Maruti Suzuki కార్లపై భారీ డిస్కౌంట్లు.. సెప్టెంబర్ నెలవరకు మాత్రమే..!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఎంపిక చేసిన కార్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు సెప్టెంబర్ నెలవరకు వర్తిస్తాయని తెలిపింది. Alto K10, S-Presso, Celerio, Swift కార్లపై కార్పొరేట్ బోనస్, నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్ రూపంలో సుమారు రూ.40 వేల వరకు తగ్గింపును పొందవచ్చుని మారుతి తెలిపింది. అయితే మారుతి సుజుకి బ్రెజ్జా, డిజైర్‌లపై ఎటువంటి తగ్గింపులు లేవని పేర్కొంది.
మారుతి సుజుకి సెలెరియో హైఎండ్ మోడల్‌పై రూ.40వేల వరకు తగ్గింపును పొందవచ్చు. సెలెరియో బేస్ మోడల్‌పై రూ.30,000 తగ్గింపు ధరను పొందవచ్చు. మారుతి సుజుకి సెలెరియో కారు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 67hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.5.37 లక్షలుగా ఉంది. అదే టాప్ వేరియంట్ రూ.7.15 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది.

మారుతి సుజుకి ఆల్టో K10 కారు పెట్రోల్ వేరియంట్‌పై గరిష్ఠంగా రూ.35000 వరకు తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. అదే K10 CNG వేరియంట్‌పై సెప్టెంబర్ నెలలో గరిష్ఠంగా రూ.32 వేల తగ్గింపు ధరను పొందవచ్చుని మారుతి సుజుకి సంస్థ వెల్లడించింది.
ఆల్టో k10 కారు 1,0 లీటర్ 3 సిలిండర్ K10C పెట్రోల్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 67hp శక్తి, 89Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు బేస్‌మోడల్ రూ. 3.99 లక్షలకాగా.. టాప్ వేరియంట్ రూ.5.96 లక్షలుగా ఉంది.

మారుతి సుజుకి S- ప్రెస్సో సెప్టెంబర్ నెలలో ఈ కారుపై రూ.35 వేల తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ కారు బేస్ వేరియంట్‌పై రూ.30000 తగ్గింపును పొందవచ్చు, అదే ఇతర వేరియంట్లపై రూ.35000 తగ్గింపు ధరను పొందవచ్చు. ఈ కారు K10c ఇంజిన్ 67 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు బేస్ వేరియంట్ రూ.6.12 లక్షలుగా ఉంది.
మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ సెప్టెంబర్ నెలలో ఈ కార్ల CNG.. VXi, LXi వేరియంట్లు రూ.30000 వరకు తగ్గింపు ధరలో అందుబాటులో ఉంటాయి. వ్యాగన్‌ఆర్ బేస్ వేరియంట్‌పై రూ.35 వేల తగ్గింపు ధరలో కొనుగోలు చేయవచ్చు. హైఎండ్ మోడల్ రూ.25000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.2L పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.5.55 లక్షలుగా ఉంది. అదే హైఎండ్ మోడల్ రూ.8.50 లక్షలుగా ఉంది.
మారుతి సుజుకి స్విఫ్ట్ సెప్టెంబర్ నెలలో ఈ కారు బేస్ వేరియంట్‌పై రూ.35000 వరకు తగ్గింపును పొందవచ్చు. అదే హైఎండ్ మోడల్‌పై రూ.25000 తగ్గింపును పొందవచ్చు. ఈ కారు 1.2 లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 90hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు బేస్ వేరియంట్ ధర రూ5.99 లక్షలుగా ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








