 లక్షలకు పైగా యూనిట్లను సేల్ చేసినట్లు మారుతి సుజుకి ప్రకటించింది. 2015 నుంచి నేటి వరకు దాదాపు 2మిలియన్ వాహనాలను విక్రయించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. 1 మిలియన్ చేరుకోవడాని ఒక సంవత్సరం పట్టిందని తాజాగా ఈ మైల్ స్టోన్ ని చేరుకున్నట్లు పేర్కొంది.

కోవిడ్-19 మహమ్మారి కారణంగా సేల్స్ కొంచెం నెమ్మదించిన పెట్టుకున్న లక్ష్యం ప్రకారం టార్గెట్ ని రీచ్ అయినట్లు వెల్లడించింది. మారుతి సుజుకి నుంచి నెక్సా మరింత ప్రీమియం రిటైల్ చైన్‌గా స్థాపించబడింది. కార్‌మేకర్ అందించే కొన్ని మోడళ్లను నెక్సా ద్వారా విక్రయాలకు కేటాయించారు. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 480 Nexa రిటైల్ అవుట్‌లెట్‌లు ఉన్నాయి.

నెక్సా సేల్స్
వివిధ బ్రాండ్స్ తో దూసుకుపోతున్న నెక్సా..

బ్రాండ్ క్రింద ఉన్న ఇతర రిటైల్ గొలుసును అరేనా అంటారు. ప్రస్తుతం, Baleno, XL6, Ciaz, Ignis, సరికొత్త గ్రాండ్ విటారా వంటి మోడల్‌లు Nexa ద్వారా అందించబడుతున్నాయి. అయితే రాబోయే కాలంలో Fronx , Jimny కూడా దీని కిందకే రానున్నాయి. నెక్సా నుంచి వస్తున్న అత్యాధునిక కార్లుగా ఇవి రికార్డ్ సృష్టించనున్నాయి.

Alto, S-Presso, Celerio, WagonR, Brezza వంటి మోడల్‌లు Arena రిటైల్ చైన్ ద్వారా అందించబడుతున్నాయి. రిటైల్ మార్కెట్ లో నెక్సా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఈ రిటైల్ చైన్ నుంచి కొనుగోలు చేసిన కార్లకు ఆకర్షణీయమైన ఆఫర్లతో పాటు మంచి సర్వీస్ ను అందిస్తుండటంతో నెక్సా దూసుకెళ్తుంది. ఫ్యూచర్ లో మరిన్నీ సేల్స్ పెరిగే అవకాశం ఉంది.

ఫ్రాంక్స్

పెరగనున్న సేల్స్..

సరికొత్తగా మారుతి సుజుకి ప్రవేశ పెట్టన ఫ్రాంక్స్, జిమ్నీలు విడుదలకు ముందే భారీ అంచనాలకు తెరలేపాయి. ఈ కార్లు Nexa రిటైల్ చైన్‌లో ప్రత్యేకంగా విక్రయించనుంది. ఈ రెండు వాహనాలు జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించబడ్డాయి. వీటికి సంబంధించిన బుకింగ్స్ ని సంస్థ ఇప్పటికే ఆహ్వానిస్తోంది.

దేశంలోని SUV లైనప్‌లలో మారుతి నుంచి బ్రెజా, గ్రాండ్ విటారాలను కలిగి ఉంది. ఫ్రాంక్స్, జిమ్నీ రెండూ కూడా అతిపెద్ద SUVలుగా పేరుపొందనున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటి సేల్స్ నెక్సాకు మరింత ఊతమిస్తాయని సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. వీటి అమ్మకాలతో మార్కెట్ లో మారుతి తన హవానప కొనసాగించనుంది.

బాలెనో

బాలెనో బెస్ట్..

నెక్సా కింద, బాలెనో అతిపెద్ద వాటాను కలిగి ఉందని చెప్పవచ్చు. ఇది (ప్రయాణికుల వాహన) పరిశ్రమలో అత్యధికంగా అమ్ముడైన రెండవ ఉత్పత్తిగా కొనసాగుతోంది. రానున్న రోజుల్లో మారుతి ఫ్రాంక్స్‌ దీనిని అధిగమిస్తుందని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.

నెక్సా కింద మొత్తం 370,000 యూనిట్లను విక్రయించేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. గత సంవత్సరం 255,000 యూనిట్లు విక్రయించినట్లు చెప్పారు. Nexa కూడా దాదాపు పది శాతం మార్కెట్ వాటాను కలిగి ఉందని.. అతి మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు

More from DriveSpark

Article Published On: Friday, March 24, 2023, 14:50 [IST]
English summary
Maruti suzuki nexa sold two million units in india creates history here the full details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+