Maruti Suzuki ఈ కార్లను కొనేందుకు లక్షల మంది క్యూ.. ఇప్పుడు బుక్‌ చేస్తే 8 నెలలు వెయిట్‌ చేయాల్సిందే..

భారత్‌లో మారుతి సుజుకి అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారుగా ఉందనడంలో సందేహం లేదు. SUV విభాగంలో అత్యధిక మార్కెట్ వాటాను కలిగి ఉంది. గత కొన్ని నెలలుగా కంపెనీ ప్రారంభించిన బ్రెజ్జా, గ్రాండ్ విటారా ఫ్రాంక్‌ మరియు కొత్త ఆఫ్-రోడ్ SUV జిమ్నీ దీనికి కారణం.

ప్రస్తుతం మారుతీ సుజుకీ కంపెనీ దేశీయ మార్కెట్లో 50 శాతం వాటాను కలిగి ఉంది. ముఖ్యంగా SUV సెగ్మెంట్‌లో అద్భుతమైన పురోగతిని సాధించింది. 10.2 శాతం నుంచి 25 శాతం వృద్ధిని సాధించింది. కాగా ఇప్పటికే కంపెనీకి మొత్తం 3.86 లక్షల కార్ల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో జిమ్నీ 5 డోర్ 31 వేల కంటే ఎక్కువ బుకింగ్‌లను కలిగి ఉంది.

Maruti-Suzuki-Cars

8 నెలల వెయిటింగ్ పీరియడ్‌తో దాదాపు 151 మంది వ్యక్తులు ప్రతిరోజూ జిమ్నీ కోసం ఆర్డర్లు చేస్తున్నారు. గ్రాండ్ విటారా 33 వేల యూనిట్లు, బ్రెజ్జా 55 వేల యూనిట్లు మరియు ఫ్రాంక్ SUV 28 వేల యూనిట్లను డెలివరీ చేయాల్సి ఉంది. ఎర్టిగా MPV పై 85 వేల యూనిట్ల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఫ్రాంక్‌ 4 నెలల తర్వాత, ఎర్టిగా 5 నెలల తర్వాత డెలివరీ చేయనున్నాయి.

మార్కెట్‌లో మారుతి సుజుకి జిమ్నీ 5 డోర్ చాలా డిమాండ్ ఉన్న ఆఫ్-రోడ్ SUV. ఇందులో శక్తివంతమైన 1.5L K-సీరియస్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది 16.39km/l మైలేజీని అందిస్తుంది. వేరియంట్లను బట్టి దీని ధర రూ. 12.74 లక్షల నుంచి రూ. 15.05 లక్షల వరకు ఉంది.

Maruti-Jimny

ఫ్రాంక్ ఎస్‌యూవీలో రెండు ఇంజిన్లను ఎంపిక చేసుకోవచ్చు. 1.2 లీటర్ కె సీరియస్ డ్యూయల్ జెట్ పెట్రోల్, 1.0 లీటర్ కె సీరియస్ టర్బో బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజిన్ ఉన్నాయి. ఇది 20.01 km/l నుంచి 22.89 km/l మైలేజీని ఇస్తుంది. 9.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఫీచర్లతో వస్తుంది. ధర రూ. 7.46 లక్షలుగా ఉంది.

ఇక కస్టమర్స్‌ ఫేవరెట్‌ జాబితాలో గ్రాండ్ విటారా పెట్రోల్ మరియు CNG ఇంజిన్‌లను కలిగి ఉంది. ఇది భద్రత పరంగా అధునాతనమైనది. ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), ABS (యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. దీని ధర రూ.10.70 లక్షల నుంచి రూ.19.79 లక్షల మధ్య ఉంది.

Maruti-Garnd-Vitara

మారుతీ సుజుకి నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో బ్రెజ్జా ఒకటి. ఇది పెట్రోల్ మరియు CNG ఇంజిన్ ఎంపికలను కలిగి ఉంది. ఇది 19.8 - 20.15 kmpl మైలేజీని అందిస్తుంది. ఐదు-సీట్ల ఎంపికతో పాటు 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి వివిధ లక్షణాలను కలిగి ఉంది. ఇది రూ. 8.29 లక్షల నుంచి రూ.14.14 లక్షల ధరలో అందుబాటులో ఉంటుంది.

ఇక ఎర్టిగా MPV ని చూసుకుంటే ఇందులో ఏడుగురు సౌకర్యవంతంగా కూర్చోగలరు. అలాగే, దేశీయ విపణిలో నంబర్ వన్ స్థానంలో ఉన్న మారుతి సుజుకి, టయోటాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. త్వరలో భారత్‌లో ఇన్నోవా హిక్రాస్ ఆధారంగా ఇన్విక్టో ఎమ్‌పీవీని విడుదల చేయనుంది. దీని ధర రూ.8.64 లక్షల నుంచి రూ. 13.08 లక్షల ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, June 19, 2023, 8:54 [IST]
English summary
Maruti suzuki pending orders for top 5 brands cars details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+